30, ఏప్రిల్ 2011, శనివారం
తెలంగాణ ఏర్పాటుకుసీమాంధ్రులు రెడీ
తననెవ్వ రూ శాసించలేరు : నాగం
ఉద్యమ లక్ష్యాన్ని చాటడానికే ప్రజాభియాన్ యాత్ర
పేరుకే దేశానికి స్వాతంత్రం వచ్చింది
29, ఏప్రిల్ 2011, శుక్రవారం
జగన్ తో మా పొత్తు ఉండదు..
రాజకీయాలని శాసించాలని చూస్తున్న జగన్
జగన్ ఓటమే... వైఎస్ కుటుంబ దోపిడికి అడ్డు కట్ట..
పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎదురిస్తే ప్రాణాలతో మిగలరని, అక్కడి జనం భయాందోళనల్లోనే బతకాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు.
ఉద్యమ పోరాట స్వరూపాలను చూపే 'పోరుతెలంగాణ '
'నగరం నిద్రపోతున్న వేళ' ఆడియో విడుదల
28, ఏప్రిల్ 2011, గురువారం
కడుపులు కాలడంతోనే జనం తిరుగుబాటు
ఠాగూర్ 150వ జయంతి కి కొత్త ఐదు నాణెం
గవర్నర్ పదవికి ఇక్బాల్ సింగ్ రాజీనామా?
నేడు, రేపు బాబా మహాసమాధి దర్శనం
పెళ్లి కొడుకైపోతున్న 'ఆవారా' కార్తి
ఐతే తమన్నా తో మాత్రం కాదు లెండి.. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటూ నొక్కివక్కనిస్తున్నాడు. హీరో సూర్య సోదరుడిగా వెండితెరకొచ్చిన కార్తి 'యుగానికొక్కడు', 'ఆవారా' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర య్యాడు.
కార్తి పెళ్లి విశేషాలని ఆయన తండ్రి, ప్రముఖ నటుడు అయిన శివకుమార్ మీడియాకి వెల్లడిస్తూ.. జూలై 3 న ఈరోడ్ కు చెందిన రంజనితో కార్తి చెప్పారు. పెళ్లి జరుపడానికి ముహూర్తాన్ని పెట్టినట్లు చెప్పారు.
26, ఏప్రిల్ 2011, మంగళవారం
నా ఆత్మహత్యనే 'నేనూ..నా రాక్షసి' కి మూలం
శరవేగంగా రెడీ అవుతున్న 'బబ్లూ'
పునీత్ హీరోగా 'పృథ్వి ఐ.ఎ.యస్.'
పునీత్‌రాజ్‌కుమార్, సరసన నటించారు. మళయాలం, కన్నడలో పేరొందిన పార్వతిమీనన్ నాయికగా నటించింది. మణికాంత్ కద్రి సంగీతం అందించారు. జాకప్ దర్శకత్వంలో కన్నడంలో రూపొం దిన చిత్రాన్ని తెలుగులో రాజేష్ ఫిల్మ్ 'పృథ్వి ఐ.ఎ.యస్.' పేరుతో అనువ దిస్తోంది.
'తేడా'..'మాడా'..ల తర్వాత 'థర్డ్‌మ్యాన్'
పోసాని 'నిత్య పెళ్ళికొడుకు' కేరాఫ్ జగదంబ సెంటర్ .. సెన్సార్ కట్స్
పోసాని కృష్ణమురళి టైటిల్ పాత్ర పోషించిన నిత్య పెళ్ళికొడుకు చిత్రంలో గౌరీపండిట్, అంజలి, భావన, శివాజీరాజా ముఖ్య పాత్రధారులు. సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకాన జి.వి.సుబ్బయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు అళహరి.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 27-1-2011న 'యుఎ' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. మొదటి రీల్‌లో చిత్రీకరించిన దృశ్యంలో గల 'మీ ఫ్రంట్ ఒరిజినలా ప్యాడింగా, మీ బ్యాక్ ఒరిజనలా ప్యాడింగా' అనే వాక్యం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
2. మొదటి రీలులోనే మరో దృశ్యంలో 'అమ్మాయిలకు అబ్బాయిలు కావాలి... వాళ్ళకు కూడా జిల్ వుంటాది' అనే డైలాగ్ తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.
3. మూడవ రీలులో పెదవితో పెదవి కలిపి శిరీషను ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 4.12 అడుగులు ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
4. నాల్గవ రీలులో 'ముమైత్ ఖాన్' అని ఎక్కడ వచ్చినా అది వినబడకుండా తొలగించమన్నారు.
5. నాల్గవ రీలులోనే చిత్రీకరించిన ఓ సన్నివేశంలో భార్య స్వచ్ఛతను పరీక్ష చేసే మొత్తం దృశ్యాన్ని, హీరో అతని స్నేహితుడు మధ్య జరిగిన సంభాషణని శబ్దంతో సహా తొలగించారు.
6. రెండవ రీలులో నీటి జల్లులో రస్న, శిరీష పెదవి పెదవి కలిపి ముద్దాడే దృశ్యాన్ని తొలగించడం వల్ల 2.14 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.
7. ఏడవ రీలులో డ్రగ్స్ వాడంకి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 30.09 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
8. ఏడవ రీలులో పబ్‌లో హీరో, ఐశ్వర్య పాల్గొనగా చిత్రీకరించిన డ్యాన్స్‌ని తొలగించి ఫ్లాష్‌లా చూపమన్నందున 46.09 అడుగుల ఫిలిం కత్తెర పాలయింది.
9. ఏడవ రీలులోని ఐటమ్‌సాంగ్‌లో ఎక్స్‌పోజింగ్‌లో కూడిన క్లీవేజ్ దృశ్యాలను తొలగించడం వల్ల 60.04 అడుగుల ఫిలిం కత్తిరించబడింది.
10. పదకొండవ రీలులోని 'మగాడు మానసికంగా శారీరకంగా వ్యభిచారం చేస్తాడు' అనే డైలాగ్ శబ్దంతో సహా తొలగించారు.
11. పదమూడవ రీలులోని 'లంగాగాడు, లుచ్చాగాడు పదాలను తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
12. పన్నెండవ రీలులోని 'పక్కలో పడుకున్నావా', 'పిచ్చి నా కొడకా', 'బ్రోకర్ వెధవా', 'బుడ్డే కె బాల్' పదాలను తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.
