28, ఫిబ్రవరి 2011, సోమవారం
రైల్‌రోకోను అడ్డుకునేందుకు టాస్క్‌ఫోర్స్
నగదు బదిలీ ని కాపీ కొడుతున్న కాంగ్రెస్
కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలన్న ఆలోచన తప్ప రాష్ట్రాభివృద్ధికి నిధులు అందించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి, నడిపించగల వాయిస్ స్పీకర్‌కు లేదని.. ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుందనే భయంతోనే సమస్యలు చర్చకు రానివ్వడం లేదని యనమల ఆరోపించారు. రైతాంగం సమస్యలపై చర్చిద్దామంటే అసలు టీడీపీకి అవ కాశం ఇవ్వకుండా అసెంబ్లీని వాయిదా వేస్తున్నారన్నారు.
మా వాళ్ళూ గాయపడ్డారు.. డిఐజి సౌమ్య మిశ్రా
పెన్ను మూసిన ముళ్ళపూడి
ఆయన సినీ రంగ ప్రవేశమే ఎంతో విచిత్రంగా జరిగింది. బైట గొప్ప హాస్య రచయితగా పేరున్న రమణ అనూహ్యంగా రక్తసంబంధం లాంటి గొెప్ప విషాదభరిత, సెంటిమెంట్ సినిమాకు పనిచెశారు. 1961లో రిలీజ్ అయిన పాశమలర్ తెలుగులో రక్తసంబంధంగా రీమేక్ చేసారు. అప్పటిదాకా మిస్మమ్మ... గుండమ్మ కథ...లాంటి సినిమాల్లో జంటగా ఎన్టీఆర్...సావిత్రి అన్నాచెల్లెళ్లగా 'ఇందులో నటించడమే కాదు...కరుణరసాన్ని అద్భుతంగా పండించారు. మరో అల్ టైం క్లాసిక్ మూగమనసులు సినిమాలో ఆత్రేయతో కలిసి చేశారు. అప్పటిదాకా గొప్ప గ్లామర్ పైర్‌గా వెలిగిపోతున్న సావిత్రి అక్కినేని కాంబినేషన్‌ను అనూహ్యమైన మలుపు తిప్పారు. సావిత్రి వద్ద పనిచేసే పాత్రలో అక్కినేని తీసుకోవడం, సావిత్రితో రా అని పించడం యాంటి సెంటిమెంట్ అప్రోచ్‌తో సినిమాను సూపర్ డూపర్ హిట్ చేయడంలో ఆయన పాత్ర కూడా ఉంది.
బాపు, ముళ్లపూడి ప్రాణ స్నేహితులు. ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాల వంటి వారు. వారి అనుబంధం షష్టిపూర్తి కూడా చేసుకుంది. స్కూల్లో మొగ్గ తొడిగిన ఆ స్నేహం పత్రికా రంగంలో కొంటె బొమ్మగా, చలన చిత్రరంగంలో కదిలించే బొమ్మగా ప్రతి ఫలించింది. రచయితకు సినిమా రంగంలో ఉన్న విలువేంటో అయిదేళ్లలో...ఏడెనిమిది సినిమాల్లో చూపిన రమణ తన దృష్టిని సినిమా నిర్మాణం వైపు మళ్ళించాడు. అప్పటి వరకూ కుంచె పట్టడం తప్ప సినిమాలో ఏమాత్రం అనుభవం లేని బాపుని దర్శకుడిగా ఒప్పించి సాక్షి సినిమా తీసారు. సూపర్ స్టార్ కృష్ణకు కూడా ఇది ఆల్ టైం
బెస్ట్ మూవీగా పేరు తెచ్చి పెట్టింది. సాక్షి సినిమాకు తాను నిర్మాతగా ఉండి బాపును ఏ ముహూర్తంలో దర్శకుడిని చేశారో కాని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు తెలుగునాట మోత మోగిపోయాయి. బాక్సాఫీస్ వద్ద బోర్లాపడిన సినిమాలు కూడా ఎంతో నాణ్యంగా, నిపుణంగా ఉండి ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. బంగారు పిచుక, ముత్యాల ముగ్గు, పెళ్లిపుస్తకం, మిస్టర్ పెళ్లాం, రాధాగోపాళం, కృష్ణావతారం, సంపూర్ణరామాయణం, బంగారుపిచ్చుక, గోరంత దీపం, మన ఊరి పాండవులు, రాజాధిరాజు సినిమాలలో రమణ అందించిన సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకులకు కంఠోపాఠం. మూగమనసులు సినిమాకు కథా సహకారం అందించారు. రక్తసంబంధం, సినిమాకు మాటల రచయితగా, అక్కినేని నాగేశర్వరావునటించిన బుద్ధిమంతుడు, అందాల రాముడు సినిమాలకు కథారచయితగా పనిచేసిన ముళ్లపూడి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేశారు. రక్తసంబంధాలు, మూగమనసులు సినిమాలకు పనిచేసినా రమణకు రచయితగా పూర్తిస్థాయి గుర్తింపు తెచ్చింది దాగుడుమూతలు సినిమా. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు 'మిస్టర్ డీడ్ గోస్ టు వాషింగ్టన్' అనే హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ పొంది రాశానని ముళ్లపూడే స్వయంగా చెప్పుకున్నారు. తర్వాత వచ్చిన ప్రేమించిచూడు, కన్నెమనసులు, నవరాత్రి, పూలరంగడు, ప్రాణమిత్రులు వగైరా చిత్రాలన్నీ రచయితగా రమణను ఉన్నతస్థాయిలో నిలబెట్టాయి. పాపికొండల్లో తొలిసారి కెమెరా పెట్టి గోదావరి అందాలను వెండి తెరకెత్తిన ఘనత కూడా బాపు, రమణలకే దక్కింది. గోదావరి ప్రయాణ నేపధ్యంగా తీసిన అందాల రాముడు తీసారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పల్టిd కొట్టినా అధైర్య పడకుండా బాపు రమణలు వాళ్ల మీదే వాళ్లు కార్టూన్లు వేసుకుని ఓటమిని ఎంజాయ్ చేశారు. ఆనాటి అందాల రాముడే నిన్నటి శేఖర్ కమ్ముల గోదావరికి ప్రేరణ అయింది. తాజాగా బాపు దర్శకత్వంలో బాలకృష్ణతో రూపొందుతున్న 'శ్రీరామరాజ్యం' సినిమాకు ముళ్లపూడే రచయిత.
1973లో 'అందాలరాముడు', 1975లో 'ముత్యాలముగ్గు', 1991లో పెళ్లిపుస్తకం, 1993లో 'మిస్టర్ పెళ్లాం' చిత్రాలు ఆయనకి నంది అవార్డులు తెచ్చాయి. 1981లో 'వంశవృక్షం' చిత్రానికి కళాసాగర్, సితార అవార్డులు పొందారు. అరవై చిత్రాల రచయిత ముళ్లపూడిని 1987లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఇక ఆయన్ని వరించిన పదవులు, బిరుదులు అనేకం. 1989లో ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థకి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1990లో ఆలిండియా చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. 1992లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1992లో అమెరికా తెలుగు అసోసియేషన్ 'శిరోమణి' బిరుదుతో, బాలల అకాడెమీ 'బాలబంధు' బిరుదుతో సత్కరించాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ, క్రోక్విల్ అకాడెమీ రెండూ సంయుక్తంగా లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించాయి.
ముత్యాల ముగ్గు సినిమాలో రమణ అందించిన ఓరంత కట్టపడిపోతన్నా వేటిరా కొత్తపెళ్లి కొడకా...అంటూ వెటకారాలాడినా...ఆ ముక్క నేను లెక్కట్టుకో మునపే సెప్పాల...డిక్కీలో తోయించేగల్ను జగరత్త...మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? వోల్ మొత్తం మీద ఏమయినా కన్సెసను ఉంటుందా?...అంటూ ఆయన రాసిన డైలాగులు తెగపేలాయి.
రమణ కురిపించిన కరుణరసానికి మంచి ఉదాహరణ భక్తకన్నప్ప. కృష్ణంరాజుని గిరిజనుడిగా... శివ భక్తుడిగా...రెండు పాత్రలలోని వేరియేషన్ని తన రచనలో గొప్పగా చిత్రించాడు రమణ. మెగాస్టార్ చిరంజీవికి కొత్తల్లో అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన సినిమా, కృష్ణంరాజుకు బ్రహ్మాండమైన పేరు తెచ్చిన సినిమా మన ఊరి పాండవులు. మహాభారతాన్ని లోకలైజ్ చేస్తూ రాసిన ఈ సెటైర్‌లో ఇటు కృష్ణంరాజు డైలాగులు. అటు రావుగోపాలరావు డైలాగులు... తెలుగు దేశాన్ని ఉర్రూతలూరిన్చాయి. రాజాధిరాజులో సైతాను శిశువా...అంటూ రమణ రాసిన డైలాగులు ఎంతో పాపులర్ అయ్యాయి. తర్వాత రాధా కళ్యాణం-పెళ్లిdడు పిల్లలు...ఆ తర్వాత చిరంజీవితో మంత్రిగారి వియ్యంకుడు రమణ కలం డైలాగులు కక్కింది.
రమణ కలం నుంచి జాలువారిన మరో దృశ్యకావ్యం పెళ్ళిపుస్తకం...అడుగడుగునా కొత్తకొత్త గిల్లికజ్జాలు... జెలసీ... ద్వేషాలు... ఆశ్చర్యాలు...భార్యా భర్తల మధ్య తియ్యని రాజీలు... అనుమానం నుంచి అర్థం చేసుకోడాలు. అర్థం చేసుకోవడం నుంచి సౌఖ్యాలు...సౌఖ్యం నుంచి సంతోషాలు...సంతోషం నుంచి స్వార్థం...స్వార్థం నుంచీ మళ్ళీ అనుమానాలు...ఇలా అంతులేని వలయంగా తిరిగే మొగుడు పెళ్ళాల గోలను జరంజకంగా రచించాడు రమణ. భార్యభర్తల మధ్య సంబంధాలను మరో కోణం నుంచి సృశించిన సబ్జెక్ట్ మిస్టర్ పెళ్ళాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వాదం నుంచి పుట్టిన వివాదానికి రమణ అద్దిన పదాల సొబగులు సినిమాను అందంగా తీర్చిదిద్దాయి. రాధాగోపాలం కూడా భార్యాభర్తల వాదాలు వివాదాల నేపథ్యంలో తయారైందే! ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లాపడినా అందులో విలువలకు, బాపు రమణ మార్క్ చెణుకలక లోటేలేదు. ఈ విధంగా ఆబాల గోపాలాన్ని అలరించిన అచ్చతెలుగు కలం రమణ కలం.
లేకుంటేమీరొచ్చేలోపే వెళ్ళి పోతుంది...
నగరంలోని వివిధ ప్రాంతాల నుండి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరేందుకు బేగంపేట రోడ్, రాష్ట్రపతిరోడ్, యంజిరోడ్, ఎస్పీరోడ్, టాంక్‌బండ్, తార్నాకరోడ్, సెయింట్‌మేరిస్ రోడ్, చిలకలగూడ రోడ్ వంటి ప్రధాన మార్గాలు ఉన్నా బేగంపేట్, తార్నాక, సికింద్రాబాద్, ఎస్పీరోడ్‌లన్ని ఉదయం నుండి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్‌తో రద్దీగా ఉంటుంది. రద్దీని నివారించేందుకు పోలీసుల తిప్పలు అన్ని ఇన్ని కావు. ఒక్కొక్కసారి ట్రాఫిక్‌ను చూసిన పోలీసులు విసుగుచెంది ఓ ప్రక్కకు నిల్చున్న సందర్భాలు ఉన్నాయి.
అయితే ట్రాఫిక్ సమస్యకు మరోకారణం ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ఉన్న రోడ్ల సమస్య ప్రయాణికులకు తీవ్ర నరకాన్ని చూపిస్తుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే రైళ్ళు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి బయలుదేరుతుంటాయి. ఇక్కడినుండే చాలామంది నగర వాసులు, చుట్టుపక్కల శివారు ప్రాంత ప్రజలు ఈ స్టేషన్ నుండే బయలుదేరి వెళ్తుంటారు. అయితే సికింద్రాబాద్‌లో కాలు పెట్టగానే అసలు సమస్య తలెత్తుతుంది. మరో అరగంటలో లేదా పావుగంటలో రైలు ఉంటే మాత్రం ఇంకా ఆ రైలుపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇది మన సికింద్రాబాద్ ట్రాఫిక్ సమస్య, ఈ ట్రాఫిక్ సమస్యను నివారించాలంటే ఇకా ఆ భగవంతుడే దిగిరావాలి.
ఆస్కార్ విజేతలు వీరే
2. ఉత్తమ నటుడు : కోలిన్ ఫిర్త్ (ది కింగ్స్ స్పీచ్)
3. ఉత్తమ నటి : నటాలీ పోర్ట్‌మన్ (బ్లాక్ స్వాన్)
4. ఉత్తమ సహాయ నటుడు : క్రిష్టియన్ బాలే (ది ఫైటర్)
5. ఉత్తమ సహాయనటి : మెలిసా లియో (ది ఫైటర్)
6. ఉత్తమ దర్శకుడు : టామ్ హూపర్ ( ది కింగ్స్ స్పీచ్)
7. ఉత్తమ విదేశీ భాష చిత్రం : ఇన్ ఎ బెటర్ వరల్డ్ (డెన్మార్క్)
8. ఉత్తమ స్క్రీన్ ప్లే : ఆరాన్ సోర్కిన్ (ది సోషల్ నెట్‌వర్క్)
9. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : డేవిడ్ సీడ్లర్ (ది కింగ్స్ స్పీచ్)
10. ఉత్తమ యానిమేషన్ చిత్రం : టాయ్ స్టోరీ 3
11. ఉత్తమ యానిమేషన్ (లఘు) : ది లాస్ట్ థింగ్
12. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్
13. ఉత్తమ సినిమాటోగ్రఫీ : ఇన్‌సెప్షన్
14. ఉత్తమ శబ్దగ్రహణం, ఎడిటింగ్ : ఇన్‌సెప్షన్
15. ఉత్తమ గీత రచన : ట్రెంట్ రెజ్నర్, అటికస్ రాస్ (ది సోషల్ నెట్‌వర్క్)
16. ఉత్తమ సంగీతం : రాండీ న్యూమన్ (వియ్ బిలాంగ్ టుగెదర్ టాయ్‌స్టోరీ 3)
17. ఉత్తమ దుస్తుల రూపకల్పన : అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్
18. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) : ఇన్‌సైడ్ జాబ్
19. ఉత్తమ డాక్యుమెంటరీ (లఘు) : స్ట్రేంజర్స్ నో మోర్
20. ఉత్తమ ఎడిటింగ్ : ది సోషల్ నెట్‌వర్క్
21. ఉత్తమ మేకప్ : ది వుల్ఫ్‌మన్
23. ఉత్తమ లైవ్ యాక్షన్ (లఘు) : గాడ్ ఆఫ్ లవ్
24. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఇన్‌సెప్షన్
ఈసారి ఎ.ఆర్.రహ్మాన్‌కు నిరాశే ..