13. 14వ రీలులో ఆహుతయ్యే దృశ్యాలను సగానికి తగ్గించడం వల్ల 18.07 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
14. పన్నెండవ రీలులో గల 'ఆ చీర చింపింది నేను, నేనే కట్టుకుంటానంటే వద్దంటారేంటి?' డైలాగ్‌ని తొలగించి శబ్దం వినరాకూదన్నారు.
15. రెండవ రీలులో చిత్రీకరించిన 'బాబూ అక్కడ చెయ్యి పెట్టకూడదు రెస్ట్రిక్టెడ్ ఏరియా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.
16. తొమ్మిదవ రీలులో చిత్రీకరించిన దృశ్యంలో 'అక్కుం బక్కుం లేదా' అనే డైలాగ్‌ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
మొత్తం మీద 16 కట్స్‌లో 163.07 అడుగుల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది. 14 రీళ్ళ నిడివిగల 'నిత్య పెళ్ళికొడుకు' 11.3.11న విడుదలయింది.
బాబా మహాసమాధికి రంగం సిద్ధo
చిరంజీవి మాట్లాడితే నైతికతా.. ?
రాజకీయ్యాల్లో నైతికత విలువలకు తిలోదకాలిచ్చిన కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ పార్టీల న్ని daani గురించి మాట్లాడే హక్కు ఏనాడో కోల్పోయయని వ్యాఖ్యానించారు. వైఎస్ తిక్కట్లిచి, గెలిపించుకొన్న ఎమ్మెల్యేలు జగన్ వెంట తిరిగితే అనైతికతా...?, కాంగ్రెస్‌ను దుమ్మెత్తిపోసిన చిరంజీవి మాట్లాడితే నైతికతా.. అని సూటిగా ప్రశ్నించారు.
సిగ్గు, లజ్జ ఉంటె తక్షణం రాజీనామా చేయండి
అస్సోంలో అధికారం మాదే : గడ్కారీ ధీమా
దమ్ముంటే మీరంతా రాజీనామా చేయండి
మంగళ వారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్స్ పార్టీకి దమ్ముంటే తన శాసన స్భులందరి తో రాజీనామా చేయించి మళ్ళి ఎన్నికలకి సిధం కావాలని అన్నారు. రాజీనామా చేసే కాంగ్రెసు పార్టీ నాయకులు సోనియా ఫొటోతో పోటీ చేయాలని, తమ పార్టీ వైయస్సార్ ఫొటో పెట్టుకుని పోటీ చేస్తామని, ఎవరు గెలుస్తారో చూద్దామని అన్నారు. కడప ఎన్నికల ఫలితాలే కాంగ్రెసుకు సమాధానమిస్తాయని ఆయన అన్నారు.
గెస్ట్ రోల్స్ కి పరిమితమై పోతున్న నితిన్
గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'సై' సినిమా లో నితిన్ నటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు వచ్చిన ఆఫర్ మాత్రం గెస్ట్ రోల్ అని తెలుస్తోంది.. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు ఈ చిత్రం 'ఈగ' సినిమా పూర్తయ్యాక ప్రారంభిస్తాడు.
నాగ ప్లేస్ లో అల్లు అర్జున్‌కి చోటిచ్చిన దశరథ్
దాసరి 'రామ సక్కని తల్లి' అనుష్క?
. త్వరలో మరో భారీ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తునే 'రామ సక్కని తల్లి' అనే టైటిల్ ను చేశారు. అయితే, దాసరి వ్యవహారం ఇబ్బందులు గా ఉండటంతో.. విజయ శాంతి.. ఈ సినిమాకి నో చెప్పేసిందట దీంతో నేటి యంగ్ హీరోయిన్ తో ee చిత్రాన్ని దాసరి రూపొందించాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో అనుష్క నటించే అవకాశం వుందని అంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
కడపలో ధనం ఏరులై పారుతోంది.
23, ఏప్రిల్ 2011, శనివారం
బొమ్మరిల్లు బాణిలో నడిచిన మిస్టర్ ఫెరఫెక్ట్.
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
తారాగణం: ప్రభాస్,తాప్సీ,కాజల్ ,ప్రకాష్ రాజ్,కె విశ్వనాధ్,నాసర్,బ్రహ్మానందం,రఘుబాబు తదితరులు.
కూర్పు: మార్తాండ్ కే వెంకటేష్
సినిమాటోగ్రఫీ: విజయ్ కే చక్రవర్తి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం:దశరధ్
తన ఫార్ములాని తానీ ఫాలో అవుతూ ప్రేక్షకులు బాగా నచ్చిందని మెచ్చుకుని హిట్టు చేసారనే నెపంతో మళ్ళి అదే ఫార్మె లాకి కాస్త డోస్ పెంచి దిల్ రాజు నిర్మించిన చిత్రమే మిస్టర్ ఫెరఫెక్ట్.
ఇంతకీ కదేమిటంటే ..
దేనికీ రాజీపడని వ్యక్తిత్వం ఉన్న విక్కి(ప్రభాస్) ఈవ్యక్తి అయినా తనకోసం,తన సంతోషం కోసమే బ్రత కాలి... ఇతరులకూసం తన ఇస్తాలని మార్చుకో కూడదనే మనస్తత్వం. ఆస్ట్రేలియాలోఉండే విక్కీ ఓ సారి చెల్లి పెళ్ళికోసం ఇండియా వస్తాడు. ఇక్కడ విక్కి తండ్రి తన మిత్రుడు కూతురు ప్రియ(కాజల్) తో పెళ్లి చేయాలనీ భావిస్తారు.
ప్రియ తనకి చిన్ననాటి స్నేహితురాలు కూడా కావడంతో విక్కి అంగీకరించినా.మనం ప్రతీ సినిమాలో చూసినట్లే వ్యతిరేకమైన భావాలు గల వ్యక్తిత్వం ఈ హీరొయిన్ద్ర. మొదట విక్కీ వ్యవహారం నచ్చక చిరాకు పడ్డా తర్వాత నెమ్మదిగా ఆయన గారి ప్రేమలో పడ టమే కాక ఆయన గారి కోసం తన ఆలోచనలను,అలవాట్లను, చివరకి తను ఊహించుకొన్న జీవితాన్ని మార్చేసుకోవటానికి కూడా సిద్దపడుతుంది.