కటకటాల వెనక్కి మాజీ ఖాకీ
చట్టం తన చేతుల్లో ఉందన్న ధైర్యమో.. లేక ఎంతమందినైనా పెళ్లాడవచ్చని మతం చెప్పిందని సాకు చెప్పించవచ్చన్న ధైర్యమో తెలియదు గానీ ఓ ఖాకీ తన కంటికి అందంగా కనిపించిన.. మనస్సు మెచ్చిన అమ్మాయిలను వలచి మనువాడేశాడు వరుసగా... ఇదేదో ఒక్కసారో రెండు సార్లోకాదు.. ఏకంగా ఐదుగురిని. ఒకరిని తెలియకుండా మరొకర్ని పెళ్లాడేశాడు. ఈమధ్యే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ కూడా చేసిన ఈయన గారి భాగోతం ఆయన నాలుగో భార్య పోలీసు స్టేషన్ మెట్లెక్కినా ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించటంతో బయటపడింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ నివాసి అయిన గులాం మహ్మద్ పోలీసు శాఖలో పని చేస్తూ ఎక్కడ పని చేస్తే అక్కడ ఓ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవడం అనవాయితీగా మార్చుకున్నాడు. ఇప్పటికే నలుగురిని వదిలించుకుని ఐదో భార్యతో కాపురం చేస్తున్న ఈయన గారు తనని పట్టించుకోవడంలేదని నాలుగో భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఖాకీ చొక్కాలు తమ మాజీ బాస్ వ్యవహారంపై స్పందించకుండా ఎప్పటిలాగానే ఆమెను స్టేషన్ చుట్టూ తిప్పించుకున్నారు. దీంతో విసిగివేసారిన ఆమె నగర పోలీసు కమీషనర్ ఏకే ఖాన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. దానికీ స్పందన లేకపోవడంతో మీడియా సాక్షిగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.
తనని తన పిల్లల్ని వదిలేశాడని దీనివల్ల తామంతా అనాథలంగా మారిపోయామని కన్నీరుమున్నీరైంది. ఎట్టకేలకు సిటీ పోలీసు బాస్ స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో గులాం అహ్మద్‌ను అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. మరి ఈయన గారికి ఏ శిక్షపడుతుందో... లేక ఖాకీల అండదండలతో తప్పించుకుంటాడో వేచిచూడాలి.
రేపు రైళ్లు నడవవు...
ఐ హేట్ బాలయ్యపై బాలకృష్ణ ఫిర్యాదు
రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని..వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్న తనపై కొందరు కావాలనే తన ఇమీజ్ దెబ్బతీసేవిధంగా..బురద జల్లుతున్నారని... తన కుటుంబం, తన అభిమానుల మనస్సుని నొప్పించేవిధంగా కొందరు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు. వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు.
పేల్చినవి రబ్బరువే.. ఐనా చనిపోయారు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో ఈస్టుకోస్టు థర్మల్ విద్యుత్ ప్లాంట్ కి వ్యతిరేకంగా.. ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయమని చెప్పామే తప్ప.. ఎక్కడా తము కాల్పులకు ఆదేశాలు జారీ చేయలేదని డిజిపి అరవింద రావు చెప్పారు.
రబ్బరు బుల్లెట్లు మాత్రమే ప్రయోగిస్తున్నారని, వాటి వల్ల ప్రాణానికి హాని జరుగదని తెలిపారు. ఐతే రబ్బర్ బుల్లెట్ కాల్పులలో ఒకరు మృతి చెందారని డిజిపి ప్రకటించడం ఆశ్చర్యకరం..పోలీసులు, ప్రజలు సంయమనం పాటించాలని ఓ వైపు కోరుతూనే...ఆందోళనకారులు పోలీస్ జీపు తగులబెట్టడాన్ని ఆయన ఖండించారు.
ధర్మాన ఇలాఖాలో మళ్ళి పేలిన 'ధర్మల్' తూటా..
శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పట్టు చూపించేందుకు 'ధర్మల్'నే శ్రీకాకుళం ప్రజల మీద ఆయుధంగా ప్రయోగిస్తున్నట్టు ఉంది. తమ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ఆందోళనకారులపై సోమవారం పోలీసులు మూడుసార్లు బాష్పవాయివు ప్రయోగించారు. పల్లె ప్రజలపై పోలీసు తూటాలు.. పొగబాంబులు వెల్లువలా కురిశాయి.దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీస్ జీపులను తగులబెట్టారు.
పొగబాంబుల తాకిడికి పూరిళ్ళు అంటుకుని మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారు 150 ఇళ్ళు అంటుకున్నట్లు సమాచారం. బాధితుల ఆక్రందనలు,, పోలీసుల బూట్ల చప్పుడు, ఆందోళనకారుల పరుగులతో వడ్డితాండ్ర వణికిపోతున్నది. ఈ ఘటనలతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జగన్ ఆస్తులపై 'సభ'ని స్థంభింపజేస్తాo...
వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపైన పార్లమెంటులో జెపిసి మాదిరిగా ఇక్కడ జాయింట్ లెజిస్ట్రేటివ్ కమిటీ వేయాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. సాక్షిలో దొంగ పెట్టుబడులు ఉన్నట్లు ఐటి శాఖ తేల్చి చెప్పిందని... అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటానికి గల కారణమేమిటని ప్రశ్నించారు.
జగన్ ఆస్తులపై ప్రభుత్వం జెఎల్‌పి వేయకుంటే శాసనసభా సమావేశాలను స్థంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని అన్నారు.
మంత్రి పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే
కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.ఓ దశలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపైకి తెలుగుదేశం శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి దూసుకెళ్లారు. ఆయనను కాంగ్రెసు సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తెలంగాణా వద్దన్నది చంద్రబాబే
మాజీ సిఎం రోశయ్యపై కేసు పెట్టండి : హైకోర్టు
రైల్‌రోకో జరిపి తీరుతాం...
జైపాల్ హామీకి ప్రణబ్ ఎసరు ?
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై 7.5 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. అలాగే లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.14.35, డీజిల్‌పై లీటరుకు రూ.4.60 విధిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో పెట్రో ధర పెంచక తప్పడంలేదు.
ప్రణబ్ బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ
ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారంనాడు పార్లమెంటులో 2011-2012 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు.
బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ
-నల్లధనాన్ని వెలికి తీసేందుకు అయిదు అంచెల విధానం
-చేనేత రంగం ఉద్దీపనకు చర్యలు
-నాబార్డు ద్వారా రూ.3000 కోట్లు వితరణ
- 2011-12లో 7 నుంచి 8 లెదర్ హబ్స్ ఏర్పాటు
-నల్లధనం విదేశాలకు తరలకుండా ప్రత్యేక విధానం
-బ్లాక్ మనీ వెలికితీతకు చట్టం చేసే యోచన
- 15 మోగా ఫుడ్ పార్కుల ఏర్పాటు
-త్వరలో జాతీయ ఆహార భద్రతా బిల్లు
- 2012 ఏప్రిల్ 1 నుంచి ప్రత్యక్ష పన్నుల విధానం
-2.50 లక్షల గ్రామ పంచాయితీలకు గ్రామీణ ఇంటర్నెట్ సౌకర్యం
-అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంపు ( రూ.700 ఉన్నకార్యకర్తలకు రూ.1500, రూ.1500 ఉన్న కార్యకర్తలకు రూ.3000 చెల్లింపు)
-పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 60వేల గ్రామాలకు రూ.300 కోట్లతో ప్యాకేజీ
-రూ.7,300 కోట్లు పట్టణాల దగ్గర
- రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు పావలా వడ్డీకే రుణాలు
-పశుగ్రాస నివారణకు రూ.300 కోట్లు
- భారత నిర్మాణ రంగ కార్యక్రమానికి రూ.58వేల కోట్లు
-విద్యారంగానికి రూ. 52,057 కోట్లు
-విద్యాహక్కు చట్టం కింద మరో రూ.21 కోట్లు
-అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి రూ.244 కోట్లు
- గ్రామీణ బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్లు
-ఆరోగ్య రంగానికు రూ.26, 760 కోట్లు
-చిన్న, సన్నకారురైతుల రుణాల కోసం ప్రత్యేక నిధి
-అసంఘటిత రంగాలలో స్వాలంభన పింఛన్ విధానం మరింత సరళీకృతం
-హరిత భారత్ పథకానికి రూ.200 కోట్లు
-రుణాల ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు
- ఈ సమావేశాల్లోనే ఇన్సూరెన్స్ సవరణ , ఎల్‌ఐసీ బిల్లులు
-2వేలు జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకుల ఏర్పాటు
-ఈ ఏడాది కొత్తగా 20వేల గ్రామాలకు బ్యాంకింగ్ సదుపాయం
-జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి రూ.8వేల కోట్లు
-వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 9,890 కోట్లు
-ఐఐటీ ఖరగ్‌పూర్‌కు రూ.200 కోట్లు , ఐఐఎం కోల్‌కతాకు రూ.20 కోట్లు
-రక్షణ రంగానికి రూ.69,199 కోట్లు
- కొత్త గిడ్డంగుల ఏర్పాటుకు రూ.2వేల కోట్లు
-ముస్లిం వర్సీటీలకు రూ.50 కోట్లు
-గంగానది మినహా నదులు, సరస్సుల శుద్ధికి రూ.200 కోట్లు
-ముస్లిం యూనివర్శిటీలకు రూ.50 కోట్లు
-మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో విదేశీ పెట్టుబడులు పెంపు
-వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి 1.8 లక్షలకు పెంపు
జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కులాల ఆధారంగా జనగణన
-ఇప్పటివరకూ 20 లక్షల ఆధార్ నెంబర్లు జారీ
- త్వరలో కొత్త రుపాయి నాణాలు.
- చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రత్యేక నిధి
27, ఫిబ్రవరి 2011, ఆదివారం
శివరాత్రి మాహాత్మ్యం
ఈశ్వర: స్వరూపము సమస్తము అని ఈశ్వరుడు స్వయంగా ''ఈశ్వర సర్వభూతానాం'' అన్నాడు. సర్వవ్యాపకుడైన ఈశ్వరుని స్వరూపముగా విరాజిల్లుతున్న ఈ సృష్టిలోని ప్రత్యణువులో చరాచరములైన అన్నింటిలోనూ ఆత్మస్వరూపుడై ఆ శివుడే నిండి వున్నాడు. ''ఓం నమ: శివాయ:'' అనే శివ పంచాక్షరి మంత్రం పంచ భూతాత్మకమైన సర్వవ్యాపకతత్వం.
ఓం ్స పరమేశ్వరుడు; 'న' నభ అనగా ఆకాశము;
'మ:' ్స మరత్తు అనగాలి; 'శి' ్స శిఖ అనగా అగ్ని;
'వ' వారిజ అనగా నీరు; 'య' పృధ్వివి అనగానేల.
సర్వము హరిహర స్వరూపము, అద్వైత సిద్ధి సాధకము అనే తత్త్వానికి మూలం 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే'' అనే అద్వైత భావన. శివకేశవుల అభిదత్వ ప్రతిపాదన. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు, ''ఈశ్వర: సర్వభూతానాం అనే పంచభూ తాత్మకమైన సృష్టి శిమయం. అదే శివతత్త్వం. కాలం ఈశ్వరాధీనం, ఆ కాల జ్ఞానమే శివతత్త్వము. కాల స్వరూపుడైన సర్వేశ్వరుడు కాలనిర్ణయం చేస్తాడు. ఈశ్వర ఆజ్ఞానుసారమే కాలచక్రం నిర్ణయించబడి నడుస్తున్నది. ఇదే కాల జ్ఞాన తత్త్వం.
''శివరాత్రి మహారాత్రం నిరాహారో జితేంద్రియ:
అర్చయేద్వా యథాన్యాయం యథాబల మవంచక:
యత్ఫలం లభతే సద్య: శివరాత్రౌ మదర్చనాత్''
మహాశివరాత్రినాడు పగలు రాత్రి ఉపవాసముండి, ఇంద్రియ నిగ్రహం పాటించి, భక్తి శ్రద్ధలతో, విధివిధానంగా శివలింగాన్ని పూజించే వారు, ఒక సంవత్సరకాలం శివుని పూజిస్తే లభించే ఉత్తమ ఫలాన్ని ఈ ఒక్కరోజే పొందగలరు. ఈ మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రియమైనది కనుక ఈనాడు శివనామ స్మరణ చేసినవారు కూడా శివసన్నిధి చేరుకుంటారు.
'లీయతి గమ్యతే ఇతి లింగ:
'లిం' అనగా లీయతి. 'గం' అనగా గమయతి. ఈ జగత్తు దేనితో సంచరించి దేనిలో లయం చెందుతుందో అదే 'లింగం'. ఆద్యంతములు లేని జ్యోతిర్లింగం జగత్తుకి ఉనికి పట్టయిన బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం యొక్క ఉపాధియే పరబ్రహ్మం. ఆపరబ్రహ్మమే మహాశివుడు. నిరాకరుడయిన శివుడి సాకారరూపమే లింగం. పరమశివుని ఆరాధ్య చిహ్నం లింగం. 'అ'కార 'ఉ'కార, 'మ' కారముల సమ్మేళణమైన 'ఓం' కారమే లింగం. అదే త్రిమూర్తుల ఏకరూపం, పరంబ్రహ్మరూపం. బ్రహ్మాండం నుండి మహాలింమై, మహాలింగం నుండి తేజోలింగంగా, జ్వాలాస్తంభంగా ఆవిర్భవించాడు మహా శివుడు, తనని పూజించి అర్చించుకోవడానికి అనువైన శివలింగంగా అవతరించాడు ఆ సర్వేశ్వరుడు.
అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగ స్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరంనుడి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరుకాగానే, వెళ్ళి పోగానే శుభప్రదమైన దేహం 'శివము' నుండి అమంగళకరమైన 'శవము'గా మారిపోతుంది. అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం.
''శృతి స్మృతి పురాణా నామాలయం కరుణాలయం
నిమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్''
శృతులలో, స్మృతులలో, పురాణాలలో మూలస్వరూపుడుగా కీర్తింపబడిన, శుభాల నొసగేవాడు, ఆదిగురువువైన శంకర భగవానుని దివ్యపాదార విందాలకు నమస్కరిస్తున్నాను.
'శం' అంటే చిదానందం 'కర' అంటే ప్రసాదించేవాడు అంటే చిదానందాన్ని ఇచ్చేవాడు 'శం కరోతి శంకర:' శంకరుడు, శుభకరుడు అని భావం. శంకరుడు అంటే శివుడు. ఎవరికి చిదానందం లభిస్తుందో వారికి అన్ని శుభాలు చేకూరినట్లే. 'శంభో శంకర హరహర మహదేవ' అంటూ భక్తి ప్రపత్తులతో తనని స్మరించే ప్రతి జీవికి ఇహ పరసుఖములతోబాటు ముక్తిని ప్రసాదించి పరబ్రహ్మమే శివుడు. త్రేతా యుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పరమశివుని పూజించి తమ కోరికల్ని సిద్ధించు కున్నారు.
తత్పురుషాయ విద్మహే...
మహాదేవాయ ధీమహి....
తన్నో రుద్ర: ప్రచోదయాత్...'' అనే రుద్ర గాయత్రి పఠనం అశరీరవాణి చేస్తుంటే, త్రిమూర్తులలో తానే అధికుడననే సత్య నిరూపణ కోసం అరుణాచలంలో మాఘ బహుళ చతుర్దశినాడు జ్వాలాస్తంభంలో తేజోలింగంగా మహాశివుడు ఆవిర్భవించిన కారణంగా ఈ దినం మహాశివరాత్రిగా లోక ప్రసిద్ధమైనది.
క్షీర సాగర మధనం జరిగినప్పుడు ఉద్భవించిన కాలకూట విషాన్ని అవలీలగా ఔపోసనపట్టి, తన కంఠంలోనే దాచిపెట్టిన అమృతమూర్తి శివుడు నీలకంఠుడు. ఎలాంటి విషభావననైనా మనసులోపలికి పోనీయరాదనే అద్భుత సందేశానికి అది ప్రతీక. చెడుమాటల్ని కంఠంలో నిలిపి ఉంచేయాలనే దానికి ఇది సూచిక. ఆ నీలకంఠం చుట్టు ఉండే విషనాగులు కాలసర్పాలు. సర్పం మనలో దాగిన అజ్ఞాత కుండలిని శక్తికి చిహ్నం. ఆ శక్తిని నియంత్రించే అధిదేవత ఆ సర్పభూషణుడు.
శివుడు ధరించే త్రిశూలం సృష్టి స్థితి, లయలకు కారకుడు అతడే అనడానికి సంకేతం. ఢమరుకం అంటే శబ్దం. ఈ విశ్వమంతా శబ్దజనితం. శబ్దం వల్లె అర్థం వస్తుంది. శబ్ధార్థాలు రెంటినీ స్ఫురింపజేసే ఢమరుకాన్ని చేత ధరించే ఆ అర్థనారీశ్వరుడే జగత్తుకి తల్లిd తండ్రీ అని సూచించే శబ్ధార్థమే ఢమరుకం.
మహాకవి కాళిదాసు తన 'రఘువంశం' కావ్య అవతారికలో జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరులలా తన కావ్యంలో శబ్దార్థాలు కలసి ఉంటాయని ఆ ఆదిదంపతులను ఇలాస్తుతించాడు.
''వాగార్థావ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తయే
జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ''.
మనిషిలోని మృగాన్ని అణిచి ఉంచాలనేది శివుడి చర్మధారణలోని సందేశం. శివుడి మూడో నేత్రం జ్ఞానానికి సంకేతం, కోపానికి కాదు. ఆ నేత్రం తెరిచి చూసినప్పుడు, మనలోని జ్ఞాన నేత్రం తెరుచు కున్నప్పుడు మనస్సులోని మాలిన్యాలు, అరిషడ్వర్గాలు మాడిమసి అయి బూడిద అవుతాయి. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా, చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువునా ఒంటపట్టించు కోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరి స్తూండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములనిపేరు. శివుడు లయకారకుడే కాదు ముక్తి ప్రదాత కూడా. ధ్యాన యోగమే ముక్తికి రాచమార్గమని ముల్లోకాలకు చాటడానికే తాను నిరంతర ధ్యాయోగాన్ని ఆచరిస్తూ దాన్ని పరోక్షంగా భోదిస్తున్న పరమగురువు, మహాశివుడు, అందువలన ఆయన మహాదేవుడు. శివుని అనుగ్రహంతో వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో అతి శ్రేష్ఠమైనది 'శివపురాణం'.
పఠనాచ్ఛ శ్రవణాదస్య భక్తి మాన్నర సత్తమ:
సద్య శివపద ప్రాప్తిం లభ్యతే సర్వసాధనాత్||
భక్తితో శివపురాన్ని పఠించేవారు, ఆ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించే వారు, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారు మానవుల్లో ఉత్తములై ఇహలోకంలో అన్ని సుఖాలు పొంది, ఆ జన్మాంతంలోని మోక్షాన్ని పొంది శివపదాన్ని చేరుకుంటారు. వేదమే జ్ఞానం. జ్ఞానమే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం మహాశివుడు. శివుడు సర్వస్వమని ఆరాధించడమే జ్ఞానం. శివుడు స్వయంగా చెప్పిన శివ పురాణం లోని కథలు, శివలీలలన్నీ ఈ విషయాన్నే చెబుతున్నాయి.
26, ఫిబ్రవరి 2011, శనివారం
మెరుపు సినిమా నిలిచిపోయినట్టే ...
సునీల్ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.
కొందరికి తొలి ప్రయత్నమే ఘనవిజయం తీసుకొచ్చి, రెండుమూడు విజయాలు వరసగా వచ్చి, కిక్కిచ్చేయడంతో అహం పెరిగి అది డీలా పడేట్టు చేస్తుంది. కొందరికి రెండు మూడు ప్రయత్నాలు చేసినా పని జరగక నిరాశ నిస్పృహలకు గురిచేసి ప్రాప్తం లేదు కలిసిరాదు అనే వేదాంత ధోరణితో ఏర్పరుచుకుని ఏ ప్రయత్నాలూ చేయరు. కొందరికి తొలి ప్రయత్నం ఫెయిల్ అయినా నిరుత్సాహం రాక పోవడంతో మరి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అలాటి వారిలో సునీల్ ఒకరు.
డ్యాన్సులమీద దృష్టి పెడితే, నాటకం మీద దృష్టి పెడితే కలిసిరాలేదు. తరువాత డ్యాన్స్ పోటీల్లో వరసగా గెలుపొందారు. హైదరాబాద్ వచ్చి డ్యాన్స్ స్కూల్లో కొంతకాలం డ్యాన్సు ప్రాక్టీసు చేసారు. అలాగే సినిమా చాన్సులకోసం ప్రయత్నిస్తే 'సెకండ్ హాండ్' చిత్రంలో చాన్స్ వచ్చాక ఆ సినిమా ఆగిపోయింది. భీమవరం పరిసర ప్రజల ఇష్టదైవమైన మావుళ్ళమ్మ భక్తుడుగా ఆమె అనుగ్రహంచి చిరునవ్వు నవ్వగా 'చిరునవ్వు' చిత్రం వచ్చింది. ఆ తరువాత 'నువ్వే కావాలి'లో నటించారు. 'నువ్వే కావాలి' ముందు విడుదల కావడంతో గుర్తింపు వచ్చింది. వరసగా ఆరు చిత్రాలు హిట్ కావడంతో హాస్యనటుడుగా స్థిరపడిపోయారు. తన పెర్సనాల్టిdకి విలన్ పాత్రలు వస్తాయని అనుకుంటే కామెడీ వేషాలు వచ్చి కామెడీ ఆర్టిస్ట్ అయిపోయారు.
డ్యాన్సులు తెలిసి బాగా చేయగలిగే కామెడీ ఆర్టిస్ట్ సునీల్- అని రామ్‌గోపాల్ వర్మ నుంచి ప్రశంసలు పొందారు. అందాల రాముడులో హీరో అయిన సునీల్‌ని రాజమౌళి 'మర్యాద రామన్న' గా చూపారు. రెండూ హిట్ కావడంతో వర్మ దృష్టిలో పడి 'కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు' చిత్రంలో దర్శకుడు అయ్యారు. హీరోగా ఒక చిత్రానికి మరో చిత్రానికి వచ్చిన గ్యాప్‌లో కామెడీ ఆర్టిస్ట్ గానే కొనసాగుతున్నా, హీరోగానే చేస్తాడట ఇక కామెడీ పాత్రలకు ఫుల్‌స్టాప్ అనే వదంతులూ వ్యాపించాయి. సునీల్ పుట్టిన రోజు ఫిబ్రవరి 28.
ఇద్దరూ డాక్టర్ల యాక్షన్ సినిమా
ఫిమేల్ ఉన్నికృష్ణన్
మలయాళంలో 'ఫిమేల్ ఉన్నికృష్ణన్' టైటిల్‌తో పూర్తి హాస్యభరితంగా రూపొందిస్తున్నారు. డూప్లికేట్ చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేసిన సూరజ్ వెంజర్ మూడు ఇందులో టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఇతడు మహిళ పాత్ర పోషించడం లేదు అయినా ఆ టైటిల్ పెట్టారు.
కొంతమంది మగవాళ్ళ కంఠస్వరం ఆడవాళ్ళు మాట్లాడుతున్నట్టు విచిత్రంగా వుంటుంది. అదే ఈ చిత్రానికి ముఖ్యమైన పాయింట్. ఆడవాళ్ళ కంఠస్వరంలా వుండటంతో అతడు మగవాడే అయినా ఫిమేల్ ఉన్ని కృష్ణన్‌గా పాప్యులర్ అయ్యాడు తన వూరు జనానికి. ఎందుకంటే అతను మాట్లాడుతూంటే ఆ స్వరం అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కథ అల్లారు దర్శకుడు మధు.
సలీమ్ కుమార్, జగతి, బిజూ కుట్టన్, కళాభవన్ ప్రజోడ్ మున్నగు హాస్య నటులు కూడా నటించడంతో ప్రతి సీన్ కామెడీని పండిస్తుందంటున్నారు దర్శకుడు కె.బి.మధు.
మహాలక్ష్మి అనే యువతి హీరోయిన్‌గా, షాజి సుకుమారన్ సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. తుళుజి, వేగమాన్, మున్నార్ పరిసరాల్లో సినాలి ఫిలిమ్స్ పతాకాన నిర్మాత షిజాయ్ వర్గీస్ షూటింగ్ పూర్తి చేసారు.
సోనియా మౌనరాగం ... మన్మోహన్ ప్రేక్షకపాత్ర ...
ప్రతి అంశం రాజకీయం చేసి, ఎన్నికల్లో ప్రయోజనాలు ఎలా పొందాలని ఎత్తుగడలేసే అన్ని పార్టీల నేతలు, సహజంగా తెలంగాణ లాంటి కీలక అంశాన్ని నిజాయితీగా పరిష్కరిస్తామని అనుకోలేము. అందుకే, దశాబ్దాల తరబడి కాలయాపన చేసి ఎవరు అధికారంలో ఉన్నా, సమస్యను మరింత సంక్లిష్టం చేయడమే గాని ఇంతవరకు పరిష్కరించలేదు. ప్రతిపక్షంలో వున్నప్పుడు మాత్రం, వీరోచిత పోరాటాలకైనా, ప్రకటనలకైనా సిద్ధం అన్నట్లు వ్యవహరిస్తారు. దాదాపు అన్ని పార్టీలు, వారి మిత్రపక్షాలు తెలంగాణ సమస్యను నాన్చటంలో ప్రధాన భూమిక పోషించాయి. అందుకే, నేడు తెలంగాణ అగ్నిదావానలంలా అన్ని పార్టీలకు అంటుకుని ఉంది. రాష్ట్రం మొత్తం (తెలంగాణతర ప్రాంతాలు కూడా) ఈ తెలంగాణ సెగతో ఉడికిపోతోంది. దశాబ్దాల పోరాటం సరే, గత ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు అచేతనంగా ఉన్నాయి. విద్యావ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తుండగా ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తమైంది. సగటు పౌరులు, అన్ని ప్రాంతాల వారు ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రత్యేకించి, రోడ్డు రవాణా పరిస్థితులు అతలాకుతలమైనాయి. అయినా, ఆమాత్యులు మాత్రం తమ పాలన సాఫీగా జరుగుతున్న భ్రమల్లో ఉన్నారు. సహజంగా, సగటు ప్రజలు బేజారైనట్టి భావన వుంది. ఎంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరిస్తే అంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రమొచ్చినా ఫర్వాలేదని సీమాంధ్ర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే, సుహృద్భావ వాతావరణంలో రాష్ట్ర విభజన జరగాలే కాని, అంతర్యుద్ధ పరిస్థితులు తెచ్చి పెట్టవద్దని రాజకీయ పార్టీలను కోరుతున్నారు.
మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వానిదైంది. 2004 ఎన్నికలనాడు తెరాసతో పొత్తు పెట్టుకుని, తెలంగాణకు సానుకూలంగా చెప్పి, అధికారంలోకి వచ్చి, మొండిచెయ్యి చూపాలనుకుంటే, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ వారికి చావుతప్పి కన్నులొట్టపోయిన పరిస్థితి ఎదురైంది. వైఎస్‌ఆర్ మరణంతో, దాదాపు చావు పరిస్థితే కాంగ్రెస్ ఎదుర్కోవలసి వస్తుంది. కనీసం తెలంగాణను తక్షణమే పరిష్కరించినా నేడా పద్మవ్యూహ పరిస్థితి ఉండకపోయేది కాదు. మొదట్లోనే కెసిఆర్‌ను విశ్వాసంలోకి తీసుకొని, రాష్ట్ర సాధనకొక కాలపరిమితిని ప్రకటించి ఉండాల్సింది. డిసెంబర్ 9, 2009 నాటి చిదంబరం ప్రకటననుసారం తెలంగాణ ప్రక్రియ కొనసాగవలసింది. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు స్పష్టంగా ప్రకటించాల్సి వుండేది. కాలయాపన జరిగినా సరే శ్రీకృష్ణ కమిటి సిఫార్సులు పరోక్షంగానైనా తెలంగాణకు అనుకూలంగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సింది. కమిటీ సిఫార్సులు నెలలు గడిచినా ఇంకా కేంద్ర విధానం అస్పష్టంగా ఉండడం వల్ల నేడా పద్మవ్యూహం ఎదురౌతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు, పార్టీల కతీతంగా ఉద్యమబాట పట్టారు. ఉధృతం చేస్తున్నారు. ఇంకెంత కాలయాపన చేస్తే, ఆ మేరకు కాంగ్రెస్ ఎలాగు నష్టపోతుంది. యావత్ రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు నష్టపోతారు. కేవలం రెండు రోజుల తెలంగాణ బంద్‌నే చూశాము. వారం రోజుల బంద్ ప్రకటిస్తే ఏమవుతుందో ఆలోచించాలి. రాజధాని హైదరాబాద్ తెలంగాణలో ఉన్నందున, యావత్ రాష్ట్ర పరిపాలన కుంటుపడుతుంది. కనీసం తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు కూడా దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటి ప్రభావం చివరికి తెలుగువారి మధ్య మానసిక దాడులతో పాటు, భౌతిక దాడులు జరిగే దుస్థితికి కారణమవుతుంది.