తనకోసం నీ ఇష్టాలు మార్చుకోవడం అంటూ ప్రియతో విభేదించిన విక్కీ ...ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు ఉండాలి వేరొకరి కోసం మన ఇష్టాలు మార్చుకుంటే పోతే చివరకు మనకంటూ ఏదీ మిగలదు అని పెద్ద క్లాస్ పీకి ప్రియకు గుడ్ బై చెప్పేసి వచ్చిన దారినే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు.
అక్కడ తనలాంటి ఆలోచనలతోనే ఉన్న మ్యాగి(తాప్సి) తారస పడుతుంది .. ఒకరినొకరు ఇస్తా పడతారు. డేటింగ్ కు సిద్దపడతారు. మరి ఇండియాలోనే మిగిలిపోయిన ప్రియ చివరకు విక్కిని చేరుకొందా .. లేక విక్కిలో నే మార్పు వచ్చి ప్రియదగ్గరకి వచ్చాడా.. మేగి పరిస్తితి ఏంటి వస్తుంది అనేది తెరపై చూడాల్సిందే.
నటీ నటులు..
విక్కి గా ప్రభాస్ కాస్త ఫ్యామిలీ హీరోగా నిలవాలన్న తపనతో నటించాడనిపిస్తుంది. ఉన్నంతలో బెటర్ గా చేయడానికి యత్నించాడు. ప్రియగా కాజల్ పాత్ర దిల్ రాజు బృందావనంకి కొనసాగింపు లా ఓదార్పు పాత్ర. మ్యాగే గా తాప్సి చేసింది తక్కువా... పులకిన్తలేక్కువలా సా..గింది. ప్రకాష్ రాజ్,కె విశ్వనాధ్,నాసర్ లకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. బ్రహ్మానందం,రఘుబాబు ల కామెడి మరీ ఇరికించి నట్లు ఉండి పండలేదు సరి కదా ఇబ్బంది పెడుతుంది
సాంకేతిక వర్గం ...
చానాళ్ల తరువాత దసరద్ కి మరో సరి సత్తా చూపే అవకాశం వచ్చిందనే చెప్పాలి ఐతే స్క్రీన్ ప్లే లో లోపాలు బోలెడు మనల్ని విసిగిస్తాయి. విజయ్ కే చక్రవర్తి కెమెరా, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ చాల మేరకు బోర్ నుంచి ప్రేక్షకుడిని కాపాడాయనే చెప్పాలి. పాటల్లో ప్రతిభ చూపాలని యత్నించిన దేవిశ్రీ ఎమోషనల్ సీన్స్ లో రీరికార్డింగ్ పైన కూడా దృష్టి పెడితే బాగుండేది.
చివరిగా... బొమ్మరిల్లు లా
అసభ్యత,అశ్లీలం లేకుండా ఫ్యామిలీలను టార్గెట్ చేసి దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎ సెంటర్లలో న్చుతుంది కాని బి, సి సెంటర్ ల విషయం అనుమానమే.. ప్రభాస్ రూట్ మార్చి కొత్తగా కనిపించే ప్రయతం చేస్తే .. డాన్ని ప్రేక్షకులు ఎంత వరకు పట్టించు కొన్నారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాలి.
22, ఏప్రిల్ 2011, శుక్రవారం
వర్థమాన సంగీత దర్శకుడు అనిల్ అకస్మిక మరణం
21, ఏప్రిల్ 2011, గురువారం
నిత్యకి ఆ రెండే ఇబ్బంది పెడుతున్నాయి
హైట్ పెంచడం ఎలాగూ తన చేతిలో లేదు కాబట్టి, కనీసం బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలూచిస్తూందట దీంటూ నాజూకుగా తయారయ్యేందుకు . ప్రస్తుతం జిమ్ కి వెళ్లి, చెమటలు పట్టేలా వర్కౌట్స్ చేస్తోంది. ఇవన్ని పూర్తయితే త్వరలోనే నాజూకైన కొత్త నిత్యాని చూస్తా మన్న మాట
కృష్ణ వంశి తో సిద్దమవుతున్న నాని
కొమురం భీం జల్ జంగల్ జమీన్ స్పూర్తితో పోరాటం
సత్యసాయి ఆరోగ్యo తీవ్ర ఆందోళనకరం
అప్పుడు పెద్ద రాక్ష సుడు వైఎస్ పీడి స్తే.. ఇప్పుడు పిల్ల రాక్షసుడు జగన్ పీడుస్తున్నాడు
2004 నాటికీ అప్పుల్లో ఉన్న కుటుంబాన్ని నెట్టుకు రావటమే కాక.. ఎన్నికల ఖర్చుల కోసం భవన్నాన్ని అమ్ముకున్న స్తితి నించి రాజ ప్రసాదాలు లోకి మారిన పరిసతి ప్రజలు గమనించాలని సోచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుగా ఓడిం చడం ద్వారానే ఆ రాక్షదుని అంతం చేయాలనీ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
20, ఏప్రిల్ 2011, బుధవారం
డీఎల్‌కు ఇదే చివరి ఎన్నికలు : శోభ
అవినీతి గుర్తు తెచ్చుకోనేలా వై.ఎస్.ఆర్ పార్టీ జెండా
ఆ అవలక్షణాలు చేసేది జగనే...
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు కడప పార్లమెంటు అభ్యర్థి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వకపోవడంతో ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. చిన్నాన్న వివేకాకు మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవం లేదట. నీవు పదేపదే ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు ఏ రాజనీతి శాస్త్రంలో ఉందో మేము చదువుకొని నేర్చుకొంటామన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని సీఎం పదవి కోసం ప్రాకులాడలేదా అని ఆరోపించారు. ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు వస్తాయన్నది వాస్తవమన్నారు. వై.ఎస్.ఆర్ పార్టీ అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
రామ్- సమంతలతో బెల్లంకొండ మరో చిత్రం
రామ్-హన్సిక జంటగా ‘కందిరీగ’ తెరకె క్కిస్తున్న నిర్మాత బెల్లం కొండ సురేష్ తాజాగా రామ్ తోనే మరో సినిమా కి ప్లాన్ చేసారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్ కి సమంత జంటగా నటించనుంది. జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. స్రవంతి రవికిశోర్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
19, ఏప్రిల్ 2011, మంగళవారం
పవన్ 'గబ్బర్ సింగ్' లేటుగా వస్తాడట..