ఈ నేపథ్యంలో పరిశీలిస్తే, సత్వరమే తెలంగాణ ప్రకటనతో పాటు పార్లమెంటరీ ప్రక్రియ కొనసాగిస్తే, కాంగ్రెస్ గట్టెక్కవచ్చు. పద్మవ్యూహం నుండి బయటపడవచ్చు. కాదంటే, ప్రతిపక్ష బి.జె.పి.తో బిఎస్‌పి లాంటి ఇతర పక్షాలు, తెలంగాణాలో అనుకూలంగా తీర్మానించాయి. సభలో గట్టిగా నిలబడ్డాయి. అటువంటప్పుడు, 2జి స్పెక్ట్రం కుంభకోణంపై జెపిసిని వేయటానికి వెనుకంజవేసి ఇంతకాలం పరాభవం పాలైన కాంగ్రెస్ మాదిరిగా, తెలంగాణ విషయంలో కాలాతీతమౌతోంది. ఇటు రాష్ట్రంలో, తెలంగాణలో, బయటా కాంగ్రెస్ పరపతి దిన దినగండంగా మారుతోంది. ఈ తెలంగాణ పోరాటాలు ఇంత కంటె తీవ్రరూపం దాల్చి, కాంగ్రెస్‌ను అధోగతి పాలు చేస్తాయి. పరిస్థితి విషమిస్తే, మరో రెండేళ్ళు ఆగటానికైనా తెలంగాణ వాదులు సిద్ధపడి, బి.జె.పి. ప్రభుత్వం ఏర్పడటానికి సాయపడవచ్చు. ఆ దిశలో కెసిఆర్ తదితరులు ప్రయత్నిస్తున్న సంకేతాలొస్తున్నాయి. అటువంటప్పుడే, కాంగ్రెస్‌లో విలీనం కావాల్సిన దుస్థితి కెసిఆర్‌కి కూడదు. తెరాసనే బలోపేతం చేస్తూ, కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిప్పవచ్చు. కేవలం తెలంగాణ కోసం, కాంగ్రెస్ చెప్పినట్లు నడుచుకోటానికి కెసిఆర్ సిద్ధంగా లేడిప్పుడు. కుప్పిగంతులు వేయదు. కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పటానికి బి.జె.పి.తో, టిడిపితో జట్టు కట్టడానికైనా ఆయన వెనుకాడడని అర్థం చేసుకోవాలి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కెసిఆర్ వ్యూహాలను తెలంగాణ ప్రజలు సమర్థించాల్సి వస్తోంది. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రం వాయిదా పడి కెసిఆర్ రాజకీయాలు గెలుస్తాయి. కాంగ్రెస్ బదులు బి.జె.పి. అధికారంలోకి వచ్చినంత మాత్రాన తెలంగాణ వస్తుందా అనే ప్రశ్న ఎలాగున్నా, కుక్కకాటుకు చెప్పుదెబ్బ అవసరమని తెలంగాణ ప్రజలు భావిస్తారు. అందుకే ఆలస్యం వల్ల అమృతం విషమవుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి!
డా కె.విద్యాసాగర్ రెడ్డి
అమరజీవి అంకుల్ పాయ్
అంకుల్ పారు అంటేనే 'అమర్ చిత్రకథ, టింకిల్ కామిక్స' గుర్తుకొస్తాయి. అనంతపారు గురువారం నాడు అనంతలోకా లకు తరలి వెళ్లిపోయారు. ఈ చిత్రకథల రారాజు ఎందరో తమ విశిష్ట సేవలతో, గత 44 సంవత్సరాలుగా తన కథ లతో, కామిక్సతో నవ్వుల పువ్వుల్ని పండిస్తూ, దేశంలోనే కాక ప్రపంచఖ్యాతినార్జించి, ఎందరో బాలబాలికల అభిమా నాన్ని చూరగొన్నారు.
అనంతపారు వెంకటరాయ, సుశీల పారు దంపతులకు సెప్టెం బర్ 17, 1929లో కర్ణాటకలోని కర్క లలో జన్మించారు. వారు కెమిస్ట్రీ, ఫిజిక్స, కెమికల్ టెక్నాలజీ చదివినా, ప్రవృత్తి రీత్యా కామిక్స ప్రచురణలంటే ఎంతో ఇష్టమాయనకు. 1954లో 'ఎడిటింగ్ పబ్లిషింగ్' రంగంలోకి ప్రవేశించారు. అమర్ చిత్ర కథ సిరీస్‌ను 1967 లో ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా పుస్తక ప్రచురణ విభాగం 'ఇంక్రజాల్' పేరుతో కామిక బొమ్మల సిరీస్‌ని ప్రారంభించారు.
టింకిల్ పత్రికను 1980లో ప్రారంభించారు. అమర్ చిత్ర కథ 20 భాషలలో వెలువడింది. అంకుల్‌పారుకి పేరు తెచ్చిన టైటిల్స్ కృష్ణా, అశోక, అక్బర్, రాణిఝాన్సీ, వివేకానంద మొదలగునవి.
చారిత్రకం, జానపదం, వివిధ మతాల సంప్రదాయాలు - వాటి విశి ష్టత, జాతక కథలు, పంచతంత్ర కథలు లాంటి ఎన్నో కథలు,కథానికలు పారుకు అవార్డులు-రివార్డులు సంపాదించి పెట్టాయి. హనుమాన్, చాణక్య, అభిమన్యు గాథలు ఆయన కీర్తి ప్రతిష్టలను మరింత పెంచ డమే కాక, బాలబాలకలకు స్ఫూర్థి ప్రదాయకంగా వున్నాయి. ప్రతాప్ మల్లిక, రామ్ వయీర్‌కర్ కుంచెలు తోడవడంతో కథ లకు బొమ్మల అందాలు కలిసి వచ్చి కథలోని పాత్రలు ప్రాణం పోసుకున్నాయి.
అనంతపారు వీరుల గాథలే కాకుండా, ప్రముఖుల జీవిత చరిత్రలు అనేకం రాసారు.
ప్రముఖ చిత్రకారులు ప్రతాప్ మాలిక, సౌరెన్‌రారు, ఝప్రే ఫౌలర్, హెచ్.ఎస్. చవాన్, మధు పౌలే, చంద్రకాంత్, డి.రాణి పారు కథలకు బొమ్మలు వేయడానికి ముందుకు వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అంకుల్ పారు కథలకు ప్రాముఖ్యత ఏర్పడింది.
అనేక పుస్తకాల షాపుల్లో టింకిల్, అమర్ చిత్ర కథ పుస్తకాలు కొనుగోలుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ పాఠశాలలు, గ్రంథాలయ సంస్థలు వీటిని తెప్పించుకోవడం, అనంతపారు ప్రతిభా సంపత్తులకు తార్కాణం. అనంతపారు కర్ణాటక ప్రాంతం వారైనా, వారు వివిధ ప్రాంతాల విద్యార్థుల మనసులను దోచుకున్నారు. వారు ముంబరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నా, అనేక ప్రాంతవాసులు, వారు కథలు చెప్పే తీరు చూసి వారి వారి ప్రాంతాలకు రప్పించుకొని, సత్కార కార్యక్రమాలెన్నో నిర్వహించారు. పారు కేవలం పిల్లలకు కథలు చెప్పడమే కాకుండా వారితో సరదాగా మెలిగేవారు. వారు ఏ అంశం తీసుకున్నా, ఆ కథను తన రచనాశైలితో రక్తి కట్టించేవారనడంలో ఎంతమాత్రం సం దేహం లేదు. వారు వయసు పై బడినా తరం తరం, నిరంతరం వారిని గుర్తుంచుకునేలా రచనలు చేసేవారు. తన రచనలతో ఆబాలగోపాలాన్ని అలరించేవారు. ఈయన కలం నుంచి జాలువారిన ఎన్నో కథలు సిడీలుగా , డివిడిలుగా రూపుదిద్దుకొని మార్కెట్‌లో విస్తారంగా చోటు చేసుకున్నాయి. ఆంధ్రపాఠకులకు చందమామ,బాల మిత్రల్లా, పారు కథలు ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లల్ని విపరీ తంగా ఆకర్షిస్తున్నాయి.
ముంబరులోని బెస్ట్ బస్సులు అమర్ చిత్రకథలను బ స్సులపైకి ఎక్కించాయంటే ఆయన ఎంతటి ప్రతిభాశాలో అర్థం చేసుకోవచ్చు. కొం దరు పాఠశాలలోని ఇళ్ళల్లో కూడా ఇంటీరియర్ డిజైన్లుగా అమర్‌చిత్ర కథలను గోడల పైకి ఎక్కించారు.
దీన్నిబట్టి చూస్తే వారు కథలు చెప్పే విధానం, ఆబాల గోపాలాన్ని ఆశ్యర్యపరుస్తుంది. పలు పాఠశాలలు, బోధనా సంస్థలు అమర్ చిత్ర కథలను నీతిపాఠాలుగా బోధిస్తున్నాయి.
నేడు టీవీల ప్రభావంగా పుస్తకాలు కొని చదివే అలవాటు కొరవడుతోంది. అయినా, అనంత్‌పారు రాసిన పుస్తకాలకు, టింకిల్ మ్యాగజైన్లకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.
అంకుల్ పారు అజరామర కృషి ఫలితంగా ఆయన కలం నుంచి అనేకానేక పుస్తకాలు పిల్లల్లో చైతన్యస్ఫూర్తిని కలిగించి నీతిని బోధిస్తు న్నాయి. నేడు కృష్ణా, హనుమా త్రీడిలుగా వస్తున్నాయంటే వారి స్ఫూర్తికి, అనంతపారు ముఖ్యకారకులు.
వర్ధమాన కాలమానపరిస్థితులకనుగుణంగా, పిల్లల సైకాలజీకి తగి నట్లుగా వారి రచనలు సాగుతూ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అనంత పారు కథలు కేవలం పిల్లలకే కాక పెద్దలకు కూడా ఆసక్తిదాయకంగా ఉండేవి. దీనికి కారణంగానే వారు కూడా పిల్లలు చదివిన తర్వాత పెద్దలు కూడా చదివేవారు.
అనంతపారు భౌతికంగా నేడు లేకున్నా, చిన్నారి హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న అమరజీవిగా ఆయన పేరు కలకాలం నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
వివాహానికీ ఉంది బీమా
భారత్‌లో గత సంవత్సరం జరిగిన వివాహ వేడుకల ఖర్చు 1.9 నుంచి 2.25 లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. మీ జీవితంలో దాచి వుంచుకున్న డబ్బులో అత్యధిక భాగం పెళ్ళికి వెచ్చించాలని భావిస్తుంటే మాత్రం ఖచ్చితంగా సెక్యూరిటీని కోరుకుంటారు. మీ డబ్బకు భద్రత కల్పించేందుకు, దురదృష్టకర సంఘటనలు జరిగితే మీకు కలిగిన నష్టానికి పరిహారం అందుతుంది.
చాలా కంపెనీలు ప్రస్తుతం ఈవెంట్ ఇన్స్యూరెన్స్‌లో భాగంగా పెళ్ళిళ్లకు బీమా చేస్తున్నాయి. ఈ పాలసీ ప్రధానంగా ప్రమాదం, వివాహం రద్దు లేదా వాయిదా, పెళ్ళి మండపంలో అద్దె వస్తువులకు జరిగే నష్టంలపై కవరేజ్‌ను ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఈ పాలసీలను ఎవరికి తగ్గట్టుగా వారు మలచుకోవచ్చు. ఉదాహరణకు ఫుడ్ పాయిజనింగ్ జరగడం, పవర్ ఫెయిల్యూర్, భారీ వర్షాలతో కార్యక్రమం రసాభాస కావడం తదితర రైడర్లను ఎంపిక చేసుకోవచ్చు.
దీంతో పాటు ఆభరణాల దొందతనం, సమయానికి పెళ్ళి కొడుకు లేదా పెళ్ళి కూతురు మండపానికి చేరుకోలేక పెళ్ళి వాయిదా పడడం వంటి సంఘటనలకు బీమా ఉంది. ఒకవేళ ఉగ్రవాదుల దాడి జరిగితే... అందుకూ బీమా కవరేజ్ లభిస్తుంది.
కవరేజ్‌లోకి రానివి: ఒకవేళ ఇరు వర్గాల మధ్యా మనస్పర్ధలు వచ్చి వివాహం రద్దయితే, బీమా ఉండదు. అయితే, కొన్ని సంస్థలు మాత్రం కట్నం విషయంలో తేడా వచ్చి పెళ్ళి ఆగితే బీమా అందిస్తున్నాయి. పార్టీల అజాగ్రత్తే నష్టానికి కారణమని తేలితే బీమా కంపెనీలు క్లయిమ్ చెల్లింపులకు ముందుకు రావు. చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే బీమా కంపెనీ అందించే నియమ నిబంధనలను క్షుణ్ణంగా చదివి పూర్తిగా అర్ధం చేసుకోవాలి.
ప్రీమియం ఎలా..: బజాజ్ అలయన్స్ 20 లక్షలు, 35 లక్షలు, 58 లక్షలు, 73 లక్షలు ఇలా వివిధ రకాలుగా వివాహ బీమాను అందిస్తోంది. వీటికి వరుసగా 2,252, 4,004, 6,232, 8,273 రూపాయల ప్రీమియంను (సేవా పన్ను కలుపుకొని) చెల్లించాల్సి వుంటుంది.
114 కేంద్రాల్లో 'మిరపకాయ్' అర్థశతదినోత్సవం
సంక్రాంతికి విడుదలైన రవితేజ 'మిరపకాయ్' 114 కేంద్రాల్లో 50 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుందని ఎల్లోఫ్లవర్స్ అధినేత, నిర్మాత రమేష్ పుప్పాల తెలిపారు. 'మా సంస్థ తీసిన తొలిచిత్రమే ఇంతటి విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ఈ విజయానికి కథానాయకుడు రవితేజ, దర్శకుడు హరీష్‌శంకర్, ఇతర యూనిట్ సభ్యులు కారణం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. త్వరలో వేడుక నిర్వహిస్తాం' అన్నారు.
'ఈ సక్సెస్ క్రేడిట్ అంతా దర్శకుడు హరీష్‌శంకర్‌కు చెందుతుంది. నిర్మాత రమేష్ నాకు మంచి స్నేహితుడు అయ్యారు ఈ విజయానికి కారణమైన అందరికీ థాంక్స్' అన్నారు రవితేజ.
'షాక్' ఫలితంతో నిరాశపడిన నాకు మళ్ళీ మిరపకాయ్ చేసే అవకాశం కల్పించారు రవితేజ, రమేష్ పుప్పాల. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అన్నారు హరీశ్‌శంకర్
అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....
ఇంట్లో దోమల వెూతతో బెంబేలెత్తుతున్నారా దోమలు కుట్ట డం తో జబ్బు పడాల్సివస్తుందని బాధపడుతున్నారా దోమలను చంపే మస్కిటోకాయిల్స్‌కోసం వందలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారా మలేరియా మహామ్మారికి భయ పడుతున్నారా అయితే మీకో శుభ వార్త...ఇకపై దోమలకు మీరు భయపడాల్సిన పనిలేదు. దోమ కాటు వల్ల ఇకపై ఎలాంటి అనా రోగ్య సమస్యలు ఉండవు. నిజం ... దోమకాటు వల్ల వచ్చే వ్యాధు లను నివా రించేలా సరికొత్త టీకా మందును అమెరికాలోని టులేన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తయారు చేస్తు న్నారు.
భారతీయ శాస్త్రవేత్త నిర్భరు కుమార్ నేతృ త్వంలోనే ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. విషానికి విషమే విరుగుడు అన్న సూక్తి నిర్భరు బాగా వంట పట్టించుకున్నాడేవెూ దోమకాటుతో వ్యాపించే మలేరియాను దోమకాటుతోనే అడ్డుకోవాలని ఆయన చేస్తున్న ప్రయోగాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆయన రూపొంది స్తున్న ఈ టీకా మందులో ఇకముందు మలేరియాను శాశ్వతంగా నిర్మూలించే వీలు కలుగుతుందట. ఈ టీకా వేసుకున్నవారిని దోమ కుట్టినపుడు ఆ యాంటీ బాడీస్ మలేరియా పరాన్నజీవి పునరు త్పత్తికి అవసరమైన ప్రోటీన్స్ ను నిర్వీర్యం చేసి మలేరియా వ్యాధి రాకుండా నియంత్రి స్తాయి. అంతవరకు దోమలను కొట్టుకుంటూ బతకాల్సిందే....
ఆమ్..ఆద్మీ..ఔర్..అమ్మో!
ప్రజలు అంటున్నది, మీడియా మొత్తుకుంటున్నది నిజమేనని ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారంనాడు లోకసేభకు సమర్పించిన 2011-12 ఆర్థిక సంవత్సరపు ఆర్థికసర్వే స్పష్టం చేసింది. మంత్రిగారు సమర్పించిన నివేదిక ప్రకారం
ఆర్థిక ప్రగతి మందగించింది
ద్రవ్యోల్బణం పెరిగిపోయింది
ఆహార ద్రవ్యోల్బణ విలయం
ద్రవ్య సరఫరా, వినిమయం వల్ల విషమ పరిస్థితులు
ప్రపంచ ఆర్థిక సంక్షోభ ఛాయల దుష్ప్రభావం
వంటి భయంకర పరిస్థితులను కళ్ళకు కట్టింది. ఇందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించకపోవడం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షో భాల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పడడం ప్రధాన కారణాలుగా అది చూపింది. దేశంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితుల వల్ల ప్రభుత్వాలతో పాటే ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యవసర, అత్యవసర రేట్లు తారస్థాయికి చేరడంతో ప్రజలు పడుతున్న బాధలు తారస్థాయికి చేరుతున్నాయని తేల్చి చెప్పింది. ఏదో చేసేస్తున్నామని, ఎంతెంతో కష్టపడిపోతున్నామని డపðకొట్టుకుని చెపðకుం టున్న సర్కారు ప్రచారాలలో పసలేదని, అవి వాస్తవ విరుద్ధాలని ఈ నివేదిక చెప్పకనే చెప్పింది. ఈ 2011-12లో 9% అభివృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని నివేదిక నొక్కి చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కనుక ఈ యేడాది ఎంత కష్టపడాలనుకున్నా ఆ స్థాయిలో ప్రగతిరేటు రాదన్నది నిర్వివాదాంశం.
రాష్ట్రంలో అనిశ్చితి కి బీజేపీయే కారణం
శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలోఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించాలిగాని, ఇలా దుర్వినియోగం చేయడం తగదని అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరినప్పటికీ కొన్ని పార్టీలు పనిగట్టుకుని కావాలనే సమావేశాల్ని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ సమావేశాలకి ఎంత డబ్బు వృధా అవుతుందో ఆలోచించాలని, ఇదంతా ప్రజల సొమ్మేనని ఆయన గుర్తు చేశారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ను తప్పుబట్టడం బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందని, అసలు ప్రత్యేక తెలంగాణా అక్కరలేదని అద్వానీ అన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రంలో సమస్యలు రావడానికి, అనిశ్చితి నెలకొనడానికి కారణం బీజేపీయేనని విమర్శించారు
గవర్నర్ వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా
ఉద్యమంలో పాల్గొనాలని కోరడం వేరు, వారిని లక్ష్యం చేసుకోవడం వేరని..తెలంగాణ జెఎసి తమ పార్టీ శాసనసభ్యులను లక్ష్యం చేసుకోవద్దని.. సీమాంధ్ర నేతలు తెలంగాణను వ్యతిరేకిస్తే తీవ్ర పరిణామాలుంటాయని, సీమాంధ్ర నాయకులు సమైక్యవాద నిర్ణయాన్ని వదిలేసి జై ఆంధ్ర నినాదాన్ని ముందుకు తేవాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే పదవికి పోచారం రాజీనామా ?
ఆయన శనివారం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయన్నుట్లు తెలిపారు. కాగా పోచారం రాజీనామా చేస్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ సెగ
మార్చి 10న 'మిలీనియం మార్చ్ టు హైదరాబాద్'
తెలంగాణా ఏర్పాటు సాగే వరకు ఉద్యోగుల సహాయ నిరాకరణ ఆగబోదని.. అందుకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు తెలంగాణా ప్రజలంతా అందించేందుకు సిద్దంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగులకు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
జీతాలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదు
వివేకాకు మద్దతిస్తాం... కానీ...
సమావేశం వివరాలు వెల్లడించేందుకు వీరు నిరాకరించినప్పటికీ.. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం విడిపోకూడదనే ఉద్దేశంతోనే తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నామని... చెప్తున్న నేతలు.. ఉప ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మిపై వివేకానంద రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి కానీ, కడప పార్లమెంట్ నుండి కానీ పోటీకి దిగరాదని మెలిక పెట్టినట్లు సమాచారం.
వివేకా కాదంటే... తాము ఆయనపై పోటీ చేసేందుకు ఇప్పటికే అభ్యర్ధిని సిద్దంగా ఉంచామని జగన్ వర్గం చెప్తోంది.
25, ఫిబ్రవరి 2011, శుక్రవారం
ఏకాభిప్రాయం వచ్చాకనే తెలంగాణ'తీర్మానం'
తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ప్రస్తుత పరిస్థితిలో సభ్యులు నడుమ 'ఏకాభిప్రాయం' రాదని తెలిసి కూడా ఆ అంశంపై తీర్మానం పెట్టడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తీర్పు ఇవ్వాల్సింది ప్రజలేనని కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకుగాను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య పంథాలో వారి ఆందోళనలను వ్యక్తం చేస్తున్నా.. టిఆర్ఎస్ ప్రణాళికతో ముందుకు వెళ్లేచేయాలనే తెలంగాణ జేఏసీ..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకోని దాడులకు పురిగొలుపుతోందని ఆరోపించారు శ్రీధర్‌బాబు.
ఇక ఎస్సీ, ఎస్టీలకే..అభయహస్తం
అయితే ప్రస్తుతం కొత్త నిబంధనలతో బీసీలు, ఇతర వర్గాల మహిళలు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 18 నుంచి 59 ఏళ్ల వరకు వయస్సున్న వారికి నమోదు చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి ఈ అవకాశం లేదు. అదే విధంగా ఈ సారి 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారినే చేర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
అభయహస్తం పథకంలో మహిళలు చేరేందుకు మొదట్లో కొంత ఆసక్తి చూపలేదు. కానీ రానురాను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరేందుకు ముందుకు వచ్చారు. మహిళలు పింఛన్లు పొందుతుండటంతో ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకే పరిమితం చేయడంతో వృద్ధ మహిళలకు అవకాశం లేకుండా పోయింది
‘జైబోలో తెలంగాణ’ పైరసీలో పెద్దల హస్తం
పైరసీని అరికట్టే బాధ్యత పోలీసులదని, వారు శ్రద్ధ పెట్టకపోవడం విచారకరమన్నారు. . పైరసీ చేయడం ద్వారా సినీ పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఉద్యమం నేపథ్యంలో వచ్చిన తమ చిత్రాన్ని ప్రతిఒక్కరూ థియేటర్‌లోనే చూడాలని శంకర్ కోరారు.
పరిపాలనా వ్యవస్థ .. అనిశ్చిత పరిస్థితి
ఈ నెల జీతం అందేది గగనమే....
ప్రతి నెలా 25లోగా వేతనాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తేనే నిర్ణీత సమయానికి ఉద్యోగులకు వేతనాలొస్తాయి. కానీ, ఈనెల 17 నుంచి అన్ని శాఖల ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొంటుండడంతో ఫైళ్లతో పాటే వేతనాల బిల్లులూ తయారు కాలేదు. ట్రెజరీలో వేతనాల బిల్లుల దాఖలుకు శుక్రవారం తుది గడువు కాగా, ఉద్యోగుల సహాయ నిరాకరణోద్యమాన్ని జేఏసీ నేతలు మార్చి 5 దాకా పొడిగించారు. మరోవైపు ట్రెజరీ శాఖ ఉద్యోగులు సైతం సహాయ నిరాకరణలో పాల్గొంటున్నారు. దీంతో వేతనాల బిల్లులకు అక్కడ కూడా మోక్షం కలిగే అవకాశం ఎలాగూ ఉండదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి నెల వేతనాల చెల్లింపు లేనట్టే. దీంతో అటెండర్ నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఉద్యోగికీ ఈ నెల జీతం అందేది గగనమే.
ఈ విషయం సహాయ నిరాకరణలో పాల్గొంటున్న ఉద్యోగులు పెద్దగా పట్టించుకోకపోయినా, జిల్లాస్థాయి అధికారులు మాత్రం ఇబ్బందికరంగానే భావిస్తున్నారు. తాము విధులకు సరిగానే హాజరైనా, జీతాలకు వచ్చేసరికి చిక్కులేమిటని వారు అసంతృప్తికి గురవుతున్నారు. కొందరు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం వేతనాలు నిలిచిపోవడాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తెలంగాణ కోసం ఒక్క నెల జీతం ఆలస్యమైతే వచ్చిన ముప్పేమిలేదని చెబుతున్నారు
ఈల పాటతో మురిపించిన రఘురామయ్య
స్త్రీ, పురుష పాత్రలను రంగస్థలంపై ప్రదర్శించడంతో బాటు గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈలపాట రఘురామయ్య. ఏ నాటకంలో నటించినా ప్రేక్షకుల కోరికపై ఈలపాట పాడక తప్పేదికాదు ఆయనకి. రాముడు, కృష్ణుడుగా రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నారు. 'కుచేల' చిత్రంలో కృష్ణుడుగా నటించారు తొలిసారి. 1935 లో విడుదలయిందీ చిత్రం. 1961లో రూపొందిన 'కృష్ణ కుచేల' చిత్రంలోనూ కృష్ణుడుగా నటించారు. కళ్యాణం వెంకటసుబ్బయ్య ఈయన అసలుపేరు. 8వ ఏట నటించిన తొలి నాటకం భక్తరామదాసులో రఘురాముడుగా నటించారు. పెద్దయ్యాక 'భక్త రామదాసు' నాటకంలో 'రఘురాముడు'గా నటించడం చూసాక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 'రఘురామయ్యగా కొనసాగమని 1916లో ఆశీర్వదించడంతో రఘురామయ్య అయి, ఈలపాట రఘురామయ్య అయ్యారు క్రమక్రమంగా.
రంగస్థల నటన కొనసాగిస్తూ 'పృధ్వీపుత్ర' సినిమాతో సినిమానటుడుగా 1933లో కెరీర్ ప్రారంభించి 1975 వరకు మదాలస, గొల్లభామ, శ్రీకృష్ణ తులాభారం ఇలా సుమారు 100 చిత్రాల్లో నటించారు. గుంటూరుజిల్లా సుద్దపల్లిలో 5-3-1900న జన్మించారు. చిన్నతనం నుంచీ సంగీతం తెలియక పోయినా రాగాలాపన పైనే దృష్టి పెట్టి యడవల్లి సూర్యనారాయణ శిక్షణలో గాయకుడు, నటుడు అయ్యారు. 1975లో పరమపదించారు ఈలపాట రఘురామయ్య వర్థంతి ఫిబ్రవరి 24.
కేసులు తేలినంత వరకూ ఈస్టుకోస్టు ఆపాల్సిందే..
కాకరాపల్లి థర్మల్ ప్రాజెక్టు వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లుతోందని, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చిత్తడి నేలల్లో పరిశ్రమలు నెలకొల్పరాదని, చట్టాలు పేర్కొంటున్నా, సాక్షాత్తూ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జైరాంరమేష్ స్పష్టం చేసినా కూడా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకుండా, యాజమాన్యానికి దన్నుకాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రైల్వే బడ్జెట్ ప్రశంసాత్మకం
మార్చిలో'తెలంగాణా' వచ్చేస్తోంది....
రాష్ట్ర మంత్రి సంచలన వాఖ్యల శంకరరావు మార్చి నెలలోనే తెలంగాణా ఏర్పడబోతోందంటూ మరో సంచలన ప్రకటన చేసారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని..ఈ మేరకు మార్చి నెలలో శుభవార్త రాబోతోందని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం, తెరాస నాయకులను కూడా సంప్రదించిందని... త్వరలోనే మరోమారు అఖిలపక్షంతో సమావేశమయ్యాకనే నిర్ణయం వచ్చే నెలలోనే వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలంగాణా ప్రజల ఆకాంక్ష వాస్తవం కాబోతోందని ఆయన అన్నారు.
మే 20న 6వ విడత కల్యాణమస్తు
ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమ నిర్వహణపై పండితులు ప్రభాకర్ పూర్ణయ్య సిద్ధాంతి, వేదాంతం విష్ణు భట్టాచార్యులు, సుందర వదనాచార్యులు , వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామమూర్తి కలిసి పంచాంగాన్ని పరిశీలిం చి ముహుర్త నిర్ణయం చేశారన్నారు. ఆ ముహుర్తం ప్రకారం ఈ ఏడాది మే నెల 20వ తేదీ ఉదయం 9.50 గంటల నుంచి 10.04 గంటల మధ్య ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు కృష్ణారావు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపి, వారి అనుమతితో అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చించి జంటల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలో త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఐదవ విడత కార్యక్రమం తరహాలోనే ఆరవ విడత కల్యాణమస్తు కూడా అన్ని శాసన సభా నియోజక వర్గ కేంద్రాల్లో ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం సహాయ సహకారాలతోనే నిర్వహిస్తామని అర్హుల ఎంపిక నుంచి పెళ్లికి అనుమతించే వరకు గత కల్యాణమస్తు నిబంధనలన్నీ యథావిధిగా అమలులో ఉంటాయని ఆరవ విడత క ల్యాణమస్తు రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతుందని, ఇతర రాష్ట్రాలలో ఉండదని కృష్ణారావు స్పష్టం చేశారు.
'వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాదే'
శివకుమార్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదన్నారు. తాను గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి ఎంతో సేవచేశానని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ స్థాపించి రిజిస్ట్రేషన్‌కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు బాషా తెలిపారు. ఇందుకోసం తగిన ప్రతిపాదనలు కూడా పంపామన్నారు.
ఎట్టకేలకు విద్యాహక్కు చట్టం అమలు ఉత్తర్వులు జారీ
విద్యాహక్కు చట్టం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు తప్పనిసరిగా విద్యనందించాలనేది ఈ చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో ఈ పథకం అమలు జరుగుతుందని ఏడాది కిందట కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చినప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చినప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలులో జాప్యం చేసింది కాగా ఇటీవల ఇందుకు సంబంధించిన విధి విధానాలను సూచిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో జారీ చేశారు. దీంతో ప్రాధమిక విద్యా హక్కు చట్టం అమలుకు రంగం సిద్దమైంది.
ఒయు ఐకాస నేతల మధ్య చిచ్చు
ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టగొడుగుల్లా ఏర్పడిన జాక్ నాయకులపై కామన్ స్టూడెంట్స్ మరోసారి దాడులకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని సాధారణ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఐదు జాక్‌లు ఏర్పడి, దేనికవే సొంత ఎజెండాలతో అక్రమ వసూళ్లకు పాల్పడడమే గాక అసలైన తెలంగాణ ఎజెండాను పక్కన బెడుతున్నాయని వీరి ప్రధాన ఆరోపణ. ప్రధాన జాక్ నేతలు టిఆర్‌ఎస్‌కు, మరో జాక్ లెఫ్ట్ భావజాలం, స్వతంత్ర జాక్ నేతలు టిడిపి, ఓ కుల సంఘానికి అనుబంధంగా, ఇక మిగతా రెండు జాక్‌లు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనకుండా వసూళ్లకోసమే దుకాణాలు తెరిచి, ఇలా ఎవరికి వారే జాక్ నాయకులమని చెలామని అవుతున్నారని కామన్ విద్యార్థులు మండిపడుతున్నారు.
'మార్చి' పరీక్షలకు మంగళం?
వార్షిక పరీక్షలను బహిష్కరిస్తే తిరిగి పరీక్షలు నిర్వహిస్తుందా? లేక హాజరు కాని విద్యార్ధులను ఫెయిల్ లిస్టులో ఉంచుతారా అన్న విషయమై తీవ్ర చర్చ జరుగుతుంది. పరీక్షల బహిష్కరణ మూలంగా ఇంటర్, పదవ తరగతి విద్యార్ధుల పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ విద్యార్ధులు ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సులలో చేరేందుకు వీలులేకుండా పోయే అవకాశం ఉంది. అలాగే పదవతరగతి విద్యార్ధుల భవిష్యత్ కూడా అంధకారంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
వచ్చేనెల 5 వరకు సహాయ నిరాకరణ
ఇప్పటికే అనేక మంది లబ్ది దారులకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు అందడంలేదు...ఇక సమ్మెకుదిగితే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి...
24, ఫిబ్రవరి 2011, గురువారం
దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ఫిబ్రవరి 24.
కవి కుటుంబంలో జన్మించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తన తండ్రి తమ్మన్న శాస్త్రి నుంచి, పెదనాన్న సుబ్బరాయ శాస్త్రి నుంచి కవిత్వం రాయడంలో మెళుకువలు నేర్చుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్‌తో పరిచయం ఆయన కవితా ధోరణిని మార్చింది. ఆకాశవాణిలో 1946లో చేరాక అలవాటుగా రాసేది. తప్పనిసరిగా ప్రోగ్రాముల నిమిత్తం ఎక్కువగా రాయాల్సి వచ్చేసరికి మరోసారి ధోరణి మారింది. చిన్న చిన్న అందమైన పదాలతో అద్భుతంగా అందంగా అర్థాలు వచ్చేలా రాయడం దేవులపల్లి శైలి అయిపోయింది. భావ కవిత్వంకి ఊపిరి పోయడమే కాదు భావకవి ఎలా వుండాలో కూడా ఆయన వేషధారణ తెలిపేది.
సినిమాల్లోకి రప్పించడానికి బి.ఎన్.రెడ్డి చాలసార్లు ప్రయత్నించారు. 'దేవత' చిత్రానికి రాయించాలనుకున్న బి.ఎన్.రెడ్డి పదేళ్ళ తర్వాత 'మల్లేశ్వరి' లో పాటలు రాయించగలిగారు. మల్లిdశ్వరి పాటలేకాదు కృష్ణశాస్త్రి రాసిన ప్రతిపాట ఆణిముత్యంగానే నిలిచిపోయాయి. అందుకే ఆంధ్రాషెల్లిdగా అభివర్ణించారు శ్రీశ్రీ. పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ఫిబ్రవరి 24.
మొదటి కొచ్చిన వేణు
కొంతకాలంగా హీరో వేణు కెరీర్ మెల్లగా సాగుతోంది. లోగడ ఉన్నంత స్పీడ్‌గా సినిమాలు లేవు. పలు చిత్రాలు తెచ్చిపెట్టిన ఫెయిల్యూర్లే ఇందుకు కారణం. అసలు తనను ఇంతవాణ్ణి చేసింది ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ. గతంలో ఆ సంస్థ తీసిన 'స్వయంవరం' చిత్రం ద్వారా వేణు హీరోగా పరిచయమయ్యారు. ఇంకా 'చిరునవ్వుతో' వంటి పలు చిత్రాలను ఆ సంస్థ తీసిన విషయం తెలిసిందే.
అయితే చాలాకాలంగా బయటి చిత్రాలు చేస్తూ వస్తున్న వేణుకు ఫెయిల్యూర్లు తలబొప్పి కట్టించాయి. కెరీర్‌ను తిరిగి ఎలాగైనా మలుపు తిప్పుకోవాలని ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నారు. తన మాతృసంస్థ ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇప్పుడు ఆయన ఓ చిత్రం చేస్తున్నారు. పబ్లిసిటీ లేకుండానే ఈ చిత్ర నిర్మాణం సాగిపోతోంది. వేణు సరసన కమలనీముఖర్జీ నటిస్తోంది. వీరిద్దరూ 'గోపి గోపిక గోదావరి' చిత్రంలో నటించారు. ఈ తాజా చిత్రానికి 'రామాచారి...వీడు...పెద్ద గూఢచారి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
కల హంస చకిత జయలలిత పుట్టినరోజు ఫిబ్రవరి 24.
తమిళ ప్రజానీకంలోని పలువురు అమ్మగా తలుస్తూ, పురోచ్చి తలైవి (విప్లవ నాయిక) గా ఆరాధిస్తారు జయలలితను. నలుగుసార్లు తమిళనాడు శాసన సభ్యురాలిగా ఎన్నికై రెండుసార్లు ముఖ్యమంత్రిగానూ పాలించి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగుతున్న జయలలిత తొలుత తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తన అందచందాలతో, ముద్దు ముద్దుగా డైలాగ్స్ పలుకుతూ అలరించారు. జయలలిత తమిళ పత్రికలకు పలు వ్యాసాలు కూడా రాసారు నటనకు బ్రేక్ పెట్టాక. సినీ నటి సంధ్యకుమార్తె అయిన జయలలిత కర్ణాటకలోని మెలుకొటెలో 1948 పుట్టి, బెంగుళూరులో కొంతకాలం చదువుకున్నారు. తల్లితో, తమిళనాడుకు మకాం మార్చడంతో మిగతా చదువు మద్రాసులో సాగింది. తల్లి నటి కావడంతో తల్లి ప్రోత్సాహంతో నాలుగో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకొని 1965లో నటననే వారసత్వంగా భావించి 13వ ఏట 'ఎపిస్టిల్' అనే ఆంగ్ల చిత్రంతో నటనకు శ్రీకారం చుట్టారు. జయలలిత కన్నడంలో నాయికగా నటించిన తొలిచిత్రం 'చిన్నాడ గొంబె', తెలుగులో అక్కినేని హీరోగా నటించిన 'మనుషులు మమతలు' మంచి విజయం సాధించాయి. మనుషులు మమతలులో అక్కినేనిని ఆటపట్టించే యువతిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు.
ఎం.జి.రామచంద్రన్ సరసన నాయికగా 28 చిత్రాల్లో, శివాజీగణశన్తో 14 చిత్రాల్లో, జెమినీ గణశన్తో, జయశంకర్‌తో నాలుగేసి చిత్రాల్లో, ముత్తురామన్, రవిచంద్రన్‌లతో రెండేసి చిత్రాల్లో, ధర్మేంద్రతో 'ఇజ్జత్' అనే ఒక హిందీ చిత్రంలో జయలలిత నాయికగా నటించారు. 1969 విడుదలైన అడిమయప్పన్ చిత్రంలో కె.వి. మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడటంతో గాయనిగా అవతారం కూడా ఎత్తి, సూరియకాంతి, వైరం, అన్బతెడి తిరు మాంగల్యం, ఉన్నయ్ సుత్రమ్ ఉలగం' తదితర చిత్రాల్లో పాటలు పాడి చక్కని గాయనిగానూ గుర్తింపు పొందారు.
తెలుగులో అక్కినేని సరసన కథానాయికగా 'మనుషులు మమతలు'తో కెరీర్ ప్రారంభించి ఆయనతో అదృష్టవంతులు, ఆస్తిపరులు, భార్యాభర్తలు, భార్యాబిడ్డలు, ఆదర్శకుటుంబం తదితర చిత్రాల్లొ, ఎన్టీఆర్‌తో నిలువుదోపిడి, కథానాయకుడు, కదలడు వదలడు, గోపాలుడు భూపాలుడు, దేవుడు చేసిన మనుషులు, బాగ్దాద్ గజదొంగ, కృష్ణతో గూఢచారి 116, శోభన్‌బాబుతో డాక్టర్ బాబు, జగ్గయ్యతో ఆమె ఎవరు తదితర చిత్రాల్లో నట్టించారు. స్విమ్ సూట్‌లోనే కాదు. చీరకట్టులోనూ, ఆధునిక వస్త్రాల్లోను బొద్దుగా వుండే జయలలిత ఆరోజుల్లో ప్రేక్షకుల కలలరాణి. నదియై తేడి వందా కదల్ ఆమె 1980లో నటించిన చివరి చిత్రం.
ఎం.జి.ఆర్‌ని బాగా అభిమానించిన జయలలిత 1981లో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. పార్టీలో జేరి రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయ్యారు. ఎం.జి.ఆర్. మరణానంతరం ఎం.జి.ఆర్ భార్య జానకి రామచంద్రన్ వారసురాలే అయినా తరువాత వచ్చిన మార్పులతో జయలలితనే వారసురాలిగా నిర్ణయించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి కాగలిగారు. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించి, కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. కలైమామణి జయలలిత పుట్టినరోజు ఫిబ్రవరి 24.
రంగుల్లో”లక్ష్మీ కటాక్షం’
ఎన్టీరామారావు, కె.ఆర్.విజయ ప్రధాన పాత్రలు పోషించిన 'లక్ష్మీ కటాక్షం' చిత్రాన్ని రంగుల్లో అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'మాయాబజార్' ని రంగుల్లో అందించగా ఘనవిజయం సాధించింది. దేవానంద్ నటించిన 'హమ్ దోనో'ని కలరింగ్ చేసి ఇటీవల విడుదల చేయగా విజయం సాధించింది. ఈ స్ఫూర్తితో గోల్డ్ స్టోన్ టెక్నాలజీ స్ లిమిటెడ్ సంస్థ రంగుల చిత్రంగా 'లక్ష్మీ కటాక్షం'ని రూపొందించే ప్రయత్నాలు చేబట్టారు బి. విఠలాచార్య దర్శకత్వంలో పి.ఎస్.ఆర్. పతాకాన పింజల సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం 8-1-1970న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. ఇది ఎన్టీఆర్ నటించిన 175 వ చిత్రం.
రాజశ్రీ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, బాలయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ, హేమలత ముఖ్యపాత్రలు పోషించిన 'లక్ష్మీకటాక్షం'కి పాటలు సి. నారాయణరెడ్డి, కొసరాజు, చిల్లర భావనారాయణ రాయగా సంగీతం ఎస్.పి. కోదండపాణి సమకూర్చారు. ఘంటసాల, సుశీల, జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి పాటలు పాడారు. కె.ఆర్.విజయ, రాజశ్రీ, ఎన్టీఆర్‌తో చిత్రీకరించిన పలు శృంగార గీతాలున్నాయి.
'అమ్మమ్మమ్మో తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే', 'రా వెన్నెలదొరా కన్నియ్యను చేరా', 'అందాల బొమ్మను నేను', 'కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెెమ్మో', 'నా వయసు సుమగంధం నాదు మనసు మకరందం', 'పొన్నచెట్టు మాటున పొద్దు వాలిపోతుంది', 'స్వాగతం స్వాగతం', 'శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు', 'సకల విద్యామయీ ఘన శరదిందు', 'జయజయ మహాలక్ష్మి జయ మహాలక్ష్మి' వంటి పాటలు, 'ధన్యోస్మి ధన్యోస్మి' అనే శ్లోకం అలరించాయి ప్రేక్షకులను, శ్రోతలను.
రాష్ట్ర విభజన ఎప్పుడు ఎలా?
ఈ వేర్పాటువాదం 7 కోట్ల పేద ప్రజల మేలు కోసం కాదు. అంటే 80 శాతం పేదరికాన్ని పక్కన పెట్టేసి అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు కేవలం అధికారం కోసమే రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. రాష్ట్రంలోను 23 జిల్లాలలోని మూడు కోట్ల కుటుంబాలలో 2 కోట్ల 30 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులిచ్చారు. అంటే 80 శాతం పేదరికం 23 జిల్లాలలోను ఉందని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. 80 శాతం పేద ప్రజలపై కుటిల ప్రేమను, కపట ప్రేమను చూపించి రాష్ట్రాన్ని విభజించాలని అంటే కేవలం అధికారం కోసమే విభజించాలని విధ్వంసాలు సృష్టిస్తూ సోనియాగాంధీని కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు.
ఒక్క సిపిఐ(ఎం) పార్టీ తప్పించి అన్ని అధికార ప్రతిపక్ష శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. నల్ల ధనవంతులు వేర్పాటు వాదానికి డబ్బు సరఫరా చేసి అధికారం కోసమే రాష్ట్రాన్ని విభజించాలని రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే 20 శాతం ఉన్న నల్లధనవంతులకే అధికారం వస్తుంది. 80 శాతం పేదరికాన్ని నిర్మూ లించాలనే ధ్యేయంతోనే 20 రాష్ట్రాలలో నక్సలిజం పుట్టిందనేది నగ్నసత్యం. భూమిని జాతీయం చేసి భూములు పంచి, గనులను, వ్యాపారాన్ని, పరిశ్రమలను జాతీయం చేస్తే నక్సలిజమే మాయమైపోతుంది. అసలు 80 శాతం పేద ప్రజలకు రాజుపాలించినా ఒక్కటె, రెడ్డి పాలించిన ఒక్కటె. కాబట్టి భూమిని జాతీయం చేసి స్వంత ఆస్తిహక్కును రద్దు చేసిన తరువాత మాత్రమే రాష్ట్రాలను విభజించాలి.