సాక్షి వార్తలకు రేటు కట్టి జగన్ ఖాతాలోకి..?
సమంతా చుట్టూ తిరుగుతున్నశింబు
సోనియా మతం మీకెందుకు?
రెహ్మాన్ లేకుండానే వర్మ 'రంగేల' సీక్వెల్
ఈమధ్య ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ ని కలిసి ఈ ప్రాజక్టు గురించి డిస్కస్ చేస్తూనే .. మ్యూజిక్ చేయాలని కోరినా.. ప్రస్తుతం బిజీగా ఉన్నా అంటూ రెహ్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట .
ఐతే వర్మ మాత్రం రెహ్మాన్ తో పనిలేకుండా రంగేల స్క్రిప్ట్ తయారుచేసేసుకుని , సెట్స్ ఎక్కాలని భావిస్తున్నాడని తెలుస్తోంది.
18, ఏప్రిల్ 2011, సోమవారం
జగన్ హీరోగా జగన్నాయకుడు
ఉత్తరాది వేడుకలకి యన్టీఆర్ గుడ్ బై
'పెళ్లి పుస్తకం' సినిమాలోని 'శ్రీరస్తు...శుభమస్తు..శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం' పాటలో బాపుగారు చూపించిన పద్ధతిలో యన్టీఆర్ వివాహ వేడుక ఉంటుందన్న మాట! శుభలేఖతో బాటు స్వీట్లు పంచే పద్ధతిki చేక్చేప్పి... గతంలో ఉన్నా సాంప్రదాయాలనే అనుసరిస్తూ... స్వయంగా కుటుంబ సబ్యులతో వెళ్లి పేరు పేరునా ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే శూతిన్గ్లకి సెలవులు ప్రకటించిన యన్టీఆర్. సోమవారం నాడు హైదరాబాదులో సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, రామానాయుడు, చిరంజీవి, రాఘవేంద్రరావు, రాజమౌళి, వినాయక్ ల ఇళ్లకు వెళ్లి, పెళ్లి శుభలేఖల్ని స్వయంగా ఇచ్చి ఆహ్వానించి వచ్చా డు. తెలుగింటి సాంప్రదాయానికి ప్రతీకగా నిలచే తాతకి తగ్గ మనవడిగా నిలవాలన్నది ఆయనగారి తపనకి హర్షించాల్సిందే..
ఒకే రోజు ఆరు సినిమాలు..జనాలు థియేటర్లవైపు రాలేదు...
ఈ చిత్రాల ఫలితాన్ని ముందుగా అంచనావేసినప్పటికీ, ఇంత ఇదిగా ఉంటాయని మాత్రం వాణిజ్య వర్గాలు భావించలేదు. హీరోలమంటూ సినిమాకు లక్షల్లో డిమాండ్ చేసేవారు, తమకున్న ఇమేజ్ ఎలాంటిది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సామర్ద్యం ఉందా? విషయాన్ని గ్రహిస్తే మంచిదని సినీపండితులు సలహా ఇస్తున్నారు. ఇక డబ్బింగ్ చిత్రాలది కూడా సేమ్ సిట్యూవేషన్. ప్రపంచకప్ క్రికెట్ పోటీ పూర్తికావడంతోనే రిలీజ్ చేసినా, జనాలు థియేటర్లవైపు రాలేదు.
గంగపుత్రులు సెన్సార్ కట్స్
అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' ఈ చిత్రాన్ని చూసి 9 కట్స్‌తో 81.12 అడుగుల ఫిలిం కత్తిరించి 24-3-2011న 'యు' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. మూడవ రీలులోని ...
ఎ) రెండో పాటలో బొడ్డు చూపెడుతూ, చిత్రీకరించిన క్లీవేజ్ షాట్స్‌ని 4.07 అడుగుల నిడివికి కత్తిరించారు. అయితే అంగీకారయోగ్యమైన అంతే నిడివిగల మరో షాట్‌ని ఉంచారు.
బి) పయిట లేకుండా ఇసుకపై హీరోయిన్ వెల్లకిలా పరుండే దృశ్యాలను 9.14 అడుగుల మేర కత్తెరించి, అంతే నిడివిగల అంగీకరింపబడిన మరో దృశ్యాన్ని ఉంచడానికి అంగీకరించారు.
సి) హీరోయిన్ సముద్రంలో స్నానం చేసే సన్నివేశాలను 32.02 అడుగుల నిడివికి కత్తెరించి ఆ దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
డి) మూడవ పాటలో చనుకట్టు ఎక్స్‌పోజర్‌కి సంబంధించిన దృశ్యాలను తొలగించడం వలన 21-02 అడుగులు నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
ఇ) సన్నిహితంగా ప్రేమించుకునే దృశ్యాలు, హీరోయిన్ తన దుస్తులు విప్పేసే దృశ్యాలను 4.13 అడుగులమేరకు తొలగించి, అంతే నిడివిగల అంగీకృతమైన వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించారు.
ఎఫ్) తెల్లని బ్రా వేసుకుని నీలిరంగు చీర ధరించి చనుకట్టు పై చేతులుంచుకున్న దృశ్యాలను తొలగించడం ద్వారా 28.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
2. నాలుగవ రీలులో...
ఎ) సన్నివేశంలో చిత్రీకరించిన జలయజ్ఞం, సోంపేట, గంగవరం పదాలను బాడకోవ్ పదాన్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
బి) పయిట లేకుండా హీరోయిన్ పై బీచ్‌లో చిత్రీకరించిన దృశ్యాలను 7.08 అడుగుల నిడివి మేరకు కత్తిరించి అంగీకృతమైన అదే నిడివిగల వేరే దృశ్యాలను ఉంచడానికి అంగీకరించాలి.
సి. బీచ్‌లో హీరోతో మాట్లాడుతున్న హీరోయిన్ ఎక్స్‌పోజ్ చేసేలా చిత్రీకరించిన దృశ్యాలను తొలగించడమో బ్లర్ చేయడమో చేయాలని సూచించగా బ్లర్ చేసారు.
ఈ రకంగా 108.06 అడుగుల ఫిలింని కత్తిరించడం, 26.10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరించి వేరే షాట్స్‌తో కలపడం వల్ల మొత్తం 81.12 అడుగుల పొడవు ఫిలిం కత్తెరింపుకు గురి అయింది. 3354.90 మీటర్ల నిడివిగల 'గంగపుత్రులు' చిత్రం విడుదలయింది.
17, ఏప్రిల్ 2011, ఆదివారం
రెండెకరాల నుంచి రెండు వేల కోట్ల కి ఎలా ఎదిగారో...
నేరగాళ్ళ సరసన త్వరలో జగన్
ఆ ముగ్గురిపై వేటుకు రంగం సిద్దం
16, ఏప్రిల్ 2011, శనివారం
నే ఎవ్వరి మాటా వినను
15, ఏప్రిల్ 2011, శుక్రవారం
బుల్లితెరపైకి దూసుకొస్తున్న వెంకటేష్
సూపర్ స్టార్ సింహాసనం పాట రీమిక్స్
అప్పుడెప్పుడో.. చిరంజీవి కొండవీటి రాజా లోని మంచమేసి దుప్పటేసి పాటకి. ఈ మధ్య చినుకులా రని.. నదులుగా సాగి.. అంటూ చిందేసిన అల్లరి నరేష్ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ పాటకి డ్యాన్స్ చేసి పారేస్తున్నాడు. .. అందులోనూ 'సింహాసనం' సినిమాలోని 'ఆకాశంలో ఒక తార... నా కోసమొచ్చింది ఈవేళ' అనే సూపర్ హిట్ సాంగ్ . అల్లరి నరేష్, పూర్ణ జంటగా గతంలో 'సీమ శాస్త్రి' సినిమాని రూపొందించిన దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న 'సీమ టపాకాయ్' సినిమా లో ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాట ఆడియోకే హైలైట్ అవుతుందని నిర్మాత చెబుతు...ఈ సినిమా ఆడియోను ఈ నెల 18 న హైదరాబాదులో ఘనంగా రిలీజ్ చేస్తామని చెప్పారు.
14, ఏప్రిల్ 2011, గురువారం
‘అంకుశం’ రామిరెడ్డి మరిక లేరు
అమ్మోరు, అనగనగా ఒకరోజు, జగదేక వీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం, పెద్దరికం, గాయం, ఓసేయ్ రాములమ్మ సినిమాల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రామిరెడ్డి మృతి పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
మాస్ సినిమా డైరెక్ట్ చేస్తానంటున్న సిమ్రాన్
అలాగే, మరో సినిమాకి తనే దర్శకత్వం వహిం చేందుకు సన్నాహాలు శేస్తున్న ఈ అమ్మడు ఇన్నాళ్లూ కమర్షియల్ చిత్రాలలో తను పోషించిన మాస్ పాత్రలే ప్రధానంగా మాస్ ప్రేక్షకుల టేస్ట్ తనకు తెలుసనీ, తన సినిమా కూడా కమర్షియల్ పంథాలోనే ఉంటుందనీ సిమ్రాన్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ రెడీ అవుతోందట ఎనీ హౌ సిమ్రాన్ సక్సస్స్ ని కోరుకొండ మనం కూడా ...
రీమేక్ ల 'రాణి' గా మారుతున్నా త్రిష
కృష్ణ వంశీ ట్రేడ్ మార్క్ సినిమా 'మొగుడు'
గతంలో తానుఅందించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్.. నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ, సూపర్ హిట్ అయ్యాయి అలా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తీయడంలో వున్న తన అనుభవాన్ని ఇక్కడ కూడా ఉపయోగించి, హిట్ కొట్టాలనుకుంటున్నాడని టాలీవుడ్ సమాచారం!
ఎయిర్ పోర్టులో ప్రీతి బూతు పురాణం
13, ఏప్రిల్ 2011, బుధవారం
డల్లాస్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైన 'ఎల్బీడబ్ల్యూ'
చిన్న సినిమాగా విడుదలై మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న 'ఎల్బీడబ్ల్యూ'. ఈ చిత్రం ఇప్పుడు డల్లాస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.
భారతదేశం నుండి కేవలం మూడు చిత్రాలు మాత్రమే ఫెస్టివల్‌కు ఎంపికయ్యాయి. 'దోబీఘాట్, రోబో'తో పాటుగా 'ఎల్బీడబ్ల్యూ' చిత్రం ఎంపికైందని నిర్మాతల్లో ఒకరైన కిరణ్ భూనేటి ఆనందం వెలిబుచ్చారు.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం యాభై రోజుల వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. మంచి సినిమా తీస్తే ప్రేక్షకాదరణ ఉంటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం అని హీరోలు సిద్ధు, అభిజిత్, హీరోయిన్లు నిశాంతి, చిన్మయి తెలిపారు.
'రాజ్أ సెన్సార్ కట్స్
వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన 'రాజ్' చిత్రంలో సుమంత్, ప్రియమణి విమలారామన్, అజయ్, అలి, గిరిబాబు ముఖ్య పాత్రధారులు. కుమార్ బ్రదర్స్ పతాకాన కుమార్ బ్రదర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం జగన్.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'రాజ్'ని చూసి 11 కట్స్‌లో 89.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరించి 'యుఎ' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన
ఎ) 'ఎవతైనా వలలో వేసుకుందా' డైలాగ్‌ని సౌండ్‌తో సహా కత్తిరించారు.
బి) స్విమ్మింగ్ ఫూల్ నుంచి నైట్ షర్ట్ తో బయటకు వచ్చే ప్రియమణికి సంబంధించిన క్లోజ్ అప్ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
2. ఒకటి రెండు రీళ్లలోనే బీచ్‌లో ఎర్రటి దుస్తులతో ఉన్న వారి క్లీవేజ్ దృశ్యాలను తొలగించడం ద్వారా 5.04 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెర పాలయింది.
3. ఒకటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'అది జరగలేదా' డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.
4. మూడు నాలుగు రీళ్ళలో
ఎ) 'ఖాళీగా వున్నాం వచ్చి హెల్ప్ చేయమంటావా'
బి) 'ఎంత తొందరగా పెళ్ళాంని ప్రెగ్నెంట్ చేస్తే అంత తొందరగా మనం పార్టీ చేసుకోవచ్చు' అనే డైలాగ్స్ శబ్దంతో సహా తొలగింపుకు గురి అయ్యాయి.
5. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన పాటలో హీరోయిన్ రెడ్ టవల్‌తో డ్యాన్స్ చేసే దృశ్యాలను తొలగించడం వల్ల 79.00 అడుగుల నిడివి గల ఫిలిం కత్తెర పాలయింది.
6. అయిదు ఆరు రీళ్ళలో గల 'డాన్ పెరియన్ చాంపేన్' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.
7. తొమ్మిది పది రీళ్ళలో
ఎ) 'నాది కనిపించ లేదు' అనే డైలాగ్‌లో 'నాది' అనే పదం వినబడకుండా
బి) గోకుతున్నావా అనే పదం వినరాకుండా
సి) 'పోసుకువచ్చా' అనేది వినబడకుండా తొలగించారు.
14 రీళ్ళ నిడివిగల 'రాజ్' చిత్రం 18.3.11న విడుదలయింది.
దొంగల ముఠా 'సెన్సార్' కట్స్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'దొంగలముఠా' చిత్రంలో రవితేజ, ఛార్మి, లక్ష్మి మంచు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, సుబ్బరాజ్, సుప్రీత్ ముఖ్యపాత్రధారులు. శ్రేయ ప్రొడక్షన్స్ పతాకాన రూపొందిన ఈ చిత్రానికి సహ నిర్మాత సుమన్ వర్మ, నిర్మాత కిరణ్ కుమార్ కోనేరు.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'దొంగలముఠా'ని చూసి 16-3-2011న 2 కట్స్‌తో 10 అడుగుల నిడివి ఫిలిం కత్తిరించి 'యు' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. మూడు నాలుగు రీళ్ళలోని 'గెస్ట్ లు ఏదో చేసుకుంటూ వుండొచ్చుకదా' అనే డైలాగ్‌ని శబ్దంతో సహా తొలగించారు.
2. ఏడవ రీలులో చార్మీ రాక్స్‌మీద పాకే దృశ్యాన్ని తొలగించడం ద్వారా 10 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
12 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 18.3.11న విడుదల అయింది.
కుట్రలు తిప్పి కొడదాం రండి
త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతరం
అందువల్ల త్వ రలోనే లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు ఖాయమంటూ ముఖ్యమంత్రి య డ్యూరప్ప జోస్యం చెప్పారు. బుధ వారం ఆయన బెంగళూరు లో మీడియాతో మాట్లాడుతూ పలు అవినీతి కుంభకోణాలలో ఇరుక్కున్న కేంద్రంలోని యూపీయే ప్ర భుత్వం ఏ క్షణంలోనైనా అధికారం కోల్పోయే అవకా శాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటూ.. వాటిని సమర్ధ వతంగాఎదుర్కొనడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం గా ఉందన్నారు
12, ఏప్రిల్ 2011, మంగళవారం
ఇటలీ అహంకారానికి, కడప పౌరుషానికి మధ్య పోరు
వెనక్కి తగ్గినా వంశి?
కొండారెడ్డి హత్యకేసులో పరిటాల రవి బావమరిది అరెస్ట్
ప్రశాంతి నిలయం బోసిపోయింది
మరో వైపు శ్రీరామనవమి వేడుకలతో కోలాహలంగా ఉండే పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం నేడు బోసిపోయి కనిపించింది. ప్రతి ఏటా శ్రీరామ నవమినాడు భక్తులను ఉద్దేశించి బాబా చేసే ప్రసంగం నేడు వినిపించక పోవటంతో ఇక్కడి సత్తెమ్మ దేవాలయంలో గ్రామస్తులతో కలసి తరలి వస్తున్న భక్తులు బాబా ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు నిర్వహిస్తున్నారు
14 నుంచి కెసిఆర్ చండీయాగం
తెలంగాణ ఉద్యమ దశాబ్ధ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఉద్యమ దశాబ్ధ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగుతాయని కార్యక్రమాల వివరాలను వెల్లడించారు ఎమ్మెల్యే జి అరవిందరెడ్డి.
14న అన్ని గ్రామాల్లో అంబేద్కర్ జయంతి, టీఆర్ఎస్ పతాక ఆవిష్కర ణా
15న ఆసుపత్రులు, అనాథ శరణాలయాలు, వసతి గృహాల్లో పం డ్లు, మిఠాయిలు పంపిణీ
16న శ్రమదానం
17న నియోజకవర్గ కేం ద్రంలో రక్తదాన శిబిరం
18న ఉచిత వైద్య శిబిరాలు, కంటి అద్దాల పంపిణీ
19న తెలంగాణ సాధన కోసం 1949 నుంచి అమరులైనవారికి నివాళులర్పించడం, నియోజకవర్గ కేం ద్రాల్లో కాగడాల ప్రదర్శన
20న తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో మహిళలచే మార్చ్
21న శ్రీకృష్ణ కమిటీ వ్యతిరేక సదస్సు
22న తెలుగు, ఉర్దూ భాష ల్లో కవి సమ్మేళనం
24న జిల్లా కేంద్రంలో సంబరాలు, వివిధ రంగాలకు సేవ చేసిన విశిష్ట వ్యక్తులకు సన్మానం
ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్ 13.
విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్ గా ఆ పాత్రల్లో రాణించడానికి ఉచ్ఛారణలోని ప్రత్యేకత, స్పష్టమైన ఉచ్చారణ, పాత్రోచిత నటన ప్రధాన కారణాలయ్యాయి. వీర, రౌద్ర, రసాల పాత్రలలో ఎలా ఒదిగి పోయినారో సాత్విక పాత్రల్లోనూ అదే విధంగా ఒదిగిపోయి ఆ పాత్ర కళ్ళముందు కనిపించేలా నటించేసే ధూళిపాళ 300 చిత్రాలకు పైగా నటించారు.
చివరి దశలో సన్యాసం స్వీకరించి కామేశ్వరానంద స్వామిగా మారి 2007లో తనువు చాలించారు. ధూళిపాళ వర్ధంతి ఏప్రిల్ 13.
8, ఏప్రిల్ 2011, శుక్రవారం
టీటీడీ చైర్మన్‌గా రాయపాటి
సుదీర్ఘకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తిరుమల వెంకన్న ఆశీస్సులు లభించాయి. టీటీడీ చైర్మన్‌గా రాయపాటి నియామకాన్ని 10 జన్‌పథ్‌కు నివేదించటంతో మార్గం సుగమమైనట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.
అంతకుముందు ఆయన బోర్డు సభ్యుడిగా పనిచే సిన రాయపాటి 2004లో మంత్రి పదవి ఆశించి భంగపడి, టీటీడీ చైర్మన్ పదవి ఆశించారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేయాలన్నది తన చిరకాల వాంఛ అని అనేకమార్లు ముఖ్యుల వద్ద ప్రస్తావించిన ఆయన ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. ఉగాది రోజున బోర్డును ప్రకటించాల్సి ఉన్నా వాయిదా పడింది.
హాజారే దీక్ష వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం
అన్నాహజారే ఓ ‘ఫ్రాడ్’
గతంలో జైన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు మరో నలుగురు మంత్రులకు వ్యతిరేకంగా అన్నాహజారే ఆందోళన చేపట్టారు. అప్పటినుంచి అన్నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తునే .. ఇందులోభాగంగానే అన్నాకు దీటుగా జైన్ కూడా నిరాహార దీక్ష చేప ట్టిన విషయం తెలిసిందే. సావంత్ కమిషన్ విచారణలో హజారే అవినీతి బయటపడిందని, అనవసరంగా ఆయనను గాంధీతో పోల్చవద్దంటూ వ్యాఖ్యానించారు
నటి సుజాతకి చిత్ర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు
భక్తులను తికమకపెడుతున్న బులెటిన్‌లు
బి జే పీతోనే సుపరిపాలన : హేమమాలిని
ప్రజలు ఇచ్చే అధికారమే కావాలి
ఇదో 'నిప్పు' సత్యాగ్రహం...
ఆయన పిలుపందుకుని.. హిమాచలం మొదలు కన్యాకుమారి దాకా జన ప్రభంజనం పోటెత్తింది. ప్రభువుల అవినీతి ఇంకానా ఇకపై సాగదంటూ నినదించింది! రాజకీయ జెండాల్లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లేవు. మాటల తూటాలే! ఒకటే లక్ష్యం... అవినీతి రహిత భారతం! ఆగని పయనం.. లంచగొండితనాన్ని తుదముట్టించేంత వరకూ! మరణించేదాకా పోరు.. భారతమ్మను పాప పంకిలం నుంచి బయటపడేసేందుకు! అవినీతిపై పోరాటానికి ఇప్పటిదాకా కోటలు దాటని మాటలే. ఇప్పుడు చేతలు ఉద్యమాలయ్యాయి.
ఇదో 'నిప్పు' సత్యాగ్రహం... అవినీతి నేతలపై.. సొంత జలగలపై! దేశం నలు దిక్కులా అగ్గి రగిలించింది... హస్తినలో సెగలు పుట్టించింది! విపత్తు వచ్చినంతగా ఢిల్లీ పీఠం కలవరపడింది! భీష్మించుకున్న సర్కారు కాస్తంత మెడలు వంచింది! అవినీతిపై పవిత్ర యుద్ధానికి సమర భేరీ మోగించిన హజారే డిమాండ్ల పరిశీలనకు అయిష్టంగానే అయినా తలూపింది. అవినీతిపై పాశుపతాస్త్రంగా ఉండాలని ఆశిస్తున్న లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనకు పౌర సమాజానికి సగ భాగం కట్టబెట్టింది!
7, ఏప్రిల్ 2011, గురువారం
ధర్మాన కుటుంబంలో జగన్ చిచ్చు
రానున్న రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే
కాంగ్రెస్ హామీని మరచిపోయింది
విపరీత, వికార బుద్ధిలా ఉంది
ఖాకీల చేతిలో ప్రశాంత నిలయం బందీ
చేవెళ్ల అంటూ కోట్లు నోక్కేసారు
6, ఏప్రిల్ 2011, బుధవారం
అన్నా హజారేకు మేథా మద్దతు
అన్నాహజారే దీక్షకు దేశ వ్యాప్త మద్దతు
రజని విజయ రహస్యం ఇదీ..
అందుకు కారణం స్క్రిప్ట్‌లపై పూర్తిగా దృష్టి సారించకపోవడమేనని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఏవీఎం.మెయ్యప్పన్ లాంటి నిర్మాతలు పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైతేనే సెట్‌పైకి వెళ్లేవారన్నారు. రజనీకాంత్ నేటికి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారం టే అందుకు ఆయన పడే శ్రమ, పనిపై ఆసక్తే కారణమని ముత్తురామన్ వ్యాఖ్యానించారు.
పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే
చెన్నైలో ‘పీపుల్ ఫర్ జగన్’ కి శ్రీకారం
సాయి కిరణ్ ఇంటర్వ్యూ
సినీరంగంలోకి రాకముందు..
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి చెన్నైలో ఉద్యోగంలో చేరా. పనిలో పనిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. సినిమా రంగంలో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాను. నటుడిగా ప్రయాణం ప్రారంభించా.
మొదటి సినిమా గురించి..
నేను నటించిన మొదటి సినిమా ‘నువ్వే కావాలి’. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మంచి టాక్ వచ్చింది. ఆ చిత్రం సూపర్‌డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ సినిమాలో నేను పాడిన ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట కూడా నాకు మంచి పేరు తె చ్చి పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో పాడా. ‘ప్రేమించు’వంటి మరికొన్ని చిత్రాల్లో నటించా.
పాటలు పాడడం గురించి..
మా నాన్న వీ రామకృష్ణ ప్రముఖ సినీగాయకులుగా మీకందరికీ తెలిసిందే. ఆయన ప్రభావం నాపై ఉంది. పాటలు, పౌరాణిక పద్యాలంటే నాకు చాలా ఇష్టం. అయితే సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని నిర్మాత, దర్శకులను బలవంతం చేయను. వారు పాడమంటే అందుకు సిద్ధం.
ఏ తరహా పాత్రలు ఇష్టమంటే..
వైవిధ్యంతో కూడిన పాత్రలంటే నాకిష్టం. ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల అవి తప్పితే వేరేవి చేయలేరనే ముద్ర పడుతుంది. అందుకే వైవిధ్యంతో కూడిన పాత్రలను, నెగటివ్ షేడ్‌లు ఉండే పాత్రలైనా చేయడానికి సిద్ధం
బుల్లి తెర గురించి..
నేడు సినిమాలకంటే బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. టీవీ సీరియల్స్‌ద్వారా ప్రతి ఇంట్లో మన గురించి తెలుస్తుంది. ఎక్కువ ప్రచారం కూడా వస్తుంది. పైగా ఎక్కువ సీరియల్స్‌తోపాటు వైవిధ్యంతో కూడిన పాత్రలను చేసే వీలుంటుంది. బుల్లితెరకే నా మొదటి ప్రాధాన్యత.
ప్రస్తుతం నటిస్తున్న సీరియల్స్..
సుందరకాండ సీరియల్‌లో నటిస్తున్నా. మే నెలలో మహాభారతం సీరియల్ ప్రారంభమవుతుంది.
ఇక నా వ్యక్తిగతానికి వస్తే.. బాపు, రామానాయుడువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటా. వారితో కలిసి పనిచేయడం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొందుతాయి. సినీరంగంలో నేను అమితంగా అభిమానించే నటుడు రజనీకాంత్. నేను ఆయన అభిమానిని. నటుడిగా గొప్ప అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటా. 55 సంవత్సరాలు దాటాక ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతా.
5, ఏప్రిల్ 2011, మంగళవారం
లిమిటెడ్ కంపెనీగా టీఆర్ఎస్
కేసీఆర్ కాళ్లు మొక్కి ఆ పని చేయిస్తా
సత్య సాయి ఆరోగ్య పరిస్థితిపై సిఎం సమీక్ష
బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగు
సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై ఆయన తాజా బులిటెన్ విడుదల చేశారు.
బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు... హార్ట్ బీట్, బీపీ నార్మల్ గానే ఉన్నట్లు వెల్లడించారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ..ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని ఆయన తెలిపారు.
4, ఏప్రిల్ 2011, సోమవారం
ఉప ఎన్నికల్లో గెలుపు మాదే : నన్నపనేని
"దమ్మరో దమ్" పై హైకోర్టుకెళ్లనున్న గోవా మంత్రి
ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని అసెంబ్లీలో సైతం లేవనెత్తారు గోవా మాజీమంత్రి మిక్కీ . ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించనీయకుండా అడ్డుకోవాలని ప్రజలకి సూచిన్చారాయన. భారతదేశంలోనే ప్రముఖమైన టూరిస్ట్ స్పాట్‌గా ఉన్న గోవాను చిత్రంలో దారుణంగా చూపారనీ, ఈ చిత్రం వల్ల పర్యాటకం కేంద్రంగా భాసిల్లుతున్న గోవాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సోనియా ఇక ఇటలీకి వెళ్లక తప్పదు
కాంగ్రెస్ పార్టీ ఇక రోజు లు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని, సోనియాగాంధీ ఇక ఇటలీకి వెళ్లక తప్పని పరిస్థితి వస్తుం దని అన్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడం తథ్యమన్నారు.
పూనం నగ్నప్రదర్సన ప్లేస్ మారింది
మా ఆయన తగ్గితే.. పులివెందుల బరిలో నేనున్నా
ఆత్మగౌరవం కోసం రాజీనామాలివ్వల్సిందే
ఇప్పటికైనా తెలంగాణలోని ఎంపీ,ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
పోచారంకి పూలు.. చంద్రబాబు కి చెప్పులు
శివాజి హీరోగా పెళ్ళాం ఊరెళితే... సీక్వెల్
14 న పవన్ కళ్యాణ్ 'తీన్ మార్'
ఈ సందర్బంగా నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ...పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో ఆయన అద్భుతం. పవన్‌కళ్యాణ్ నుంచి ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే వంద శాతం స్క్రీన్‌మీద ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుం దన్నారు.
ఎన్టిఆర్ వివాహానికి ఆనందసాయి భారీ సెట్
చర్చనీయాంశంగా మారింది. ఈ నేపద్యంలో ఎన్టిఆర్ వివాహానికి పెళ్లి సెట్ వేసీ అవకాశం రావటం తో ఉబ్బి, తబ్బిబ్బవుతున్నాడు.
గొంతు తడిపేందుకు.. బీరు, విస్కీలు పుష్కలం
మంచినీళ్లు దొరకకున్నప్పటికీ బీర్లు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోనప్పటికీ అబ్కారీ అధికారుల పుణ్య మా..! అని పల్లె పల్లెల్లో వెలసిన బెల్ట్‌షాపుల మూలంగా చల్లని బీర్లు లభిస్తున్నాయి.
పల్లె ప్రజానీకానికి తాగునీరందించేందుకు పెద్దగా శ్రద్ధాసక్తులు కనబరచని ప్రభుత్వం ప్రతి ఏటా మద్యం విక్రయాలపైనే దృష్టిని కేంద్రీకరించింది. ఫలితంగా ఇటు మద్యం దుకాణాలతోపాటు అటు దాబాలు, బెల్ట్‌షాపుల్లో చల్లనీ బీరు, విస్కీలు పుష్కలం గా లభిస్తున్నాయి.
తాగేందుకు బిందెడు నీళ్లు తెచ్చేందుకు నిరాకరించే మందుబాబులు చల్లని బీర్లు తెచ్చుకుని తాగడంపైనే మక్కువ కనబరుస్తున్నారు.
స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా?
భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత స్వాతంత్రాన్ని ఇప్పుడే సాధించుకోన్నామా అన్నంత ఆనందం ప్రతి ఒక్కరిలో కలిగిందని అమితాబ్ ట్విట్టర్‌లో రాసుకున్నారు. సాధారణంగా భారత్ మ్యాచ్ జరిగేటప్పుడు తాను అసలు చూడనని, అయినా 33 పరుగులకు 2 వికెట్లు పడిపోయినా.. చివరి మ్యాచ్ విన్నింగ్ షాట్ లో కెప్టెన్ ధోని సిక్స్ కొట్టేవరకూ టెలివిజన్‌కు అత్తుకుపోయి కూర్చున్నానని ఆయన తెలిపారు. భారత్ గెలిచినా ఆనందంలో.. నేనే అది గెలిచానన్న ఫీలింగ్ కలిగి చిన్నపిల్లలా మాదిరిగా అభిషేక్, ఐశ్వర్యల తో కలిసి కారు టాప్‌పై కూర్చుని త్రివర్ణ ప్రతాకాన్ని ఊపడం చెప్పనలవి కాని గొప్ప అనుభూతి అని అన్నారు. అల్లాగే సినీ ఇండస్ట్రీ లో సాద్యం కాని రజని, గజనీ, ధోనీల అపూర్వ కలయిక క్రికెట్ తో సాధ్యమైంది అని తెగ ఆనంద పడిపోయారు అమితాబ్...