మద్యాన్ని మైమరిపించే తియ్యదనం!
అల వాటులో పొరపాటు సహజమే కానీ, ఏదైనా అలవాటును పొరపాటున కూడా వదులుకోలేని బలహీనత మనలో చాలా మందిలో ఉంది. ఈ బలహీనతను ఆధారం చేసుకునే కాఫీ,తేయాకు, మద్యం, సిగెరెట్, పొగాకు ఉత్పత్తుల విక్రయం దారులు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు మొదలు పెద్ద ఉద్యోగాలు చేసే మధ్యతరగతి,ఉన్నత స్థాయి వర్గాల వారి వరకూ ఈ అలవాట్లలో కనీసం కొన్ని అయినా లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి కుటుంబాల్లో ఇంటి పెద్దల పట్ల భయం లేదా,గౌరవంతో చాటుమాటున ఈ వ్యసనాలకు పాల్పడే వారు ఇప్పుడు వ్యష్టి కుటుంబాల్లో బహిరంగంగానే ఇళ్ళలోనే ధూమపానం, మద్యపానం లాగించేస్తున్నారు. వీటి వల్ల ఆ యా వ్య క్తులకే కాక, కుటుంబ సభ్యులకు కూడా కేన్సర్, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి వ్యాధులు సంక్రమించడం మనం స్వ యంగా చూస్తున్నాం.
ఈ అలవాట్లన్నింటిలో మహ మ్మారి అనదగిన మద్యపానం గురించి ఎంత చెప్పినా, ఎందరు చెప్పినా, ఎన్ని సందర్భాల్లో చెప్పినా తక్కువే అవుతుంది. మద్యపానం వ్యసనాన్ని మాన్పించేందుకు ఇటు మన దేశంలోనూ, అటు విదేశాల్లోనూ వైద్యులూ, శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలే మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న దుస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రోగాలను నయం చేసే మందుల దుకాణాలు లేకపోయినా, ప్రతి వీధికీ ఒకటి లేదా రెండు మద్యం దుకాణాలు దర్శనమిస్తున్నాయి. మద్యం అమ్మకాలను ప్రభుత్వాలే ప్రోత్సహించడం ఆరు దశాబ్దాల స్వతంత్ర భార త దేశంలో మనం సాధించిన ప్రగతి. ఇంతకీ మందు మాన్పించే “డీ అడిక్షన్’ వైద్యం కూడా ఇప్పుడు నగరాలు, పెద్ద పట్టణాల్లో లభిస్తోంది.
మద్యం నియంత్రణ అనేది ఒక సాంఘిక ఉద్యమంగా సాగిన దృష్టాంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. తీపి పదార్ధాలను ఇష్టపడే వారు మద్యం వ్యసనం నుంచి తేలికగా బయటపడగలరని హెల్సింకీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ వెల్‌ఫేర్ సంస్థకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో తేలింది. మద్యం లేనిదే బతకలేని వారిలో స్వీట్లు ఇష్టపడే వారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్టు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.అలాగే,తియ్యని మాటల ద్వారా కూడా ఈ వ్యసనం బారి నుంచి తప్పించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
నాల్ట్రేగ్జిన్ అనే మందు సేవిస్తే మద్యం మీద ఆసక్తి క్రమంగా తగ్గుతుందనీ,అంతిమంగా ఆ అలవాటు నుంచి దూరం కావచ్చునని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హెల్సింకీలోని నేషనల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌లో డేవిడ్ సిన్‌క్లార్ అనే పరిశోధకుడు, ఆయన సహచరులు పరిశోధనలు చేసి ఈ మందును కనుగొన్నారు.
ఆస్ట్రేలియాలో పదేళ్ళ వయసు గలవారు,ఇంకా అంతకన్నా చిన్న వారూ మద్యానికి బానిసలు అవుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరిని మద్యం వ్యసనం కోరలనుంచి తప్పించేందుకు మెల్‌బోర్న్,సిడ్నీ తదితర నగరాల్లో యత్నా లు సాగుతున్నాయి. ఇందుకోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, మత్తు కోసం, అదే విధమైన ఆనందం కోసం పిల్లలు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారనీ, ఇంట్లో తల్లితండ్రుల అలవాట్లు, జీవన విధానం,బయట వాతావరణం అన్నీ కూడా వారిని మద్యం వైపు నడిపిస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. మెల్‌బోర్న్‌లో ఒడెస్సీ హౌస్ ఈ మధ్య ఒక సర్వేని నిర్వహించింది. 15-24 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలూ, యువకులూ మద్యం కారణంగా అకాల మరణం పాలవుతున్నారనీ, ఇలా మరణించేవారి సంఖ్య ఏటా 264 వరకూ ఉంటుందని ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ పిట్స్ తెలియజేశారు.
కాగా, మద్యం వ్యసనం వల్ల ప్రపంచ వ్యాప్తం గా ఏటా 20 లక్షల మంది పైగా మరణిస్తున్నట్టు ప్ర పంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తున్నది.ఇలా మరణించేవారిలో వేలాది మంది యువకులు తప్పనిసరిగా ఉంటున్నారని ఆ సంస్థ పేర్కొం ది. మద్యం వ్యసనం వల్ల యవ్వనంలోనే వృద్ధాప్యపు లక్షణాలు మనిషిలో కనిపించడం, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరి తిత్తులు చెడిపోవడం సర్వసాధారణమవుతోందనీ, బ్రెస్ట్ కేన్సర్ వంటి భయంకర మైన వ్యాధుల బారిన పడుతున్నారని అంటు వ్యాధుల నిరోధం, మానసిక ఆరోగ్యం విభాగం అసిస్టెంట్ డైరక్టర్ జనరల్ అలా అల్వాన్ తన పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నారు. రష్యాలో ప్రతి ఐదుగురిలో ఒకరు మద్యం కారణంగానే మరణిస్తున్నట్టు ప్రపంచ వ్యాప్తంగా అందిన సమాచారాన్ని క్రోడీకరించి విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. బ్రెజిల్, కజకస్థాన్, మెక్సికో, దక్షిణాఫ్రికా, యుక్రేయిన్‌లలోకూడా మద్యం మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. కల్తీ మద్యం కారణంగా మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రం లో ఎంతో మం ది బలి అవుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మద్యాన్ని మాన్పిం చేందుకు వ్యసనపరులకు కౌన్సిలింగ్ నిర్వహించే కేంద్రాలు కూడా పెద్దనగరాలు,పట్టణాల్లో ఇప్పటికే వెలిశాయి. అయితే, ఇవి సొమ్ము చేసుకునేందుకు కొందరికి ఉపాధి కేంద్రాలుగా ఉపయోగ పడుతున్నాయి తప్ప ఆచరణలో తగిన ఫలితం కనిపించడం లేదు, మద్యాన్ని మాన్పించేందుకు స్వాతం త్య్రోద్యమంలో “కల్లు మానండోయ్’ అనే గీతాల ద్వారా జనాన్ని చైతన్యపర్చేవారు. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన రోశమ్మ అనే ఆమె నాయకత్వంలో మహిళలు ఉద్యమించారు. మళ్ళీ అలాంటి ఉద్యమం వస్తేనే మద్యం నియంత్రణ సాధ్యం అవుతుంది.
ఈ వధువుకి వేల కొద్దీ క్యూ
ఎన్టీటీవీ ఇమేజిన్‌లో స్వయంవర్ 'రతన్ కారిస్టా' ప్రసారం కాబోతుంది. ఈ స్వయం వరానికి 300కాదు 30,000 దరఖాస్తులు వచ్చాయంటే మాటలా. అదీ 'రతన్ రాజ్ పుట్' ను మనువు ఆడటానికి, కేవలం ఒక్క అమ్మాయినే వరించ టానికి ఇంతమంది క్యూ కట్టారు.
లాలీ అని ముద్దుగా పిలువబడే ఈ సుందరాంగికి ఇప్పుడు సెలెక్షన్ పెద్ద తలనొప్పే. ఈ ముద్దుగుమ్మ చక్కా గృహిణిలా దర్శనమిచ్చే బుల్లితెర నటి. తల్లి దండ్రులు ఇంకా ముంబై చేరక పోవ డంతో, రతన్ రాజ్‌పుట్ దరఖాస్తులను, ఒడపోత చేస్తుంది. వరుల సంఖ్య పెరిగే కొద్దీ, ఎన్నిక మరింత కష్టమే. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' కు ఇంకా ఎన్ని రోజులు ఆగాలో తెలి యటంలేదు. గతంలో రాఖీ సావంత్ కల్యాణం తంతులా కాక మేడి పండులను చూసి మురిసి పోకూడదంటుంది. మొత్తానికి ఈ స్వయంవరం ఎంతో ఆసక్తిని రేకె త్తించింది. ఇంతకీ వరించి వచ్చే ఆ మన్మధుడు ఎవరో వేచిచూడాలి.
శనీశ్వరుడు శాంతించాలంటే...
శని పీడితులు ఆయనను తిడుతూ కూర్చోక ఎలా ప్రసన్నుడిని చేసుకోవాలా అని ఆలోచించాలి. శనిని తృప్తి పరచడం అన్నది నిజానికి చాలా కష్టమైన వ్యవహారమే. మనిషి యొక్క జాతకంలో శని ప్రభావం వుంటే ఆ వ్యక్తిని బాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న శనిగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం తప్ప వేరు మార్గం లేదు. ఆయనని గనుక సంతృప్తి పరుస్తే కార్యసిద్ధికి ఉన్న ఆటంకాలన్నింటినీ దాటి బ్రతుకును బంగారుమయం చేసుకోవచ్చు నంటారు. శనివారం నాడు తల్లవారుజామున తలస్నానం చేసి, తిలల నూనె తో దీపం పెట్టి శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించి ఒంటి పూట భోజనం చేయడం వల్ల శని దోషం చాలా వరకు తగ్గుతుంది. ఆ రోజు ఉదయంపూట హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలి. శని వాహనమైన కాకికి ఆహారం పెట్టడం వల్ల కూడా శని దోషం తగ్గుతుంది.
భైరవుని ఆరాధన చేసి, నల్లనువ్వులు, ఇనుము దానం ఇవ్వాలి. పుష్యమి-అనూరాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. పుష్యమి కర్కాటక రాశికి సంబంధించింది. అనూరాధ వృశ్చికరాశికి సంబంధిం చింది. ఉత్తరాభాద్ర మినరాశికి సంబంధించింది. కంటి చూపు తగ్గటం, ఉబ్బసం, దగ్గు, కఫం వంటి వ్యాధులు శనిగ్రహా ప్రతీకూలత వల్ల వస్తాయంటారు. ఇళ్ళు కూలిపోవడం, అగ్నిప్రమాదాలు జరగడం కనుబొమ్మల రెప్పలు కాలిపోవడం శనిప్రభావమే! సాధువులకూ, దీనులకూ వంట పాత్రలు దానం చెయ్యాలి. శని ప్రతిమను లోహంతో చేయించి పూజించి నల్లనువ్వులూ నూనెపాత్రతో సహా బ్రాహ్మనిడికి
''య:పునర్భ్రష్ట రాజ్యాయ సలాయ పరితోషిత: స్వప్నేదదౌనిజం రాజ్యం సమేసౌరి||.''
అంటూ దానం చెయ్యాలి.
నలుడు రాజ్యం కోల్పోయి నానా కష్టాలు పడ్డాక ఈ మంత్రాలతో తిరిగి విజయం సాధించాడు. విజయం సాధించడానికి వేరే మంత్రాలూ వాటి మాత్రిక లక్షణాలూ ఏమీ లేవు కృషి తప్ప! ఈశ్వర శక్తిని గమనించి మనం ఎంతో నేర్చుకోవలసింది వుంది. బాధలకు కృంగి పోయి శనిని తిట్టుకుంటూ కూర్చోడం కంటే కష్టాన్ని ఎదురీదాలనే తపస్సే మంత్రం దాన్ని ఆచరించడమే పరిహారం!
ఏకాదశులలో 'షటతిలైకాదశి' అని వస్తుంది. ఆరోజున నీళ్ళల్లో నువ్వులు వేసుకొని స్నానం చెయ్యాలి. నువ్వులు ముద్దగా నూరి ఒంటికి రాసుకోవాలి. ఆరు నువ్వు గింజలు తినాలి. త్రాగే నీటిలో నువ్వులు వేసుకు తాగాలి. కాసిని నువ్వులు దానం ఇవ్వాలి. వాటితో తర్పణం వదలాలి. ఇలా చేస్తే విష్ణువుకు ప్రీతి కలుగుతుందీ. శనికి మన బంధన వదులుతుంది.
మార్చి 1తర్వాత తాడోపేడో ...
మొదటి రోజు జెపిసి కోసం సహకరించాలని ప్రతిపక్షాలు అడిగాయని,దాంతో మొదటి రోజు తాము తెలంగాణపై పట్టుబట్టలేదని, బడ్జెట్ ప్రతిపాదన ముగిసే వరకు ఆగాలని తమను ఎన్‌డిఎ కోరిందని, దాంతో తాము ఆ తర్వాతే తెలంగాణ బిల్లు కోసం పట్టుబట్టాలని.. తెలంగాణపై పార్లమెంటును స్తంభింపజేద్దామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తమకు ప్రతిపక్షాలన్నీ సహకరించాయని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని.. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.
'రామ్ ఢమాల్ వర్మ'పై క్రిమియల్ యాక్షన్
వెరైటీ పాత్రల హీరో సత్యరాజ్
వెరైటీ పాత్రలు పోషించే హీరోగా సత్యరాజ్‌కి తమిళనాట మంచి ఆదరణ వుంది. ఇప్పుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వంలో 'సత్తపది కుట్రమ్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించిన 'సట్రం ఒరు ఇరుట్టరయ్' చిత్రాన్ని పునర్నిర్మిస్తున్నారు. అప్పట్లో ఇతివృత్తపరంగా కూడా సంచలనం సృష్టించిందా చిత్రం.
ఎం.జి.ఆర్‌కి 'నాడోడి మన్నన్' రజనీకాంత్‌కి 'బాద్‌షా' తెచ్చినంత పేరు 'సత్తపది కుట్రమ్' చిత్రం ద్వారా తనకి లభిస్తుందని విశ్వసిస్తున్నారు సత్యరాజ్. ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయే పాత్రగా దర్శకుడు చంద్రశేఖర్ రూపొందించడంతో అలా నిలబడటానికి వీలుగా చాలా కసరత్తు చేస్తున్నారు. తన జుత్తు బాగా పెంచారు కూడా. పెరిగిన జుత్తు, నెత్తిమీద క్యాప్‌తో హావభావాల ప్రదర్శనలో కొత్త మేనరిజాలు చూపడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన. సత్యరాజ్ సరసన సీమన్ అడ్వకేట్‌గా నటిస్తోంది. విక్రాంత్, బానుకూడా కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చంద్రశేఖర్‌కుమారుడు హీరో విజయ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించవచ్చు.
ఆయిరం విలక్కు, నన్బాన్ (3ఇడియట్స్) చిత్రాల్లో కూడా సత్యరాజ్‌కి విలక్షణమైన పాత్రలే లభించాయి.
జై బోలో తెలంగాణ సెన్సార్ కట్స్
ఈ చిత్రాన్ని 9 మంది సభ్యులతో కూడిన రివైజింగ్ కమిటీ 11 కట్స్‌తో 67.08 అడుగుల ఫిలిం కత్తిరించి, 31-01-2011న 'ఎ' సర్టిఫికెట్ జారీచేసింది.
1. వాయిస్ ఓవర్‌తో పాటు 'చారిత్రక, భూమిక ఆధారంగా కొన్ని వాస్తవ సంఘటనలను కొన్ని కల్పిత సన్నివేశాలను, సంస్థలను జోడించి తీసిన చిత్రం. ప్రేక్షకులు గమనించగలరు, అనే అంశాన్ని చూపాలని కోరితే ఆ విధంగా వాయిస్ ఓవర్‌తో చూపించారు.
2. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న రాజకీయ నాయకులను, మన గ్రామం రాకుండా అడ్డుపడదాం' అనే డైలాగ్‌ని సౌండ్‌తో సహా తొలగించారు.
3. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన ఇంటర్వ్యూలో రిఫరెన్స్‌గా పేర్కొన్న కులాలు, శ టు ష తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
4. మూడు నాలుగు రీళ్ళలో 'నీకు అవేమన్నా రెండు ఉన్నాయా' అనే డైలాగ్ తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.
5. ఏడవ రీలులో విద్యార్థి ఆహుతి అయ్యే దృశ్యాలను 50 శాతం తగ్గించమని, అంబేద్కర్‌తో చారి డైలాగ్‌ని ట్రాన్స్‌లోగాని ఊహలోగాని ఉన్నట్టు మార్చాలని కోరడం ద్వారా 40 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరపాలయింది.
6. తొమ్మిది పది రీళ్ళలో
ఎ) తెలంగాణ రాకుండా చాలా సూట్‌కేసులు అడ్డు పడుతున్నాయి
బి) ఇదా చిదంబర రహస్యం
అని ఉన్న డైలాగ్స్‌ని సౌండ్‌తో సహా తొలగించారు.
7. పదకొండు పన్నెండు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలోగల 'అయితే చంపుతాం... చంపుతాం... తెలంగాణకు అడ్డు వచ్చిన వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరుకుదాం నరుకుదాం... తెలంగాణకి అడ్డువచ్చిన వాళ్ళను తరిమి తరిమి తరిమి కొడదాం' అనే డైలాగ్ సౌండ్‌తో సహా తొలగింపుకు గురి అయింది.
8. పదకొండు పన్నెండు రీళ్ళలో గల 'డిసెంబరు 9న చిదంబరంగారు ఏమి మాటిచ్చారు' డిసెంబరు 23న ఏ మాటిచ్చారు డైలాగ్‌ని తొలగించి శబ్దం రాకూడదన్నారు.
9. పదకొండు పన్నెండు రీళ్ళలో విద్యార్థులను పోలీసులు హింసించే దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 27.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
10. పదమూడు పద్నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన 'తెలంగాణ జాతరొచ్చెరా' పాటలో గల 'పన్నులు కట్టొద్దుర' అనే పదాల్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
14 రీళ్ళ నిడివిగల 'జై బోలో తెలంగాణ' చిత్రం 4-2-2011న విడుదల అయింది.
నటిస్తూ మరణం ఆహ్వనించిన ముక్కామల
దుర్యోధనుడుగా మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో, విశ్వామిత్రుడుగా సత్యహరిశ్చంద్ర, సీతా కళ్యాణం చిత్రాలలో, గురువుగా గురువుని మించిన శిష్యుడు, విరాటురాజుగా నర్తనశాలలో, 'ముత్యాలముగ్గు'లో విలన్‌గా ముక్కామల ప్రత్యేకమైన పొడవైన పెర్సనాల్టిd, ప్రత్యేక తరహాలో డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. విలన్‌గా పలు చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్‌గా ఎంటరై హీరోగా నటించి మళ్ళీ విలన్ తరహా పాత్రలకు ఆ తరువాత కేరక్టర్ రోల్స్‌కి పరిమితమైన ముక్కామల రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా సమకూర్చారు.
కోపాన్ని, కాఠిన్యాన్ని మాటల్లో, భావాల్లో పలికిస్తూ, పళ్లు నూరినట్టుగా కూడా కనిపించి తన ఆగ్రహాన్ని ప్రదర్శన చేయడంలోనూ, పట్టరాని కోపం వున్నా సందర్భం లేనపుడు అదిమిపట్టి, దాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించడం లోనూ ముక్కామల అభినయానికి మంచి మార్కులు పడేవి.
1920లో గుంటూరులో జన్మించిన ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్.శర్మ ఎన్టీఆర్, జగ్గయ్య ఒక సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శిస్తూవుంటే, తనూ ఆ నాటకాల్లో కీలకపాత్రలు పోషించేవారు. తను స్వయంగా భక్త కబీర్, నాటకం రాసి ప్రదర్శించి ప్రశంసలూ పొందారు.
డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, సినీ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. రంగస్థల నటుడుగా సి. పుల్లయ్యకు పరిచయమయ్యాక హీరో కావాలనే ఉద్దేశ్యంతో ఆ పరిచయం పెంచుకున్నారో, మరో రకంగా పెంచుకున్నారో గాని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి, అది చేస్తూనే 'మాయా మచ్ఛీంద్ర' చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా కీలకమైన పాత్ర పోషించి సినీ నటన ప్రారంభించారు. 1945లో విడుదలైన ఆ సినిమా అంతగా ఆడక, ముక్కామలకు గుర్తింపు రాలేదు గాని, సహాయ దర్శకుడుగా కొనసాగారు పుల్లయ్య వద్ద కొన్ని చిత్రాలకు. ఆ తరువాత రామకృష్ణ దర్శకత్వంలో భరణి పతాకాన రూపొందిన 'లైలా మజ్ను'లో లైలా పాత్ర పోషించిన భానుమతి తండ్రిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడుగా.
మాంత్రికుడిగా స్వప్నసుందరి, విలన్‌గా నిరపరాధి తదితర చిత్రాల్లో చేసాక, హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'నిర్దోషి' చిత్రంతో హీరో అయ్యారు. అలా ఆయన కోరిక హెచ్.ఎం.రెడ్డి ద్వారా తీరిందిగాని, అప్పట్లో హీరోలు అందంగానే వుండాలనే తలచే దర్శక నిర్మాతల కారణంగా మళ్ళీ విలన్ పాత్రలవేపే మళ్ళారు. అయినా సహాయ దర్శకుడుగా లభించిన అనుభవంతో 'మరదలు పెళ్ళి' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి, అందులో హీరోగా నటించారు సినిమా సరిగా ఆడలేదు. అయితే 'పరోపకారం' చిత్రంలో మళ్ళీ హీరోగా నటించే అవకాశం వచ్చింది. సినిమా పరాజయంతో హీరో ఛాన్స్‌లు కొండెక్కాయి. 1951లో 'నిర్దోషి'లో. 1952లో మరదలి పెళ్ళి, 1983లో పరోపకారం ఈ మూడు చిత్రాల్లోనూ హీరో. నిర్దోషి ఆడినా, మిగతా రెండూ పరాజయం చెందాయి. తన విధివ్రాత విలన్, విలన్ తరహా పాత్రలకే అనే నిర్ణయానికి వచ్చి ఆ పాత్ర పోషణలో ఒక శైలిని ఏర్పరుచుకుని చిత్ర చిత్రానికీ పేరు పెంపొందించుకున్నారు. తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. 'ఋష్యశృంగ' చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. ఆ చిత్రం కూడా సక్సెస్ కాక మళ్ళీ డైరక్షన్ జోలికి వెళ్ళలేదు.
కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్ వేయడం ముక్కామల హాబీలు. నటుడయ్యాక ఎక్కడ టెన్నిస్ పోటీలు జరిగినా చూడటమే గాని, ఆడడం తగ్గించేసాననేవారు. పలు చిత్రాల్లో నటించినా, ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండేది తర్వాత తర్వాత. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తూనే 1987లో మృతిచెందారు. ముక్కామల జయంతి 28.
బడ్జెట్ సవరించక పోతే మళ్లీ ఉద్యమిస్తా...
ఫీజు రీయంబర్స్‌మెంట్ సమస్యపై ఏడు రోజుల పాటు సాగించిన దీక్షను విరమించిన తర్వాత ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు. ఒక్క దూత కూడా తన వద్దకు రాలేదని తాను బాధపడలేదని, 25 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బ తీసిందని, పేద విద్యార్థులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని కొనసాగినిస్తే తప్పు చేసినవారమవుతామని.. పేద ప్రజల కోపాగ్నిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఒక్క రోజు దీక్ష చాలదని, ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలంటే బడ్జెట్ పెట్టే సమయంలో ఒత్తిడి పెరగాలంటే తాను వారం రోజుల పాటు దీక్ష చేయాలని భావించానని..3,450 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, మళ్లీ అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కేవలం 3 వేల కోట్లు మాత్రమే కేటాయించి, చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. నామమాత్రంగా కేటాయింపులు జరిపి విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారని.. తాను రామరాజ్యాన్ని చూడలేదు గానీ వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణ రాజ్యం చూశానని..మళ్లీ ఆ రాజ్యాన్ని తీసుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని.. ఇందుకు అంతా కారోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు జగన్.
ఈజిప్ట్ తరహా ఉద్యమం : రాములమ్మ హెచ్చరికలు
గురువారం ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ .. టీఆర్ఎస్‌కు మద్దతుగా ఎన్డీయే, సీపీఐ మద్దతు తెలిపాయని, తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని భయంతో.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం మొక్కుబడిగా మాట్లాడారు తప్పితే పూర్తి ఆసక్తి కనబర్చలేదని రాములమ్మ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావటం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేనట్లుగా ఉందని..టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అంటూ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని...లేకుంటే..తెలంగాణ ప్రజలు రోడ్లమీదకి వస్తే ఈజిప్ట్ తరహా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. ఏదీ ఏమైనా తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుందని ఆమె స్పష్టం చేస్తునే ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం సమయమొచ్చినప్పుడని ముక్త సరిగా సమాధానమిచ్చారు.
తెలంగాణ ద్రోహిని బర్తరఫ్ చేయాలి :టీఆర్ఎస్
మాటల తూటాల ముళ్లపూడి మరి ఇక లేరు
కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకటరమణ (80) గురువారం తెల్లవారుజామున మరణించారు. ముళ్లపూడి వెంకటరమణ, సినీ దర్శకుడు బాపు స్నేహానికి మారుపేరు. ఆనాటి సాక్షి చిత్రం మొదలు, నిన్న మొన్నటి రాధాగోపాలం చిత్రం వరకు బాపు నిర్మించిన ప్రతి చిత్రానికి ముళ్లపూడే రచయితగా పనిచేశారు.
తొలుత ఆంధ్ర పత్రికలో ఉప సంపాదకుడిగా జీవితం ప్రారంభించిన ముళ్లపూడి వెంకటరమణ బాపుతో కలిసి సాక్షి చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక చిత్రాలకు సృజనాత్మకత తెలుగు సినిమా రంగానికే కొత్త అందాలు తెచ్చిన ముళ్లపూడి సినీ రచయితగా అనేక చిత్రాలకు నంది అవార్డులు కూడా లభించాయి.ముళ్లపూడి రాసిన బుడుగు తెలుగు సాహిత్యంలో అత్యంత ముఖ్యమైనది. ముళ్లపూడి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందారు. ఈయన కుమారుడు యువ దర్శకుడు ముళ్లపూడి వర.
దీక్ష విరమించిన జగన్
23, ఫిబ్రవరి 2011, బుధవారం
పెళ్లిళ్లకు ఇంతమంది మాత్రమే హాజరవ్వాలి
ఇలా వృథా అయ్యే ఆహారాన్ని ఆదా చేయడం వల్ల దేశంలో ఆకలితో బాధపడేవారికి, పేదవారికి అన్నం దొరుకుతుందని భావిస్తున్నామని చెప్పారు. అందుచేత పెళ్లిళ్లకు అతిథుల హాజరుపై పరిమితి విధించాలని భావిస్తున్నామన్నారు. అయితే, ప్రభుత్వ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. దేశంలో ఇంతకన్నా తీవ్రమైన సమస్యలు ఇన్ని ఉండగా ప్రభుత్వం ఇలాంటి పనికిమాలిన విషయాలపై దృష్టి పెట్టడం అసహ్యం గొలిపేదిగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
'మధురమీనాక్షి' ఆడియో విడుదల
సెట్స్ నిర్మాణంలో 'శ్రీరామరాజ్యం'
కాగా వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్న ఈ చిత్రంలో సీతగా నయనతార, హనుమంతునిగా ఒకప్పటి దారాసింగ్ అబ్బాయి విందు ధారాసింగ్ నటిస్తున్నారు. జనకునిగా మురళీమోహన్, జనకుని భార్యగా సుధ, భూదేవిగా జయసుధ, వశిష్టుడుగా బాలయ్య, లక్ష్మణునిగా శ్రీకాంత్, భరతునిగా సాయికుమార్, రుష్యంగుడిగా నాగినీడు, తిప్పడుగా బ్రహ్మానందం, రంగిగా ఝాన్సీ నటిస్తున్నారు. ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
పీతాంబరానికి నివాళి
మరో ధృవతార రాలిపోయింది
జగన్ పై సర్కార్ కక్ష సాధింపు
ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విషయంలో సర్కార్ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందన్నారు..
చంద్రబాబు దీక్ష చేస్తే.. మూడోరోజేపరిగెట్టారు, తెలంగాణా ఎంపీలు దీక్ష చేపట్టిన గంటల్లోనే విరమించేందుకు యత్నించిన సర్కారు జగన్ దీక్ష పై స్పందించటం లేదు సరి కదా.. బొత్స లాంటి మంత్రులు జగన్ దీక్షని ఎద్దేవా చేస్తున్నారని విమర్శించారు కొండా సురేఖ
తెలంగాణా బిల్లు ద్వారానే రాష్టంలో శాంతి
అసెంబ్లీలో వాయిదాల పర్వం ప్రారంభం
వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో స్పీకర్ మరోసారి అసెంబ్లీని పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. సభ వాయిదా పడినా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు.