మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌ను ఇకపై భోజ్‌పాల్ పేరుగా వ్యవహరిస్తారు. రాజా భోజ్ 11వ శతాబ్దంలో మాల్పా ప్రాంతాన్ని పాలించాడు. మహ్మద్ గజనీపై 1024లో రాజాభోజ్ విజయం సాధించాడు. భోపాల్‌లో రాజాభోజ్ పట్టాభిషేకం మిల్లేనియం లేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ రాజ్‌సింగ్ చౌహాన్ భోపాల్‌కు భోజ్ పాల్ పేరును ప్రతిపాదించారు. భోపాల్‌లోని బడా తలావో సరస్సును ఇకపై 'భోజ్ తాల్' గా వ్యవహరిస్తారు. అలాగే విఐపిరోడ్‌ను 'రాజాభోజ్' మార్గ్‌గా పిలుస్తారు. బొంబాయి ని ముంబైగా, మద్రాసును చెన్నైగా, కలకత్తాను కోల్‌కత్తా, బేంగళూర్‌ను బెంగుళూరుగా వ్యవహరిస్తున్నందున భోపాల్‌ను భోజ్‌పాల్‌గా ఎందుకు పరిగణించకూడదంటారు.
31, మార్చి 2011, గురువారం
నేతల ఆస్తులపై ఇడి ఆరా?
ఎవరెన్ని అవరోధాలు కల్పించినామనదే అధికారం : జగన్
వివేకా , జగన్ మధ్య ఉప ఎన్నికల పోరు
చిత్తూరు ని విడిచి వెళ్ళడం అంత దౌర్భాగ్యం మరొకటి ఉండదు
ఉద్యమ ద్రోహులెవరో బైట పెడతా...
బాబా ఆరోగ్యం మరింత మెరుగు
దేశం లో రొటేషన్
ఇదే నిజమైతే ఈసారి వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి అవకాశం దక్కొచ్చంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో 610 జీవో సభాసంఘానికి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు.
ఉగాది నుంచి శివన్న కి ఆర్జిత సేవల కట్
ఓట్ల కోసం ఓదార్పు వాయిదా
27, మార్చి 2011, ఆదివారం
పార్టీ ప్రతిష్ట దిగజారిస్తే ఊరుకోను
2004లో ఉన్న ఐక్యత 2009 నాటికి పార్టీలో లేదని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో వై ఎస్ ఉన్నప్పుడే కన్పించిందని అన్నారు. ప్రస్తుతం అంతా ఐక్యంగా పనిచేయాల్సిన తరుణంలో పార్టీ నేతలు ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు ప్రకటనలివ్వడం భావ్యం కాదని .. దీని వల్ల ప్రజల్లో చులకన భావం కలుగుతుందని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. .
క్రమశిక్షణారాహిత్యానికి మారుపేరు జెసి
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2009 ఎన్నికలలో అంతపురం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జెసి తీవ్రం గా ప్రయత్నించారని.. ఈ విషయం అప్పట్లో వై ఎస్ దృష్టికి తీసుకు వెల్లినందునే మంత్రి వర్గంలోకి తీసుకోలేదన్నారు. మంత్రి రఘువీరా రెడ్డిపై పోటీ చేయడానికి తాను సిద్ధమని నిన్న జెసి విసిరిన సవాల్ కు వెంకటరామిరెడ్డి ప్రతిసవాల్ విసురుతూ మాజీ మంత్రి జెసి పై పోటీకి తాము సిద్దంగా ఉన్నామని .. ఆయన ఎ పార్టీ నుంచి పోటీకి దిగినా తాము గెలిచి తీరుతామన్న ధీమా వ్యక్తం చేరారు వెంకటరామిరెడ్డి.
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లోకి తెలంగాణా నాయకుడు?
వేసవిలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
అమితాబ్, రేఖలే మర్గదర్శకులట
అందరూ మాజీ మిస్ ఇండియాల మాదిరిగానే ఈ మిస్సమ్మ కూడా చివరికి చిత్రసీమకు వచ్చేసింది. మిగతావారిలా హింగ్లిష్ (హిందీ, ఇంగ్లిష్ కలగలిసిన భాష) మాట్లాడకుండా స్వచ్ఛమైన హిందీ మాట్లాడాలన్నది ఈ అమ్మడు కోరిక. హిందీ నేర్చుకోవడానికి అమితాబ్, రేఖలే తనకు మార్గదర్శకురాలని మాజీ మిస్ ఇండియా వరల్డ్ సారా డయాస్ జేన్ చెబుతోంది. అభిషేక్ హీరోగా రూపొందుతున్న గేమ్ సినిమాతో ఈమె వెండితెరకు పరిచయమవుతోంది. ప్రతి డైలాగును స్పష్టంగా చెప్పడానికి చాలా కష్టపడుతోంది కూడా. ‘అమితాబ్, రేఖ సహజంగానే చక్కటి హిందీ మాట్లాడుతారు.
ఎంతో కష్టపడ్డారు కాబట్టే వాళ్లు నైపుణ్యం సాధించగలిగారు. చిన్నప్పటి నుంచి వీరిద్దరి సినిమా చూస్తూ డైలాగులను గమనిస్తున్నాను’ అని ఈ ముంబై భామ చెప్పింది.
మాస్, బూతు ఒకటి కాదు : భాస్కరభట్ల
మాస్ చిత్రాలకు ఆదరణ బాగా ఉందని, అయితే మాస్, బూతు సంభాషణలు ఒకటి కావని వివరించారు. సాహిత్యం సరిగా వినిపించకుండా సంగీతం మాత్రమే వినిపించే పాటలు ఎక్కువ కాలం మనగలగడం కష్టమని, రెండూ సమపాళ్లలో ఉన్న పాటలే కొంతకాలం గుర్తుంటున్నాయని అన్నారు.
పోకిరి చిత్రంలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అనే పాట తనకు బాగా గుర్తింపు తెచ్చిందని, ఇందులో అశ్లీలత లేదని, ఆడవాళ్లు కూడా హాయిగా పాడుకుంటున్నారని అన్నారు. కొత్తగా ‘తీన్‌మార్’లో టైటిల్ సాంగ్‌ను, పబ్ సాంగ్‌ను రాశానని, ఆడియో హిట్ అయిందని చెప్పారు.
సీఎం,హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా..? వద్దా..?
లోకాయుక్త న్యాయ నిపుణుడు చంద్రశేఖర్ సెలవుపై మైసూరు వెళ్లినందున ఆయన వచ్చిన తరువాత చర్చించి సీఎం,హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా..? వద్దా..? అనేది సోమవారం నిర్ణయిస్తామని లోకాయుక్త ఏడీజీపీ రూప్‌కుమార్ దత్తా తెలిపారు.
ఫైనల్ మ్యాచ్ రోజు ప్రత్యేక సెలవు
కాలయాపన కోసమే..కమిటీలు
డిసెంబర్ తొమ్మిది ప్రకటనను వెనక్కితీసుకున్న కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సహకరించారని, దీన్నిబట్టి తెలంగాణ రాష్టస్రాధనకు కాంగ్రెస్ పార్టే ప్రధాన శత్రువని దుయ్యబట్టారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎటువంటి కమిటీలు పనిచేయలేదని చరిత్ర చెబుతోందన్నారు. ఇవి కేవలం కాలయాపన కోసమేనని చెప్పారు.
వికృత రాజకీయాలకు వేదికగా తమిళనాడు
ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు, సామాజిక ఉద్యమాలకు, ఆత్మగౌరవానికి మారుపేరు తమిళనాడు .. కొ న్నేళ్లుగా
తమిళనాడు వికృత రాజకీయాలకు వేదికగా మారిందని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాట అధికారం కోసం తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అభ్యర్థులను రంగంలోకి దించామని అన్నారు. ఎన్నికల కమిషన్ పిరికితనానికి పరాకాష్టగా తమిళనాడులో ఉచిత పథకాలు ఉన్నాయని విమర్శించారు. ఉచితాల పై ఎన్నికల కమిషన్ మేలుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేస్తే నెలకు ఐదు సీసాల మద్యం ఇస్తాం, స్కూటరిస్తాం.. అన్న వాగ్ధానాలు పుట్టుకొచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశా రు.
మొహాలీకి మన్మోహన్, గిలానీ
చిరంజీవిని ఆహ్వానించి ఏం సాధించిందో ...
గెలిచే అవకాశాలు జగన్‌కే : బొత్స
అసలేమీ లేని జగన్‌కు మూడు సీట్లు రావడం గురించి మాట్లాడరా? దీనంతటికీ కారణం మా పార్టీవాళ్లే. జగన్‌ను వాళ్లెవరూ ప్రత్యర్థిగా భావించకపోవడంవల్లే ఇలాంటి ఫలితాలొస్తున్నాయి. ఓవైపు జగన్ పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిద్ధమవుతుంటే, మా వాళ్లేమో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని మాట్లాడుతున్నారు. జగన్‌ను ప్రత్యర్థిగా చూడలేక పోవడమనే బలహీనత. విజయనగరం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు జనం బాగానే వస్తారని..జగన్ పార్టీలోకి మా జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరు’’ అన్నారు.
25, మార్చి 2011, శుక్రవారం
సచిన్ కోసం వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపం
క్రికెట్ ప్రియుల ఆరాధ్యదైవమైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం బెంగుళూరులోని శ్రీసాయిగోల్డ్ ప్యాలెస్ నిర్వాహకులు టి.ఎ.శరవణ సుమారు 4.5 కిలోల బంగారు తాపడం చేసిన వరల్డ్‌కప్ ట్రోఫీ ప్రతి రూపాన్ని సిద్దం చేశారు. 4.5 కిలోల బరువున్న ఈ వెండి ట్రోఫీకి బంగారు తాపడం చేయడానికి 60 గ్రాముల బంగారాన్ని వినియోగించినట్లు తెలిపారు. దీంతోపాటు ఒక బాల్, బ్యాట్ కూడా తయారు చేసినట్లు..ఈ ట్రోఫీ, బాల్, బ్యాట్ తయారీకి రూ.5 లక్షలు వెచ్చించినట్లు టి.ఎ.శరవణ తెలిపారు.
ఉద్యమం పేరిట కేసీఆర్ చేస్తున్నదేమిటి?
పాన్ కార్డు పొందటం ...వివరాల అప్‌డేట్ చేయటం సులభమే
పాన్ కార్డు లేకుంటే ఇంతవరకు కొన్ని వ్యవహారాలు అందుబాటులోకి రాకుండా వున్నాయి. ఇక ముందు పాన్ కార్డు లేని వారిపై అధిక పన్నుల మోత కూడా వుంటుంది. పాన్ కార్డు లేని వారితో పాటు, తప్పుడు పాన్ నంబరు ఇచ్చే వారి వద్ద నుంచి పన్ను మినహాయింపు (టీడీఎస్)ను అధికంగా రాబట్టదలచినట్లు కేంద్రం కొత్త బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిబంధన వర్తించే విధంగా ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇప్పటికే పలు రకాల వ్యవహారాలకు పాన్‌ను తప్పనిసరి చేశారు. ఆదాయపు పన్ను పరిథిలోకి రాని వారు వీటిని పొందక తప్పటం లేదు. పెట్టుబడి మార్కెట్‌లోని అన్ని రకాల లావాదేవీలకు పాన్ తప్పనిసరిగా వుండాలని ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్ లేకపోతే ఇక ఆయా వ్యక్తులపై భారాన్ని పెంచే చర్యలు చేపడతామని కేంద్రం కొత్త బడ్జెట్‌లో స్పష్టం చేసింది.
జీవితకాలం పాటు అమలులో వుండే పాన్ కార్డు ద్వారా వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు దీన్ని విస్తరించుకొంటూ వెళుతోంది. రాష్ట్రంలో పాన్ కార్డు దరఖాస్తులను స్వీకరించేందుకు యుటీఐ, ఇతర సంస్థలతో ఆదాయపు పన్ను శాఖ పొత్తు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి వరకు 45 లక్షల మందికి పాన్ కార్డులున్నట్లు తెలుస్తోంది.
ఒకరు ఒక పాన్ కార్డును మాత్రమే కలిగి వుండాలి. రెండో కార్డు వుంటే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 55,000 మంది వద్ద రెండు పాన్‌కార్డులు వున్నట్లు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ గుర్తించి చాలా వాటిని రద్దు చేసింది. ఒకసారి కేటాయించిన పాన్‌లో ఇక మార్పులు చేయరు. కేవలం చిరునామాలో మార్పులను మాత్రమే నమోదు చేస్తారు. పాన్‌ను ఇవ్వటానికి గతంలో బాగా ఆలస్యం జరిగేది. ఇప్పుడు 15రోజుల వ్యవధిలోనే వస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కూడా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందజేశాక దాని పరిస్థితి ఏమిటనేది ఐటీ శాఖ వెబ్‌సైట్ సాయంతో తెలుసుకోవచ్చు.
తప్పనిసరి వేటికి?
ఏదైనా సంస్థ జీతాలు చెల్లించేటప్పుడు టీడీఎస్‌ను వసూలు చేసే వ్యక్తులకు సంబంధించిన పాన్ కార్డు నెంబరు తప్పనిసరి. ఐటీ రిటర్న్ దాఖలుకు, ఆ శాఖ అధికారితో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు, అక్కడ చెల్లించే చలానాలకు పాన్ అవసరం వుంది.
వ్యాపారి వార్షిక టర్నోవర్ రూ. 5 లక్షలు దాటినప్పుడు, ఐటీ చట్టాలకింద పన్నులు, సుంకాలు చెల్లించే వారికి పాన్ అవసరం. కొనుగోలుదారుడైన వ్యాపారి నుంచి పన్నును వసూలు చేసేటప్పుడు అతని పాన్‌ను అమ్మకందారు పేర్కొనాలి. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, పన్ను కట్టలేకపోయినా పాన్ వుండితీరాలి.
స్థిరాస్తి విలువ రూ.5లక్షలు దాటినప్పుడు వాటి కొనుగోలు, అమ్మకాలు, మోటారు వాహనాలు కొనుగోలు, హోటళ్లలో నగదు రూపేణా రూ. 25,000కు మించి చెల్లింపు, సెల్‌ఫోన్ సహా టెలీఫొన్ కనెక్షన్ పొందటానికి పాన్ అవసరం. బ్యాంకు, పోస్టాఫీసులో రూ.50,000కు మించిన డిపాజిట్లకు, ఫండ్లు సంబంధిత వ్యవహారాలకు, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడానికి పాన్ కార్డు తప్పనిసరి.
పాన్ కార్డు వివరాల అప్‌డేట్ సులభమే
ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందించే పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (పాన్-శాశ్వత ఖాతా సంఖ్య) ఎంతో ముఖ్యమైన ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చిరునామా మారిన పక్షంలో పాన్‌కార్డు వివరాల్లోని సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. ఒకసారి పాన్‌కార్డు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ తదుపరి వివరాలు అప్‌డేట్ చేయడంలో మనవారు ఎంతో వెనుకబడి వున్నారు. చాలా సులభమైన పద్ధతుల్లో ఇల్లు కదలకుండానే తాజా సమాచారాన్ని చేర్చే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డిఎల్) ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ (టిన్) అప్‌డేట్ సేవలందిస్తుంది. తాజా ఫొటోను చేర్చడం, చిరునామా, సంతకం మార్పు తదితర వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు మార్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు
ఎన్‌ఎస్‌డిఎల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పొంది పేరు, చిరునామా, తాజా ఫొటోగ్రాఫ్‌లను జత చేర్చి ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేయడం ద్వారా 15 అంకెల యునీక్ నెంబర్ జనరేట్ అవుతుంది.
డిస్పాచ్ ద్వారా అయితే ఏఏ సమాచార మార్పు కోరుకుంటున్నారో ఆయా వివరాలను డాక్యుమెంట్లు సహా ఎన్‌ఎస్‌డిఎల్, థర్డ్ ఫ్లోర్, సఫైర్ చాంబర్స్, నియర్ బానెర్, పూనె - 411045, చిరునామాకు అకనాలెడ్జ్ సహా పంపాలి.
చెల్లింపుల పద్ధతి: మార్పులు కోరుకునే భారతీయులు 94 రూపాయలను, ఎన్‌ఆర్‌ఐలు 744 రూపాయలను ఆన్‌లైన్ ద్వారా లేదా ముంబాయిలో చెల్లుబాటయ్యే విధంగా డిడి, చెక్‌లనైనా పంపవచ్చు.
డెలివరీ అండ్ ట్రాకింగ్: కొత్త పాన్ కార్డు డెలివరీ పోస్టు ద్వారా అవుతుంది. ఈ బట్వాడా ఏ దశలో ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సింది: ఆన్‌లైన్‌లో ముందుగా పాన్ కార్డుపై ఉన్న సమాచారాన్ని ఫీడ్ చేయాలి. ఆపై మార్పులు కోరుతున్న వివరాలు అందించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ఆ సమాచారాన్ని సపోర్ట్ చేసే డాక్యుమెంట్లు ఎన్‌ఎస్‌డిఎల్ కార్యాలయానికి అందాలి.
పాన్ కార్డు పోయిన పక్షంలో కూడా ఇదే దరఖాస్తును వినియోగించి కొత్త కార్డు పొందవచ్చు.
పాన్ కార్డు పొందటం ...వివరాల అప్‌డేట్ చేయటం సులభమే
పాన్ కార్డు లేకుంటే ఇంతవరకు కొన్ని వ్యవహారాలు అందుబాటులోకి రాకుండా వున్నాయి. ఇక ముందు పాన్ కార్డు లేని వారిపై అధిక పన్నుల మోత కూడా వుంటుంది. పాన్ కార్డు లేని వారితో పాటు, తప్పుడు పాన్ నంబరు ఇచ్చే వారి వద్ద నుంచి పన్ను మినహాయింపు (టీడీఎస్)ను అధికంగా రాబట్టదలచినట్లు కేంద్రం కొత్త బడ్జెట్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిబంధన వర్తించే విధంగా ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇప్పటికే పలు రకాల వ్యవహారాలకు పాన్‌ను తప్పనిసరి చేశారు. ఆదాయపు పన్ను పరిథిలోకి రాని వారు వీటిని పొందక తప్పటం లేదు. పెట్టుబడి మార్కెట్‌లోని అన్ని రకాల లావాదేవీలకు పాన్ తప్పనిసరిగా వుండాలని ఇంతకు ముందే స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్ లేకపోతే ఇక ఆయా వ్యక్తులపై భారాన్ని పెంచే చర్యలు చేపడతామని కేంద్రం కొత్త బడ్జెట్‌లో స్పష్టం చేసింది.
జీవితకాలం పాటు అమలులో వుండే పాన్ కార్డు ద్వారా వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పన్ను ఎగవేతదారులను గుర్తించాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది. అందుకే ఎన్నో రకాల ఆర్థిక లావాదేవీలకు దీన్ని విస్తరించుకొంటూ వెళుతోంది. రాష్ట్రంలో పాన్ కార్డు దరఖాస్తులను స్వీకరించేందుకు యుటీఐ, ఇతర సంస్థలతో ఆదాయపు పన్ను శాఖ పొత్తు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి వరకు 45 లక్షల మందికి పాన్ కార్డులున్నట్లు తెలుస్తోంది.
ఒకరు ఒక పాన్ కార్డును మాత్రమే కలిగి వుండాలి. రెండో కార్డు వుంటే రూ. 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. అయితే రాష్ట్రంలో దాదాపు 55,000 మంది వద్ద రెండు పాన్‌కార్డులు వున్నట్లు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ గుర్తించి చాలా వాటిని రద్దు చేసింది. ఒకసారి కేటాయించిన పాన్‌లో ఇక మార్పులు చేయరు. కేవలం చిరునామాలో మార్పులను మాత్రమే నమోదు చేస్తారు. పాన్‌ను ఇవ్వటానికి గతంలో బాగా ఆలస్యం జరిగేది. ఇప్పుడు 15రోజుల వ్యవధిలోనే వస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కూడా పాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందజేశాక దాని పరిస్థితి ఏమిటనేది ఐటీ శాఖ వెబ్‌సైట్ సాయంతో తెలుసుకోవచ్చు.
తప్పనిసరి వేటికి?
ఏదైనా సంస్థ జీతాలు చెల్లించేటప్పుడు టీడీఎస్‌ను వసూలు చేసే వ్యక్తులకు సంబంధించిన పాన్ కార్డు నెంబరు తప్పనిసరి. ఐటీ రిటర్న్ దాఖలుకు, ఆ శాఖ అధికారితో జరిపే అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు, అక్కడ చెల్లించే చలానాలకు పాన్ అవసరం వుంది.
వ్యాపారి వార్షిక టర్నోవర్ రూ. 5 లక్షలు దాటినప్పుడు, ఐటీ చట్టాలకింద పన్నులు, సుంకాలు చెల్లించే వారికి పాన్ అవసరం. కొనుగోలుదారుడైన వ్యాపారి నుంచి పన్నును వసూలు చేసేటప్పుడు అతని పాన్‌ను అమ్మకందారు పేర్కొనాలి. ఎగుమతిదారులు, దిగుమతిదారులు, పన్ను కట్టలేకపోయినా పాన్ వుండితీరాలి.
స్థిరాస్తి విలువ రూ.5లక్షలు దాటినప్పుడు వాటి కొనుగోలు, అమ్మకాలు, మోటారు వాహనాలు కొనుగోలు, హోటళ్లలో నగదు రూపేణా రూ. 25,000కు మించి చెల్లింపు, సెల్‌ఫోన్ సహా టెలీఫొన్ కనెక్షన్ పొందటానికి పాన్ అవసరం. బ్యాంకు, పోస్టాఫీసులో రూ.50,000కు మించిన డిపాజిట్లకు, ఫండ్లు సంబంధిత వ్యవహారాలకు, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడానికి పాన్ కార్డు తప్పనిసరి.
పాన్ కార్డు వివరాల అప్‌డేట్ సులభమే
ఆదాయపు పన్ను శాఖ అధికారులు అందించే పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (పాన్-శాశ్వత ఖాతా సంఖ్య) ఎంతో ముఖ్యమైన ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా చిరునామా మారిన పక్షంలో పాన్‌కార్డు వివరాల్లోని సమాచారం ఎంతో ఉపకరిస్తుంది. ఒకసారి పాన్‌కార్డు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ తదుపరి వివరాలు అప్‌డేట్ చేయడంలో మనవారు ఎంతో వెనుకబడి వున్నారు. చాలా సులభమైన పద్ధతుల్లో ఇల్లు కదలకుండానే తాజా సమాచారాన్ని చేర్చే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది.
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డిఎల్) ఆధ్వర్యంలో సేవలందిస్తున్న టాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ (టిన్) అప్‌డేట్ సేవలందిస్తుంది. తాజా ఫొటోను చేర్చడం, చిరునామా, సంతకం మార్పు తదితర వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు మార్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు
ఎన్‌ఎస్‌డిఎల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పొంది పేరు, చిరునామా, తాజా ఫొటోగ్రాఫ్‌లను జత చేర్చి ఆన్‌లైన్‌లోనే సబ్‌మిట్ చేయడం ద్వారా 15 అంకెల యునీక్ నెంబర్ జనరేట్ అవుతుంది.
డిస్పాచ్ ద్వారా అయితే ఏఏ సమాచార మార్పు కోరుకుంటున్నారో ఆయా వివరాలను డాక్యుమెంట్లు సహా ఎన్‌ఎస్‌డిఎల్, థర్డ్ ఫ్లోర్, సఫైర్ చాంబర్స్, నియర్ బానెర్, పూనె - 411045, చిరునామాకు అకనాలెడ్జ్ సహా పంపాలి.
చెల్లింపుల పద్ధతి: మార్పులు కోరుకునే భారతీయులు 94 రూపాయలను, ఎన్‌ఆర్‌ఐలు 744 రూపాయలను ఆన్‌లైన్ ద్వారా లేదా ముంబాయిలో చెల్లుబాటయ్యే విధంగా డిడి, చెక్‌లనైనా పంపవచ్చు.
డెలివరీ అండ్ ట్రాకింగ్: కొత్త పాన్ కార్డు డెలివరీ పోస్టు ద్వారా అవుతుంది. ఈ బట్వాడా ఏ దశలో ఉందన్న విషయాన్ని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సింది: ఆన్‌లైన్‌లో ముందుగా పాన్ కార్డుపై ఉన్న సమాచారాన్ని ఫీడ్ చేయాలి. ఆపై మార్పులు కోరుతున్న వివరాలు అందించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ఆ సమాచారాన్ని సపోర్ట్ చేసే డాక్యుమెంట్లు ఎన్‌ఎస్‌డిఎల్ కార్యాలయానికి అందాలి.
పాన్ కార్డు పోయిన పక్షంలో కూడా ఇదే దరఖాస్తును వినియోగించి కొత్త కార్డు పొందవచ్చు.
టేలర్ అందగత్తా...నాన్‌సెన్స్!
స్వదేశానికి తిరిగి వచ్చాక సోషలిజం వైపు మొగ్గుచూపి 1934లో సోషలిస్టు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశాడు. 1936లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి ఎన్నికయ్యాక విదేశీ వ్యవహారాల కమిటీని ప్రారంభించాడు. నెహ్రూ ఈ కమిటీకి తొలి కార్యదర్శిగా నియమించాడు. అనేక సవాళ్ళకు తట్టుకుని బలంగా నిలిచిన మన విదేశాంగ విధానానికి శ్రీకారం చుట్టింది లోహియానే! సత్యాగ్రహించండి అంటూ గాంధీగారు నడిపే హరిజన్ పత్రికలో వారం రోజుల ధారావాహిక వ్యాసపరంపర రాశాడు.
దీన్ని తపðగా నిర్ణయించి తెల్ల మెజిస్ట్రేట్ రెండేళ్ళ జైలు శిక్ష విధించినా లోహియా గురించి వ్యాఖ్యానిస్తూ 'లోహియా టాప్‌క్లాస్ మేధావి. సంస్కారవంతుడు. స్వేచ్చా మయ భావాలున్నవాడు. గొప్ప నైతిక విలువలున్నవాడు' అని కీర్తించాడు. గాంధీగారు కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మాట్లాడుతూ లోహియా జైలులో ఉన్నంత కాలం నా మానాన నేను ఉండలేను.
ఆయన కన్నా సాహసవంతుడు, ఆయన కన్నా నిరాడంబరుడు మరొకడు ఇంత వరకు నా కంట పడలేదు. ఆయన ఎన్నడూ హింసావాదాన్ని రెచ్చగొట్టలేదు. ఆయన చేసిన పనులన్నీ ఆయన గౌరవ మర్యాదలను పెంచాయి' అన్నారు. లోహియాను జైలర్లు మానసికంగా, శారీరకంగా ఎంతగానో హింసించేవారు. వలస పాలకుల దాష్టీకం పోవాలంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పోయి దేశాలు విముక్తం కావాలి. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలలో స్వేచ్ఛ అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో రాష్ట్రాలు సర్వ సౌభాగ్యాలతో తులతూగాలి. పోలీసుల అవసరం రాకుండా జనజీవితం హాయిగా సాగిపోవాలి అని లోహియా మనసా కోరుకున్నాడు.
-డాక్టర్ వంగల రామకృష్ణ
బ్యాంకాక్‌లో 'నాకూ ఓ లవరుంది'
కృష్ణుడు తాజా చిత్రం 'నాకూ ఓ లవరుంది'. శ్రీ శివపార్వతి కంబైన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజన షూటింగ్ ప్రారంభించారు. అప్పటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగు తోంది. కృష్ణుడు, రితిక, అలీ, ఎమ్మెస్.నారాయణ తదితరులపై కొన్ని ముఖ్య సన్నివేశాలు. రెండు పాటలు చిత్రీకరించడం జరిగిందని నిర్మాత కె.సురేష్‌బాబు తెలిపారు
ఐదుగురు హీరోల 'శ్రీ జగద్గురు ఆదిశంకర'
'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శ్రీమంజునాథ' చిత్రాల రచయిత జె.కె.భారవి స్వీయ దర్శకత్వంలో నిర్మించే 'శ్రీ జగద్గురు ఆదిశంకర' చిత్రం షూటింగ్ ఉగాది పర్వదినాన మొదలవుతుంది. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం వివరాలను గురువారం ఫిలిం చాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జె.కె.భారవి వెల్లడించారు. 'శంకరాచార్య జీవితత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సినిమా టైటిల్‌కు 'ఎ ఫిల్మ్ ఫర్ యూత్' అనే ఉపశీర్షిక ఉంటుంది. నేటితరానికి సనాతన ధర్మం గురించి తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 32 ఏళ్లకే తనువుచాలించిన శంకరాచార్య రాసినన్ని రచనలు మరెవరూ రాయలేదు. నాలుగు సార్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు. ఈ చరిత్ర అంతా యువతరానికి కౌన్సిలింగ్‌లాగా ఉపయోగపడుతుంది ' అని భారవి పేర్కొన్నారు. 'ఈ చిత్రం గురించి చాలామంది స్వాములకు చెప్పడం జరిగింది. వారంతా బావుందని అభినందించారు. కథ గురించి, పాటల గురించి విన్న తారలు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఇప్పటికి ఐదుగురు హీరోలు నటించడానికి అంగీకరించారు. ఇతర తారల వివరాలు, సాంకేతికనిపుణుల గురించి ఉగాది రోజన వెల్లడిస్తాం. ఇందులో 16 పాటలున్నాయి. ప్రముఖ నేపథ్యగాయనీగాయకులు శంకర్‌మహదేవన్, హరిహరన్, మధుబాలకృష్ణ, మను, కార్తీక్, ఉన్నికృష్ణన్, రంజిత, శ్రీరామచంద్ర తదితరులు ఆలపించారు. బాలుగారు పాడాల్సిన పాట కూడా ఉంది. ఈ చిత్రం ద్వారా నాగ్‌శ్రీవత్స సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు' అని భారవి వివరించారు.
ప్రేమకావాలి సెన్సార్ కట్స్
మాక్స్ ఇండియా ప్రొడక్షన్ నిర్మించిన 'ప్రేమకావాలి' చిత్రం ద్వారా ఆది, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. బ్రహ్మానందం, దేవగిల్, సింధుతులాని, నాగబాబు, జయసుధ ముఖ్య తారాగణం.
ఛాయా గ్రహణం ఛోటా కె నాయుడు, సంగీతం అనూస్ రూబెన్స్, కూర్పు గౌతంరాజు నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం కె. విజయ భాస్కర్ సమకూర్చారు. నిర్మాత కె. అచ్చిరెడ్డి.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి ఏ విధమైన కట్స్ లేకుండా 'యూఎ' సర్టిఫికెట్‌ని 21-2-2011న జారీచేసింది.
16 రీళ్ల నిడివిగల 'ప్రేమకావాలి' చిత్రం 25-2-2011న విడుదలయింది.
కుదిరితే కప్పుకాఫీ సెన్సార్ కట్స్
కుదిరితే కప్పుకాఫీ చిత్రాన్ని శివా ప్రొడక్షన్స్, మూన్ వాటర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. రమణ సాల్వ తొలిసారి దర్శకత్వం వహించి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. యోగీశ్వర శర్మ సంగీతాన్ని, సంతోష్‌రాయ్ ఛాయాగ్రహణాన్ని నిర్వహించారు. ఈ చిత్రానికి నిర్మాతలు శివ, మహి. వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య, తనికెళ్ళ భరణి, భీమనేని శ్రీనివాసరావు, శివనారాయణ, సుకుమారి ముఖ్య పాత్రధారులు.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'కుదిరితే కప్పు కాఫీ'ని చూసి ఏ విధమైన కట్స్ లేకుండా 'యు' సర్టిఫికెట్‌ని 21-2-2011న జారీ చేసింది.
14 రీళ్ళ నిడివిగల ఈ చిత్రం 25-2-11న విడుదల అయింది.
సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తాం
శ్రీకృష్ణ నివేదికను స్వాగతిస్తున్నాం ...
శ్రీకృష్ణ కమిటీ దిష్టి బొమ్మల దగ్ధం
శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శిక్షార్హులు
'దొంగల ముఠా'గా..శ్రీకృష్ణ కమిటీ...
లగడపాటి ఎంత మొనగాడో ...
లగడపాటి రాజగోపాల్ రహస్యంగా ఇచ్చిన నివేదిక, శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలోని నివేదిక ఒక్కటే. అయితే లగడపాటి ఎంత మొనగాడో అర్థమవుతోందన్నారు. ఈ నివేదిక రూపొందించడంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం సక్రమంగా గమనిస్తే వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుందని, వీలైతే వీరికి ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
'ఆంధ్ర కసబ్' రాజగోపాల్
చర్చలు జరపడం శుద్ధ దండగ
శ్రీకృష్ణ శకుని పాత్ర
'8వ అధ్యాయం'పై నీరు-నిప్పు
రహస్యంగా ప్రభుత్వానికి అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల కొంతమేర బయటపడింది. ఈ బయటపడిన అంశాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే పరిణామాలు, ఇబ్బందులకు గురిచేస్తాయని నక్సలిజం వ్యాప్తి చెందడంతో పాటు, మత ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంటుందని నివేదికలో శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా కమిటీ కొన్ని సలహాలు సూచించింది. ఈ విషయాలన్నీ తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల సభ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మరొక అడుగు ముందుకేసి తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది.
జగన్ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలి
అయితే, వైఎస్ హయాంలోనే విపరీతమైన అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రతిపక్ష తెలుగు దేశం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ గత ఆరేళ్లుగా ఎందుకు నోరుమెదపలేదన్న ప్రశ్నలకు సమాధానంగా ఆనాడు ప్రతిపక్షం కావాలనే కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నదనే అభిప్రాయం ఉండేదని, అయితే, ఆ తర్వాత వెలుగులోకి వస్తున్న అనేక కుంభకోణాలు, అవకతవకలను చూసిన తర్వాత తండ్రి అధికారంలో ఉండడాన్ని జగన్ అడ్వాంటేజ్‌గా తీసుకొన్నారని రుజువౌతున్నదని వివరించారు.
కృష్ణ... కృష్ణా...నిందలెందుకు?
అర్ధ శతాబ్దానికి పైగా వివిధ రూపాల్ని సంతరించుకున్న తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాలరాచే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజనాంశాలపై అధ్యయనం చేసి సిఫార్సులిచ్చే నిమిత్తం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భావప్రకటనా స్వేచ్ఛను కూడా తప్పుబడుతోంది. కమిటీ సభ్యులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదని, తమ మనోభావాల్ని గౌరవించలేదని, వారందరినీ ప్రాసిక్యూట్ చేసి జైలుపాలు చేయాలంటూ ఉద్యమాకారులు చేస్తున్న డిమాండ్‌లు ఉద్యమగతికి అద్దం పడుతున్నాయి. కేంద్రంపై విభజనవాదులు తెచ్చిన ఒత్తిడి కారణంగానే గత ఏడాది మార్చిలో యుపిఎ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ పది మాసాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. వివిధ వర్గాల ప్రజల మనోభావాల్ని తెలుసుకుంది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలు, సామాన్యుల నుంచి సంపన్నులు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల్లో విభజనపై నెలకొన్న అభిప్రాయాల్ని ఆరాతీసింది. తమ దృష్టికొచ్చిన అంశాలన్నింటితో ఒక నివేదికను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సమస్య మూలాలు జటిలంగా ఉండడంతో ఏకపక్ష పరిష్కారం సాధ్యం కాదని తలచి కొన్ని సిఫార్సులు చేసింది. వీటిలో ప్రభుత్వానికి అనుకూలమైన ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకోమని సూచించింది. వీరి సిఫార్సులేవీ తమకనుకూలంగా లేవన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. తాజాగా ఎనిమిదో ప్రతిపాదనపై వీరు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సభ్యుల్ని దూషిస్తున్నారు.
ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో గాని, ఇక్కడి రాజకీయాలు లేదా ప్రాంతాలు, రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు. తమ తమ రంగాల్లో అనేక రకాల అధ్యయనాలు నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించిన మేధావులు. రాష్ట్ర విభజన చేయాల్సొస్తే నైసర్గిక భౌగోళిక స్వరూపంతో పాటు ఖనిజాలు, జలవనరులు, విద్యుత్, సంపద ఇలా సంయుక్త వనరుల విభజనపై కూడా అధ్యయనం నిర్వహించి సిఫార్సులు చేస్తారన్న ఉద్దేశంతోనే వీరిని కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. వీరిలో ఒక మహిళ, ముస్లిం కూడా ఉన్నారు. ఇలా అన్ని వర్గాలకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం కల్పించారు. కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించిన వినోద్ కుమార్ దుగ్గల్ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 1968 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఆయన. తొలుత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. దీర్ఘకాలం పాటు జలవనరుల శాఖలో ఆయన పని చేశారు. దేశంలో జలవనరుల పంపిణీపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల్ని పునర్‌నిర్వచించే నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పూంచి కమిషన్‌లో కూడా ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ రవీంద్రకౌర్ పంజాబీ మహిళ. ఢిల్లీ ఐఐటిలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. భారత సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు, రిజర్వేషన్లపై ఆమె ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య సంబంధాలపై ఆమె పలు పుస్తకాలు వెలువరించారు. సామాజిక రంగంలో ఆమె విశేష కృషి చేశారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య భావ ప్రకటన స్వేచ్ఛలో వ్యత్యాసాలు, జీవన విధానాలపై అధ్యయనాలు నిర్వహించారు. మరో సభ్యుడు అబుసలేషరీఫ్ ఇండియన్ ముస్లిం. మంచి ఆర్థికవేత్త. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా సేవలందించారు. ఆయన ఆహార విధానంపై పలు అధ్యయనాలు
నిర్వహించారు. ఆర్థిక వ్యత్యాసాలు, ఆహారం సమకూర్చుకోవడంలో అసమానతలు, తద్వారా ఒనగూరే నష్టాలపై అనేక పేపర్లను ప్రజెంట్ చేశారు. అమెరికాలోని ఎకనామిక్ గ్రోత్‌సెంటర్‌కు విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాపర వివరాలపై అధ్యయనం నిర్వహించి కేంద్రానికో నివేదిక సమర్పించారు. ఇటీవలె భారత్‌లో మానవ వనరుల అభివృద్ధిపై పుస్తకాన్ని వెలువరించారు. దీర్ఘకాలం పాటు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా పనిచేశారు. ప్రతిష్టాత్మక ఇండియా టుడే మ్యాగజైన్ 2000 జనవరి నాటి సంచికలో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న మేధావుల జాబితాను ప్రచించింది. ఇందులోని 25 మందిలో షరీఫ్ స్థానం సంపాదించారు. ఇక రణబీర్‌సింగ్ నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. న్యాయ వ్యవస్థను పరిరక్షించే వేలాది మంది న్యాయ నిపుణుల్ని ఆయన తీర్చిదిద్దారు. కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
1991--92లో ముంబయ్‌లో జరిగిన మతకల్లోలాలపై ప్రభుత్వం నియమించిన కమిషన్‌కు ఆయనే నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు విధ్వంసానంతరం జరిగిన ఈ అల్లర్లతో ముంబయ్ నగరం అతలాకుతలమైంది. ఆయనకు ముందు మరికొంత మంది న్యాయ నిపుణుల్ని కేంద్రం సంప్రదించినప్పటికీ ఆ కమిటీకి నాయకత్వం వహించేందుకెవరూ ముందుకురాలేదు. 1998 వరకు సాక్షుల్ని విచారించిన జస్టిస్ శ్రీకృష్ణ ముంబయ్ అల్లర్ల మూలకారకుల వివరాల్ని బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులో 2009 ఫిబ్రవరి 19న జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో కూడా ఆయన ఇచ్చిన నివేదిక నిందితుల్ని బయటపెట్టింది. యుకెలోని ఇంటర్‌నేషనల్ బార్ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా ఉన్న శ్రీకృష్ణకు భారత్‌లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.
ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. తెలంగాణ ప్రాంతంలోని ముస్లింల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే సభ్యుల్లో ఒక ముస్లింను కూడా చేర్చింది. తెలంగాణ , సీమాంధ్ర ప్రాంతాల మధ్య నెలకొన్న ఆర్థిక అసమానతలు, జీవన వైరుధ్యాలపై స్పష్టమైన నివేదికిచ్చే నిమిత్తమే ఆయన రంగాల్లో ప్రతిభావంతులకు కమిటీలో స్థానం కల్పించింది. వీరంతా తమకు నిర్దేశించిన విధుల్ని పూర్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికుల మనోభావాల్ని గౌరవించి తీరాల్సిందే. అలాగే ప్రతిఒక్కరికి స్పష్టమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. ఈరెండింటికి రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. కానీ తెలంగాణ వాదులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదన్న ఏకైక కారణంతో రాష్ట్రానికి సంబంధంలేని జాతీయ స్థాయి మేధావులైన కమిటీ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రశ్నించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయినా తెలంగాణ ఏర్పాటు అన్నది ఓ రాజకీయ ప్రక్రియ. ఇంత వరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలేవీ దీనిపై ఇదమిత్ధంగా తమ విధానాల్ని స్పష్టం చేయలేదు. కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ తకూడా దోబూచులాట లాడుతున్నాయి. తెలంగాణ వాదులు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చిరాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయ తీర్మానాన్ని అమోదింపజేయడం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యపడుతుందని వీరు సూచిస్తున్నారు. అంతేగాని ఓ గౌరవనీయ వృత్తి అయిన ప్రొఫెసర్ హోదాలో ఉన్న కోదండరామ్ కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై విరుచుకుపడటం వారి రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా మాట్లాడటం తగదని వీరు పేర్కొంటున్నారు.
రాజీనామా చేస్తాం జగన్ పార్టీలో చేరతాం
వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంత్రులు అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారని, టిడిపి ఎంపిటిసిలతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు. కడపలో జగన్ తరఫున గెలిపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థికి వైఎస్సార్ బొమ్మ చూసి ఓటర్లు ఓట్లు వేశారన్నారు. ఇదిలావుండగా, చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రోజు ఏదో గొడవ సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.
19, మార్చి 2011, శనివారం
కావాల్సిన చీఫ్ బట్టి రేటు ఫిక్స్...
జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో చీలిక?
భలే మొగుడు-భలే పెళ్ళాం సెన్సార్ కట్స్
భలే మొగుడు భలే పెళ్ళాం చిత్రం ఉషాకిరణ్ క్రియేషన్స్ పతాకాన నిర్మితమయింది. రాజేంద్రప్రసాద్, సహాసిని, నరేష్, కావేరిఝా, ఝాన్సీ, రఘబాబు, రజిత, రమ్యశ్రీ ముఖ్యపాతల్రు పోషించారు. గంగోత్రి విశ్వనాథ్ డైలాగ్స్, ఇ.ఎస్.మూర్తి సంగీతం, మురళి రామయ్య కూర్పు నిర్వహించిన ఈ చిత్రానికి దర్శకుడు దినేష్ బాబు. నిర్మాత జొన్నాడ రమణమూర్తి.
5 గురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి 8 కట్స్‌తో 0.13 అడుగుల ఫిలిం కత్తిరించి 11-1-11న ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. 14 రీళ్ళ – ‘భలే మొగుడు భలే పెళ్ళాం’ చిత్రం 25-2-11 విడుదల అయింది.
1. ఒకటి రెండు రీళ్ళలో ‘దానికి బ్లౌజ్ ఎందుకు’ అని ఉన్న డైలాగ్‌లోని ‘బ్లౌజ్’ని కత్తిరించి శబ్దం వినబడకూడదన్నారు.
2. ఒకటి రెండు రీళ్ళలో ఒక దృశ్యంలో వచ్చిన టి.వి.9, టి.వి పదాలను సౌండ్‌తో సహా తొలగించారు.
3. ఒకటి రెండు రీళ్ళలో వున్న ‘ఆడంగి’ పదాన్ని శబ్దంతో సహ తొలగింప చేసారు.
4. ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనేది చూపమన్నారు జనరల్‌గా.
5. మూడు నాలుగు రీళ్ళలో ‘కోర్టుకి అండర్‌వేర్’ లేకుండా వెళతావా’ అనే డైలాగ్‌లోని ‘అండర్ వేర్’ పదం తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.
6. మూడు నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలో గల ఏ వర్కన్నా ఎక్సట్రా చార్జి ఇస్తే చేస్తావా’ అనే డైలాగ్‌ని శబ్ధంతో సహా తొలగించారు.
7. అయిదు ఆరు రీళ్ళలో టీవీ నటి చేతులు పిరుదుల్ని రాజేంద్ర ప్రసాద్ తాకే దృశాలను ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 0.05 అడుగులు నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.
8. ఏడు ఎనిమిది రీళ్ళలో రాజేంద్రప్రసాద్, సుహాసిని ముద్దులిచ్చుకునే దృశ్యాలన్ని ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 0.08 అడుగుల ఫిలిం కత్తిర పాలయింది.
15, మార్చి 2011, మంగళవారం
పాటిల్ కాంగ్రెస్ అభ్యర్థా? కాదా?
ఒకవేళ జేసీ వర్గీయులు అందరూ ఎన్నికలను బహిష్కరించినా.. టీడీపీకి చెందిన 150 మందికిపైగా ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికి బాహాటంగా మద్దతు ఇస్తున్నారని పాటిల్ విజయం సాధించడం తథ్యమనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
తెలంగాణ పేరుతో కేసీఆర్ దండుకున్నారు
14, మార్చి 2011, సోమవారం
జగన్ అక్రమ ఆస్తులపై విచారణకు ప్రధాని సానుకూలం
అనంతరంఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, ఎంపీ మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్‌పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. జగన్‌కు చెందిన పార్టీని చూసి భయపడే స్థితిలో లేమని అన్నారు. జగన్ అక్రమ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో పోరాడుతుందని, జగతి పబ్లికేషన్స్ లో వాటాలు పూర్తిగా అక్రమమైనవని అన్నారు. అందులో ఎవరెవరు ఎంత పెట్టారో వారి వారి వాటాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు.
మళ్లీ ప్రతిష్టిస్తే... మేం ఒప్పుకోం..
సోమవారం లోయర్ ట్యాంక్ బండలోని కట్టమైసమ్మ దేవాలయం నుండి పోతన విగ్రహం వరకు స్వాభిమాన్ యాత్ర జరిపిన ఆమె అనంతరం మీడియాలో మాట్లాడుతూ....తెలంగాణ వైతాలికుల విగ్రహాలు లేకుండా వేరే విగ్రహాలు ప్రతిష్టించకూడదని...కాదని సిద్దపడితే మరోమారు విధ్వంసం జరిగినా ఆశ్చర్యపోన్నఖ్ఖరేదని వ్యాఖ్యానించారు.
600 మంది తెలంగాణా కోసం ప్రాణ తాగాలు చేసే... కనీసం పలుకరించిన పాపాన పోని సీమాంధ్ర నేతలు జరిగిన విగ్రహాల విధ్వంసాన్ని మాత్రం అతిగా చూపుతున్నారని... తెలంగాణాకు వ్యతిరేకంగా పలు మీడియా సంస్ధలు చేసున్న వాఖ్యల వల్లే నాడు మీడియా ప్రతినిధులపై దాడి జరిగిందని... తాను భావిస్తున్నట్లు చెప్పారు
తెలంగాణా వ్యతిరేక నివేదిక నేనివ్వలే...
తెలంగాణ ఉద్యమం బలంగా లేదని తాను నివేదిక పంపినట్లు కొందరు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని... తాను ఈ విషయమై ఎలాంటి నివేధికనీ అధిష్టానానికి ఇవ్వలేదని స్పష్టం చేసారు.దృష్ట్యా పార్టీ విప్‌ని ఎవరు ధిక్కరించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని... ఎన్నికల నాటికి ప్రాంతాలకతీతంగా కాంగ్రెస్ శాసనసబ్యులంతా సభకు హాజరై కాంగ్రెస్ అభ్యర్ధులతో పాటు మిత్ర పక్షాల అభ్యర్ధులను కూడా గెలిపించుకోవాలిన బాధ్యత ఉందని సిఎం తెలంగాణా సభ్యులతో చెపారు. కాగా తెలంగాణా ఉద్యమాన్నివిస్పష్టంగా కేంద్రానికి వినిపించేందుకే తాము అసెంబ్లీని బాయ్‌కాట్ చేస్తున్నామని... ఎమెల్సీ ఎన్నికల్లో పాలొనే విషయమై తామంతా కల్సి ఓ నిర్ణయం తీసుకుంటామని శాసనసభ్యులు చెప్పినట్లు సమాచారం.
13, మార్చి 2011, ఆదివారం
కేసీఆర్ తెలంగాణ ద్రోహి కాక ఏమవుతాడు
విగ్రహావిష్కరణ సమయంలో ఆ నాడు తెలుగు దేశంలో కీలక పదవిలో కేసీఆర్‌కు ఏ ఒక్క తెలంగాణ యోధుడు గుర్తుకురాలే దు... కాని, ఇపుడు తెలంగాణా కోసం కోసం చనిపొయిన కుటుంబాలపై తనకే సానుభూతి ఉన్నట్లు మాట్లాడుతున్నాడని ఎక్కడా లేని ప్రేమ నటిస్తూ యువతను , ప్రాంతీయతత్వాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
మే నెలలో రాష్టప్రతి పాలన వచ్చేస్తోంది
మే నెలలో రాష్టప్రతి పాలన కిందకి రాష్ట్రం రానుందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాదులో మీడియాలో మాట్లా డుతూ... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంని మెప్పించి తన పదవిని కాపాడుకునేందుకే కుయుకులు పనుతున్నారని వైఎస్ జగన్‌ను ఎలా అణచాలనే విషయం గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నారని అందువల్లే రాష్ట్రంలో ఎలాంటి పెను విధ్వంసాలు జరుగుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇప్పటికే గవర్నర్ ష్ట్ర పరిస్ధితిపై ఓ నివేదికని పంపించారని తనకు సమాచారముందని ఖచ్చితంగా మేనెలాఖరు నాటికి రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని రాష్ట్రంలో ప్రభుత్వం తగురీతిన పనిచేయట్లేదని... తెలుగుదేశం పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని విమర్శించారు.
తెలంగాణా ఉద్యమంలో భావ వ్యకీకరణని ఎవరూ తప్పు పట్టలేరని.. అయితే తెలుగుదజాతి మహోన్నతిని చాటిన వారికి ప్రాంతీయ భేదాలు అంటగట్టి వారి విహాలను ధ్వంసం చేయటం తగదని తెలంగాణా ఉద్యమం పేరు చెప్పి కొందరు నేతలు విద్యార్థుల జీవితాలతో ఆడుకోంటున్నారని ఇది హేయమైన చర్యఅని విమర్శించారు. విదార్ధులు కూడా ఆలోచనతో ఆ నాయకుల ఉచ్చులో పడకుాడదని విజ్ఞప్తి చేశారు.
'దొంగలముఠా 'ట్రైలర్స్ విడుదల
అందుబాటులోకి వచ్చిన అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 'దొంగలముఠా' చిత్రాన్ని తీశామని, ఈ విధానంలో సినిమాలు తీయడం ఎంతో శ్రేయస్కరమని దర్శకుడు రాంగోపాల్‌వర్మ స్పష్టంచేశారు. రవితేజ, చార్మి, ప్రకాష్‌రాజ్, లక్ష్మీప్రసన్న మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్‌కుమార్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని సినీమాక్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ, 'లోగడ వందరోజుల్లో కూడా సినిమా తీశాం. ఇప్పుడు ఈ సినిమాను ఐదురోజుల్లో తీస్తే ఎలా తీయగలుగుతున్నారని అడుగుతున్నారు.
ఈ నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే మూడురోజుల్లో తీయవచ్చు. క్వాలిటీతో పాటు ఖర్చు కూడా ఎంతగానో కలిసొస్తుంది. అందుకే దీనిని ఉపయోగించి ముందు ముందు సినిమాలు తీయబోతున్నాను. హిందీలో కూడా ఈ పరిజ్ఞానంతో సినిమాలు తీస్తాను' అని అన్నారు.
ఉద్యమానికి తెలంగాణా ఉద్యోగ జెఎసి ద్రోహం
ప్రత్యేక తెలంగాణా రా ష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఏర్పాటైన ఉద్యోగ సంఘాల జెఎసి నిట్ట నిలువునా చీలింది. ఫిబ్రవరి 17 నుండి ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు తమ స్వార్ద రాజకీయాల కోసం ఈనెల 4న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ 32 సంఘాలకు చెందిన అధికార, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు ప్రత్యేక సమాఖ్యను ఏర్పరుచుకున్నా రు. తమ స్వార్దం కోసం 4.5 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర ద్రోహం చేసారని, ఈ సందర్బంగా ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తుగా నిర్ణయించిన అంశాలపై సంతకాలు చేసి ఉద్యమాన్ని విరమింప చేశారని ఆరోపిస్తున్నా రు. స్వామిగౌడ్, దేవినేని ప్రసాద్, శ్రీనివాసగౌడ్, విఠల్‌లు ఈ కుట్రలో భాగమని, వారిని పొలిటికల్ జెఎసి నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో ఈ నాయకులు కుదుర్చుకున్న ఒ ప్పందంలోని 11వ అంశంలో చేర్చబడిన ఇకనుండి సమ్మె చేయబోమని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములమై విధులు నిర్వహిస్తామని పేర్కొన్న విషయాన్ని కూడా చూడకుండా సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు.
సహాయ నిరాకరణను నిలిపివేస్తూ ప్రభుత్వంతో ఒ ప్పందం కుదుర్చుకునే విషయంలో జెఎసి లోని ఇతర సంఘాలతో చర్చించకుండానే స్వయం నిర్ణయం చేశారని అంటున్నారు. మరో 15 నుండి 20 రోజుల పాటు సహాయ నిరాకరణ జరిగివుంటే ప్రభుత్వం సంక్షోభ స్థితికి చేరుకుని, రాష్ట్ర అవతరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచనలు చేసేదని అంటున్నారు. ఈ స్థితిలో వీరు ఉద్యమానికి ఎనలేని ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు.
స్వామిగౌడ్ ఎన్జీవోలకు గచ్చిబౌలిలో ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు దండుకున్నాడని, ఈ విషయమై ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని, దీన్ని ఆసరాగా చేసుకుని కేసులు బనాయిస్తామని ప్రభుత్వం చేసిన హెచ్చరికకు స్వామిగౌడ్ లాంటి నాయకులు లొంగిపోయారని తీవ్రఆరోపణలు చేస్తున్నారు.
మూరుమూల గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు
గ్రామీణ ప్రజలకు కూడా బ్యాంకింగ్ సేవలు అందుబాటులొకొస్తున్నాయి. మూరుమూల గ్రామాలకు కూడా బ్యాంకింగ్ సేవల్ని విస్తరింపజేస్తామని గతేడాది బడ్జెట్‌లో కేంద్రఆర్ధిక మంత్రి ప్రకటించారు. కాగా ఇవిప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. ఏ బ్యాంక్ బ్రాంచ్‌లేని గ్రామాల్లో తొలుత సర్వీస్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుకొచ్చింది. సర్వీస్‌పాయింట్లలో కలెక్టన్ ఏజెంట్లుగా నియామకాలకు ఇంటర్వ్యూలు ప్రారంభించింది. కనీసం 50వేలు పెట్టుబడి పెట్టగలిగి మరో 50వేలు బ్యాంక్‌కు డిపాజిట్ చేయగలిగిన నిరుద్యోగుల్ని ఈ సర్వీస్ సెంటర్లలో కలెక్టన్ ఏజెంట్లుగా ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో ఒక చిన్న షాప్‌ను అద్దెకు తీసుకుని ఈ సర్వీస్‌పాయింట్లు నెలకొల్పుతారు. ఆయా గ్రామాల్లోని డ్వాక్రా మహిళల నుంచి వాయిదాలు కట్టించుకోవడం, అప్పులివ్వడం, గ్రామస్థులకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు తెరవడం వంటి చిన్న చిన్న పనుల్ని ఇక్కడ అప్పటికప్పుడు పూర్తిచేస్తారు. ఇందుకోసం సర్వీస్ సెంటర్ల నిర్వాహకులకు నిర్ణీత మొత్తంలో కమిషన్లు చెల్లిస్తారు. కనీసం ఇంటర్ పాసైన నిరుద్యోగుల్ని ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తున్నారు. శుక్రవారం నుంచి కాకినాడ స్టేట్‌బ్యాంక్ అడ్మినిస్ట్రేటీవ్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. ఈ నెలాఖరులోగా ఎంపిక పూర్తి చేసి గ్రామాలకు బ్యాంక్ సేవల్ని విస్తరించనున్నారు.
చేసింది అపచారం.. పైగా సమర్దిoపు
తెలుగు జాతి కీర్తి కిరీటాలను ప్రపంచ వినువీధుల్లో చాటి చెప్పిన తెలుగు మాగాణి ముద్దు బిడ్డల విగ్రహాలను ప్రాంతీయ విధేష్వాల పేరుతో ధ్వంసం చేసి హుసేన్‌సాగర్‌లో పడేయటాన్ని గర్హిస్తు తెలుగు భాషాభిమానులు టాంకుబాండ్‌పై నిరసన దీక్షకి దిగారు. ఆదివారం పలువురు రాజకీయ నేతలు, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొని పోతనామాత్యుని విగ్రహం ముందు కూర్చొని నిరసన తెలిపారు. కృష్ణ దేవరాయులు, బ్రహ్మనాయుడు విగ్రహాల ను చూసి కన్నీళుల పెటుకునారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు జాతి కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా విదేశీయులైనా తెలుగువారికి మేలు చేకూర్చిన ప్రతి ఒక్కరినీ తెలువాళ్లంతా గుర్తుంచుకోవాలన్న ఒకే ఒక్క కాంక్షతో నాటి ముఖ్యమంత్రి వీటిని ఏర్పాటు చేస్తే .. విగహాలకు ప్రాంతీయ విధ్వేషాలు పులిమి కూల గొట్టడం... పైగా వారి ఔన్నత్యం తెలిసికూడా... విగ్రహాలే కదా? అన్న రీతిన మిలీయన్ మార్చ్ నిర్వాహకులు జరిగిన తప్పిందాన్ని సమరించుకోవటం శోచనీయమని ఈ నిరసనలో పాల్గొన్న పలువురు అభిపాయ పడ్డారు. అంతకు ముందు మహాత్ములారా! మన్నించండంటూ జనవిజాన వేదిక ఆధ్వర్యంలో టాంక్ బాండ్‌పై మౌన ప్రదర్శన జరిగింది.
ప్రతి హిందూవు ఇంటిపై కాషాయ ధ్వజo
పెరుగుతున్న ఎండలు .. భయాందోళనలో జనాలు
ప్రకృతి ధర్మంలో భాగంగా ప్రతి ఏడు ఎండ, వాన, చలి, గాలి వాటి వాటి పనులు తుచాతప్పకుండా ఎవరి ఆదేశాల కోసం వేచిచూడకుండా వారి తడువు రాగానే వారి వారి పనులు చేసి వెళ్ళిపోవడం ఆనవాయితి. ఇందులో భాగంగా చలి తనదైన శైలిలో విజృంభించి మానవాళిని గజగజ వణికించి తన పని పూర్తి చేసుకొని తరువాత వంతు ఎండకు అప్పగించి వెళ్లడంతో సూర్య ప్రతాపం క్రమం క్రమంగా పెరుగుతూ ఎండ వేడిని పుట్టిస్తున్నడంతో ప్రజలు ఎండలకు బెంబెలేత్తూ పరుగులు తీస్తున్నారు.
గతంలో ఈ సమయంలో ఎప్పుడు లేనంతా ఎండ ఉష్టోగ్రతను ప్రజలు చూస్తూ రాబోయే కాలంలో ఈ ఎండ ప్రభావం ఏ మేరకు ఉంటుందో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యువత, చిన్నారులు ఎండ వేడిని తట్టుకోలేక సమీపంలో ఉన్న నీటి బావుల వద్దకు చేరుకొని ఎండ వేడికి జలకాలటలే శరణ్యం అంటూ వేడి ప్రతాపం నుండి ఉపసమనం పొందుతూ సేదతీరుతున్నారు. పట్టణంలో ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు చెట్ల నీడలకు, దుకాణాల ముందు భాగాలకు చేరుతూ ఎండ వేడితో తడారిపోయిన శరీరానికి చల్లని పానియాలు, పుచ్చకాయలు, మజ్జిగ తదితర ద్రవ ప దార్థాలను సేవిస్తూ శరీరంలో తగ్గుతున్న నీటి శాతాన్ని పెంచుకోనేందుకు వారి వారి స్తోమతబ ట్టి సేవిస్తున్నారు.
జగన్‌ని కాంగ్రెస్‌లోకి తేకుంటే రాజీనామా
'విదేశీ' కన్నా మన స్వదేశీ 'మందే' బెటర్
రాష్ట్రంలో విదేశీ మద్యం మందుబాబులకు కిక్కివ్వడం లేదు. అమ్మకాలు ఆశాజనకంగా లేవు. ఐదు నెలల కాలంలో 10 కేసులే అమ్ముడు పోయాయంటే అమ్మకాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం 2010 అక్టోబర్ నుంచి విదేశీ మద్యాన్ని రిటైల్, బార్‌లో అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. దీంతో మందుబాబులు విదేశీ మద్యం తమ ముంగిట్లోకి వస్తుందని మురిసిపోయారు.
ఒక బాటిల్ రూ.1800 నుంచి రూ.3500 పైబడి ఉండడంతో మందుబాబులు వీటి జోలికి వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. అదే ఇండియన్ మేడ్ లిక్కర్‌లో కొంత కాస్లీ అయినప్పటికీ టీచర్స్-50, టీచర్స్, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్ రూ.1000 నుంచి రూ. 1500 లోపు ధర ఉండటంతో ఉన్నత శ్రేణి మద్యం ప్రియులు విదేశీ మద్యంపై మక్కువ చూపకుండా స్వదేశీ బ్రాండ్‌నే తాగుతున్నారు.
మన సంబంధికులెవరైనా విదేశీ మద్యం తీసుకొస్తే వారికి ఇండియా కరెన్సీలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు అక్కడ లభిస్తుంది. ఇండియాకు తీసుకువచ్చిన తరువాత నామమాత్రంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒక్కొక్క బాటిల్‌పై కస్టమ్ డ్యూటీ పడుతుంది.అదే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న విదేశీ మద్యం సెల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కలుపుకుంటే రేట్టింపు ధరతో మనకు లభిస్తోంది. బ్లాక్‌లెబుల్ ధర రూ.3,500, రెడ్‌లెబుల్ ధర రూ.1800, శివాస్ రిగల్ రూ.3,500 ధరతో లభిస్తోంది.
ఈ ధరలు అధికంగా ఉండడంతో మన మందుబాబులు వాటిని కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.
ఖజనాకి 'విదేశీ' కిక్కు నిల్లు
ఒక బాటిల్ రూ.1800 నుంచి రూ.3500 పైబడి ఉండడంతో మందుబాబులు వీటి జోలికి వెళ్లేందుకు కూడా సంకోచిస్తున్నారు. అదే ఇండియన్ మేడ్ లిక్కర్‌లో కొంత కాస్లీ అయినప్పటికీ టీచర్స్-50, టీచర్స్, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్ రూ.1000 నుంచి రూ. 1500 లోపు ధర ఉండటంతో ఉన్నత శ్రేణి మద్యం ప్రియులు విదేశీ మద్యంపై మక్కువ చూపకుండా స్వదేశీ బ్రాండ్‌నే తాగుతున్నారు.
మన సంబంధికులెవరైనా విదేశీ మద్యం తీసుకొస్తే వారికి ఇండియా కరెన్సీలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు అక్కడ లభిస్తుంది. ఇండియాకు తీసుకువచ్చిన తరువాత నామమాత్రంగా రూ.200 నుంచి రూ.300 వరకు ఒక్కొక్క బాటిల్‌పై కస్టమ్ డ్యూటీ పడుతుంది.అదే ప్రస్తుతం మనకు మార్కెట్లో లభిస్తున్న విదేశీ మద్యం సెల్స్‌ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ కలుపుకుంటే రేట్టింపు ధరతో మనకు లభిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం జానీవాకర్, బ్లాక్ లెబుల్, రెడ్ లెబుల్ లో లభిస్తుంది. బ్లాక్‌లెబుల్ ధర రూ.3,500, రెడ్‌లెబుల్ ధర రూ.1800, శివాస్ రిగల్ రూ.3,500 ధరతో లభిస్తోంది.
ఈ ధరలు అధికంగా ఉండడంతో మన మందుబాబులు వాటిని కొనేందుకు వెనుకంజ వేస్తున్నారు.
మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రాణం పోస్తున్న వెంకి, పవన్?
12, మార్చి 2011, శనివారం
'దొంగల ముఠా' ఖర్చు ఆరున్నర లక్షలే నట
అన్నట్లు . వర్మ దృష్టి లో సినిమా ఫ్లాపులు నాలుగు రకాలట అందులో మొదటిది, నిర్మాత పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం. రెండోది, డిస్ట్రిబ్యుటార్ పెట్టిన డబ్బు తిరిగి రాకపోవడం. ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవడం అన్నది మూడో రకం ఫ్లాపు. ఇక, విమర్శకులకు సినిమా నచ్చకపోవడం అన్నది నాలుగో రకం ఫ్లాపు.
వీటిలో మొదటి రకం ఫ్లాపును, నిర్మాత బడ్జెట్ ను తగ్గించుకోవడం ద్వారా అధిగమించవచ్చని తను చేసింది అదీ అంటున్నాడు వర్మ.మరి మిగిలిన మూడు ఫ్లాప్స్ గురించేమంటే చెప్పట్లే..
ఛార్మి, సాయి రామ్ శంకర్ ల వెడ్డింగ్
రెండో మొగుడు.. రెండో పెళ్ళాం...సరిజోడీ
జి - బృందావన్ కాలనీ సినిమాలో సోనియా అగర్వాల్... ఆపై ఆ చిత్ర ద్రసకుడు సెల్వ రాఘవాన్ని ప్రేమినిచ్ పెళ్ళాడింది... వేరి పెళ్లి జరిగి, మూడేళ్ళు కాపురం వెలగ బెట్టినా ... అన్యోన్యత కొరవడి చివరకి విడాకులకి దారితీసిన విషయం తెలిసిందే... తాజాగా సెల్వ రాఘవన్ తన తన తోటి సహాయ దర్సకురాలిని రెండో పెళ్ళాడేసి ఎంచక్కా హప్ప్య్గా జీవతం సాగిస్తుంటే.. నేనేం తక్కువ తిన్నానా అని సోనూ కూడా సుదీప్ అనే కన్నడ హీరోని తగులు కుందట.. ఇప్పటికే సుదీప్ తన తొలి పెళ్ళాం కి గుడ్ బై చెప్పి చాన్నాళ్ళు అవుతుండటంతో దొరికిందే చాన్స్ అంటూ సోనూని వెంటేసుకొని కనిపించిన చోటుకల్లా తిప్పుతూ తెగ ఆనందిచేస్తున్నారు. వీరి చెట్టపట్టాలు చూసే వాళ్ళు రెండో మొగుడు.. రెండో పెళ్ళాం సరిజోడీ అంటూ సెటైర్స్ వేస్తున్నా పట్టించుకోకుండా .. మా మధ్య ఉన్నదే స్నేహం మాత్రమె అంటూ తెగ కోతలు కోసేస్తుంటే.. ముక్కున వేలేసుకోవటం మినహా మనమేం చేయగలం.
6, మార్చి 2011, ఆదివారం
ఉద్యమాలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది
రాష్ట్ర విభజన అంశంపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక సూచించిన అంశాలను కేంద్ర ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తోందన్నారు. దీనిపై కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరూ కట్టుబడి ఉండాలని హితవు చెప్పారు.
Mutyalamuggu at andhrajyothy.com International News» అపర కుబేరుడు ముబారక్
ఇలా 70 బిలియన్ డాలర్ల సంపదతో.. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ధనవంతులైన మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ ( 53.5 బిలియన్ డాలర్లు), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు (53 బిలియన్ డాలర్లు) బిల్ గేట్స్‌ను ముబారక్ వెనక్కు నెట్టారు.
బురఖాలు ధరించేవారికి ఫైన్
వాటిని తొలగించకపోతే వారిని జైలుకు తీసుకెళ్లి విచారణ చేపట్టొచ్చు లేదా వారికి సుమారు రూ.10 వేల (208 డాలర్లు) వరకు ఫైన్ వేయొచ్చు. అయితే, దీనిపై కొన్ని ముస్లిం సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిని అలుసుగా తీసుకుని పోలీసులు అతిగా ప్రవర్తించే అవకాశం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కిరణ్ పాలన రాక్షసపాలనను తలపిస్తోంది
తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే 168 మంది ఎంపిల మద్దతు
బరిలో నుంచి తప్పుకున్నా : కుమార్‌రాజా
మిలియన్ మార్చ్'పైనిర్ణయం తీసుకుంటా
ఆస్తికోసమే కృష్ణవేణిని హతం చేశా
ఒకరిద్దరిని మేధావులుగా గుర్తించడంలే...
9 నుంచి అరసవల్లిలో అద్భుత కిరణస్పర్శ
5, మార్చి 2011, శనివారం
12వ శతాబ్దంనాటి పాండవుల నిర్మిత ఆలయం
తమిళ్ వైపు తాప్సీ చూపు
వెంకటేష్‌తో బెల్లంకొండ చిత్రం
'అహనాపెళ్లంట' విజయానందం
రాష్ట్రంలో అన్నిచోట్ల నుండి సూపర్‌హిట్ టాక్‌తో సినిమా ప్రదర్శింపబడుతోందని దర్శకుడు వీరభద్ర తెలిపారు. ఇంతటి విజయం సాధిస్తుందని శ్రీహరి ముందే చెప్పారు. నరేష్, బ్రహ్మానందం పాత్రలు సినిమాకు బలాన్నిచ్చాయి. ఇచ్చిన మాటకోసం నిర్మాత ఈ చిత్రాన్ని రూపొందించారని ఆయన పేర్కొన్నారు.
పాజిటివ్ ఎనర్జీతో ఈ చిత్రం తీసినట్టు నిర్మాత చెప్పారు. శనివారం నుండి యూనిట్ విజయయాత్రలో పాల్గొంటుంది. వైజాగ్, కాకినాడ, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్‌లో ఈ యాత్ర జరుగుతుందన్నారు.
శ్రీహరి మాట్లాడుతూ వీరభద్రం వినిపించిన కథలో కొత్తదనం ఉంది. తొలుత అతడిపై నమ్మకం లేనప్పటికీ, కథ వివరించాక నమ్మకం కలిగింది. నిర్మాత చక్కగా ప్లాన్ చేసి చిత్రీకరణ జరిపారు. ఇతర యూనిట్ సభ్యులంతా పూర్తిసహకారాన్ని అందజేశారు. రీమిక్స్ పాటకు మంచి స్పందన లభిస్తోంది అన్నారు. ఈ సమావేశంలో మిగతా యూనిట్ సభ్యులంతా తమ స్పందన తెలియజేశారు.
'కారాలు... మిరియాలు' పాటలు
స్వీయదర్శకత్వంలో పసుపులేటి వెంకటరామారావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు చక్రి, నటి రత్నసాగర్, ప్రసన్నకుమార్, శివచెన్ను, రవీంద్ర పెండ్యాల, చిత్రకథానాయకుడు నవకేశ్, మహేష్‌రాయల్, రాఘవయ్య, సునీల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ డి.రామానాయుడు మాట్లాడుతూ 'కొత్తవారితో, విదేశాల్లో తీసిన ఈ చిత్రం పేరు మాత్రం తెలుగుదనంతో ఉంది. రిస్క్‌తో సినిమా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలి. కథబాగుంటేనే సినిమా ఆదరణ పొందుతుంది. ఇలాంటి చిన్న చిత్రాలు ఇంకా రావాలి' అన్నారు.
'ఈ సినిమా యూనిట్ అంతా యువకులే. వారిని చూస్తుంటే ముచ్చటేస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం ఉంది. ఇలాంటి చిన్న చిత్రాలను ప్రోత్సహంచాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని రమేష్‌ప్రసాద్ పేర్కొన్నారు.చక్రి మాట్లాడుతూ 'ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్న జంట మ్యూజిక్ డైరక్టర్లకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. పాటలు బావున్నాయి' అన్నారు.
దర్శక, నిర్మాత పసుపులేటి వెంకటరామారావు మాట్లాడుతూ 'ఈ చిత్రాన్ని విదేశాల్లో చిత్రీకరించాం. కొత్త ఆలోచనతో తీసిన ప్రేమకథా చిత్రమిది. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటుంది' అని చెప్పారు.
ఈ చిత్రంలో నవకేష్, మధుశాలిని, రత్నసాగర్, లండన్ సునీల్, హాలీవుడ్ నటుడు హ్యారీపోటర్ ఫేమ్ మైఖేల్‌గామన్ నటించారు.ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌కృష్ణమూర్తి, విద్యాధరణి, ఛాయాగ్రహణం: మహేష్‌రాయల్, పాటలు; రవీంద్రపెండ్యాల.
పోటీ పడి పెరుగుతున్న బంగారం,వెండి
యునెస్కో గుర్తించిన దేవాలయం
బృహదీశ్వర ఆలయంలో మరొక ప్రత్యేకత నంది విగ్రహం. ఇక్కడ బృహన్నాయకి, గణపతి, సుబ్రహ్మణ్య, దక్షిణామూర్తి, నటరాజ, విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ పెయింటింగులు అందరినీ ఆకర్షిస్తాయి. 17వ శతాబ్దికి చెందిన ఈ కళాఖండాలు ఎంతో సుందరంగా వుండి ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయంలోని మరొక గోడపై శ్వేత ఐరావతంపై సుందరమూర్తి నాయనార్, వెళ్లడం కానవస్తుంది. మరొక చోళరాజరాజ గురువైన కరువూర్ దేవర్ పెయింటింగ్ కానవస్తుంది.
శివుని 81 నాట్యభంగిమలను ఈ దేవాలయ ప్రాకారాలపై చూడవచ్చు. మొత్తం నాట్యశాస్త్రమే ఇక్కడ కళ్లకు కట్టినట్టు గోచరిస్తుంది. ఓ రోజు ప్రధాన స్తపతి నంది విగ్రహం తదేక దృష్టితో చెక్కుతుండగా రాజరాజ రాజువెళ్ళి ఆ స్తపతి పక్కనే నుంచొని చూస్తున్నాడు. స్తపతి తన సేవకుడే పక్కన వున్నాడని తలచి తనకు ఒక కిళ్లిdని కట్టి ఇవ్వమన్నాడు. రాజు ఇచ్చిన కిళ్లిdని స్తపతి చూడకుండానే నోట్లో వేసుకున్నాడు.
స్తపతి తన పక్కన వున్నది రాజని గుర్తించక ఈ గొప్ప నందివిగ్రహాన్ని చెక్కిస్తున్న రాజుగారిని ప్రశంసిం చాడు. తరువాత పాన్ తింటున్న కిళ్లిd ద్వారా వచ్చిన ఉమ్మిని ఉయ్యటానికి పాత్రను ఇవ్వమన్నాడు. రాజు ఆ పాత్రను అలాగే ఇచ్చాడు. స్తపతి దానిలో ఉమ్మివేసి రాజును చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే పాదాక్రాంతుడై క్షమాపణలు వేడుకున్నాడు. రాజు స్తపతిని లేవనెత్తి కౌగలించుకొని సప్తతికి సపర్యలు చేయడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నాడు.
రాజరాజుకు ఇతరమతాలపై కూడా విశ్వాసం మెండు. నాగపట్నంలోని బౌద్ధుల విహారానికి ఒక గ్రామాన్నే కేటాయించాడు. బృహదీశ్వరాలయం తమిళ శైవ సిద్ధాంతానికి ప్రతీక. శివుడు సృష్టికర్త అలాగే రక్షకుడు, ధ్వంసకుడు కూడా. కర్మ నుండి విముక్తికై శివసాయుజ్యం పొందాలన్నాడు. శివునిలో అంతర్లీనం కాక పోయినా పాదాలవద్ద బిడ్డలుగానైనా ఉండాలన్నాడు. నటరాజ విగ్రహం శైవ సిద్ధాంతానికి ప్రతీక. శైవ సిద్ధాంతంలో దేవతారాధన ముఖ్యం.
నాయనార్ భక్తులు శివతత్వాన్ని ప్రచారం చేశారు. సంబంధర్, అప్పర్, సుందరమూర్తి, మాణిక్య వాసగర్, శైవాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. మాణిక్యవాసగర్ రాసిన తిరువాసగం ప్రసిద్ధిచెందింది.
రాజరాజచోళుడు సముద్రంలో ప్రయాణించేవాడు. అనేక ద్వీపాలను జయించాడు. యునెస్కో తంజా వూరులోని దేవాలయంకూడా హెరిటేజ్ సైట్‌గా గుర్తించడం ముదావహం.
తమిళనాడు సంస్కృతి పరిరక్షణలో తలమానికం వంటిది. ఈ దేవాలయ పరిరక్షణకు అందరూ నడుంబిగించాలి.
- దండు కృష్ణవర్మ
ఢిల్లీ నుండి కేసీఆర్ ఎందుకొచ్చేసాడో?
తెలంగాణా ఇచ్చేది కేంద్రమే అయినప్పుడు..అక్కడ నిలదీసి తెలంగాణా సాధించుకు వస్తానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ సోనియా ఇంటి ముందు కూర్చొనకుండా ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా పోరాటాలు చేస్తాం అనియూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లాలూచీపడి, కుమ్మక్కై కేసీఆర్ ఢిల్లీ తిరిగి వచ్చేయటం వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీసారు.
సహాయ ‘నిరాకరణ”కు మేం ఒప్పుకోం
ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఏక పక్ష నిర్ణయాలు తీసుకుని జేఏసీ నేతలు లాలూచీ పడి సహాయ నిరాకరణని విరమింప చేసారని ఆరోపించారు. తెలంగాణా ఉద్యోగ జేఏసీతో సంబంధం లేకుండా తాము ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని... తెలంగాణా వచ్చే వరకు తమ జిల్లాలో సహాయ నిరాకరణ కొనసాగుతుందని తేల్పి చెప్పారు.
అబ్బే! నేను పోటీ చేయట్లే....
కడప జిల్లాలో తెలుగుదేశం పార్ధీకి చెందిన వారితో రాష్ట్ర మంత్రులు సమావేశమై విందు రాజకీయాలు నడపడం ఆశ్చర్యమేమీ లేదని... వారికి బలంలేదు... ఆ స్ధానంలో తమ అభ్యర్ధికి ఓటు వేయించాల్సింది కోరటంలో తప్పేముంది.రాజకీయాలలో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఉండరని, ఎన్నికలలో గెలుపు కోసం ఎవరి సహాయమైనా కోరవచ్చునని..దీనిని కొందరు అనవసర రాధ్ధాంతం చేస్తున్నారని జగన్ వర్గాన్ని ఎత్తి పొడిచారు డి.శ్రీనివాస్.
కాంగ్రెస్ - డిఎంకెల మధ్య సీట్ల చిచ్చు
ఈనేపథ్యంలో కరుణానిధి శనివారం మీడియాతో మాట్లాడుతూ డీఎంకె-కాంగ్రెస్‌ల మధ్య ఇంకా సీట్ల సర్థుబాట్లు పూర్తి కాలేని..తగినంత బలం లేకుండా ఎక్కువ సీట్లు ఆశించడం న్యాయం కాదన్నారు. కాంగ్రెస్ వైఖరి ఇలాగే కొనసాగితే కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటామని కరుణ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం జరిగే సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
అది శాసనసభ? సీమాంధ్ర సభ? : తెరాస
కుమ్మక్కులో భాగంగానే కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని, తెలుగుదేశం నాయకులు తమ ఎంపిటీసీ సభ్యులను కాంగ్రెసుకు అప్పగిస్తున్నారని, రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వెళ్తున్నారని..ప్రజా ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిరెడ్డికి ముఖ్యంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు
మిలియన్ మార్చ్ వాయిదా?
4, మార్చి 2011, శుక్రవారం
వాళ్ళిద్దరికీ చెరొకటిస్తారట......
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసాక చిరంజీవి గ్యాంగ్‌కి మంచి ఛాన్సే దొరికింది. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డితో చిరంజీవి జరిపిన చర్చలు ఫలించి పీఆర్పీకి ఓ ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అలాగే ఎంఐఎంకి కూడా ఓ ఎమ్మెల్సీ సీటు ఖాయంగా కనిపి స్తోంది.
శాసన సభ్యుల కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యేందుకు ఆశావాహులు పదుల సంఖ్యలో క్యూలో ఉన్నప్పటికి తాజా రాజకీయ పరిణామాలలో పీఆర్పీ, ఎంఐఎంల ఎమ్మెల్యేల సహకారం అవసరం కావటంతో చెరో సీటు ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సూచించినా.. పీఆర్పీ రెండు సీట్ల కోసం పట్టుబట్టినా ఫలితం లేకపోయిందన్నది వాస్తవం.
మిలియన్ మార్చ్‌పై జెఏసీకి హైకోర్టు నోటీసులు
వరంగల్ జిల్లాకు చెందిన సాంబరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌లో మార్చ్ 10న తెలంగాణా ఐకాస ఆధ్వర్యంలో జరుగు మిలియన్ మార్చ్ కారణంగా ఇంటర్ పరీక్షని వాయిదా వేయాలని కోరటం సమంజసం కాదని.. ప్రస్తుత పరిస్ధితి కారణంగా లక్షలాది విదార్ధులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని... పరీక్షలకు అడ్డకులు సృషించవద్దని ఆదేశాలివాలని కోరుకున్నారు.ఈ పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్రంగా స్పందిస్తూ..రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీసుకున్న చర్యలని వివరించాలని ఆదేశాలివ్వటమే కాకుండా మిలియన్ మార్చ్ నిర్వహిసున్న తెలంగాణా ఐకాసకు, ఉద్యోగ జేఏసీకి కూడా నోటీసులు జారీ చేసింది.
సాక్షాలు లేక భోఫర్స్ కేసు మూసేసారు..
సిబిఐ పిటీషన్‌ని పరిశీలించిన హైకోర్టు వారి విన్నపాన్ని మన్నిస్తూ.. కేసు ఉపసంహరణకు సూచన ప్రాయంగా అంగీకరించడంతో.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖత్రోచిపై కేసుని వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది.
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు
తెలంగాణపై రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపజేసినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనాలేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన ఢిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపచేసినా కేంద్రంలో స్పందన కరువైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో.. ప్రజలు రోడ్డుపైకి వచ్చినా, ఉద్యోగుల సహాయనిరాకరణ జరుగుతున్నా, రాష్ట్రంలో పరిపాలన స్తంభించినా..తెలంగాణ కోసం 600 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.ఉద్యోగులు సహాయనిరాకరణ చేస్తున్నా..ఉద్యమాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు.. చేస్తున్నా కేంద్రం దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని,పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని, బీజేపీ, ఇతర పార్టీల విజ్ఞప్తి మేరకు సభకు అడ్డుతగలకుండా వాకౌట్ చేశామని ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై..తమ రాజీనామాలపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.
అధిష్టానం మా గొంతులు నొక్కేస్తోంది...
నిన్న లోక్'సభలో తెరాస సభ్యులతో కల్సి తెలంగాణ కోసం నినాదాలు చేసిన అరుపులు కేకలు వేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపిలు నోటికి నల్ల గుడ్డలు అడ్డు పెట్టుకుని వచ్చి లోక్ సభలో నిరసన తెలిపారు. మరోవైపు తెలంగాణా కావాలంటూ ప్లే కార్డులు ప్రదర్శించడం పట్ల స్పీకర్ మీరాకుమార్ ఆ విధంగా వ్యవహరించకూడదని..అసహనం వ్యక్తం చేసినా... ఫలితం లేకపోయింది.
ఓ దశలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినా వారు పట్టించుకోకపోవటం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడలేదు. నిన్న రాత్రి ప్రణాబ్‌తో సమావేశమైన ఎంపీలు అధిష్టానం తమ గొంతు నొకేస్తోందన్న అభిప్రాయం సర్వ్‌త్రా వినిపిస్తుండటంతో పాటు నిన్న రాజీ నామాలకు రడీ అయిన వారు నేడు నిరసనకే పరిమితం కావటం వెనుక ఆంతర్యం అంతు పట్టకుండా ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
జీతాల చెల్లింపునకు అoగీకరించిన ప్రభుత్వం
ఇంటర్ పరీక్ష వాయిదా కుదరదు...
జగన్ బలపడడానికి కారణమని మెయిలీని పీకి పారేశారు....
తెలంగాణా ఏర్పాటుపై ఏదో ఓ నిర్ణయాన్ని అధిష్టానం ప్రకటిస్తుందని యావత్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తుంటే... కాంగ్రెస్ అధిషానం మాత్రం పార్టీలో ప్రక్షాళన ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా చక్రం తిప్పిన వీరప్ప మొయిలీ.. వై.ఎస్.జగన్ పట్ల చాలా మెత్తగా వ్యవహరించడం వల్ల జగన్ బాగా బలపడడానికి పరోక్ష కారణం కావడం వంటి అంశాలవల్ల ఆయనను మార్చి ఆయన స్థానంలో గతంలో ఇన్‌ఛార్జిగా పనిచేసిన గులాంనబీ ఆజాద్‌ను నియమించారు. అలాగే ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై నిప్పులు చెరిగి, ఆమె దేశీయతని ప్రశ్నించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వం నుంచి జి. వెంకటస్వామికి ఉద్వసన చెప్పారు.
కాగా తెలంగాణా వాదాన్ని బలంగా వినిపిస్తునే... అధినేతికి విధేయుడిగా ఉన్న సైతం సిడబ్ల్యూసి నుండి కె. కేశవరావుని తొలగించడం ఆశ్చర్యకరం ...అలాగే సీమాంధ్ర ప్రాంతాల నుండి ఎంపీలుగా ఉండి ఎలాంటి వాదనలు వినిపించని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ లను కూడా తొలగించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బి. సంజీవరెడ్డిని, మరోవైపు అధిష్టానం ప్రసన్నం పొందిన సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డికి, అధినేత్రిపై ఈగ వాలనీయకుండా చూసే వి. హనుమంతరావుకు కార్యదర్శులుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యు.సి.) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం లేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది.
3, మార్చి 2011, గురువారం
'హెల్'చల్-సెల్
''ఏంట్రా... పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్. మర్యాదగా నేను చెప్పినట్లు వింటావా? కాళ్లూ చేతులూ విరగ్గొట్టమంటావా'' అని బస్సులో చివరి వరసలో మాటల తూటాలు పేలడం విని, ముందు వరసలో కూర్చున్న మీరు... అక్కడ ఏదో యుద్ధం ప్రారంభం కాబోతుందని కంగారు పడితే, ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే! అది సెల్‌ఫోన్ బాగోతమై ఉంటుంది!!
గంటల తరబడి తన ప్రియుడితో సెల్‌ఫోన్‌లో శృంగార సంభాషణ చేసే అమ్మాయికి గానీ, అప్పు వసూలుకు ఫోన్ ద్వారా భయంకర హెచ్చరికలు చేసే ఆసామీకి గాని -తాము తోటి ప్రయాణీకులకు ఈ తరహా శబ్దకాలుష్యం ద్వారా బోలెడంత అసౌకర్యం కలిగిస్తున్నామనే 'కనీస జ్ఞానం' కూడా ఈ రోజుల్లో ఉండడం లేదు. ఇలాంటి సందర్భాలలోనే టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ మీద అనవసరంగా ఆగ్రహం కలుగుతుంది. ఆయన పుట్టినరోజు (3.3.1847) సందర్భంగా సంతోషించడానికి బదులు విచారం కలుగుతుంది!
తాజా బడ్జెట్ ప్రభావం వల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గే 'ప్రమాదం' ఉంది కాబట్టి, ఇక కొత్తగా కొనుక్కునే వాళ్లు రెచ్చిపోతే, పరిస్థితి ఎలా ఉంటుందో... ఏమో!
ఒక మిత్రుడు ఆ పరిస్థితిని ఇలా కూడా ఊహించాడు. బిచ్చగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా ఎవరు ఏయే ఏరియాలకు వెళ్లాలో మాట్లాడుకుని ముందస్తుగానే నిర్ణయాలు తీసుకుంటారట. ఎక్కడైనా పెళ్లి లేదా అలాంటి వేడుక సందర్భంగా భోజనాలు గట్రా ఉంటే, ఆ సంగతి తక్కిన వాళ్లకు 'సెల్' ద్వారా తెలియజేసేలా 'జెంటిల్‌మన్స్ అగ్రిమెంట్' చేసుకుంటారట!
సెల్‌ఫోన్ చేత్తో పట్టుకుని మాట్లాడడానికి కూడా బద్ధకించే పెద్దమనుషులకు ఓ సదుపాయం ఉంది. మెడకు వైర్లు లాంటివి చుట్టుకుని ఉన్నవాళ్లు రోడ్డుమీద -గట్టిగా మాట్లాడుకుంటూ, చేతులతో పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తూ వెళ్తుంటే, ఇదంతా సెల్‌ఫోన్ సంభాషణ అని తెలియని అమాయకులు 'పాపం.. పిచ్చోడిలా ఉన్నాడు' అని సానుభూతి చూపడమూ కద్దు. ఈ సెల్‌ఫోన్లు సినిమాల్లో కామెడీ ట్రాక్‌లు (హాస్యం విడిగా రాసి, తీసి కలపడన్నమాట!) రాసేవాళ్లకి మంచిచేసే 'ప్రమాదమూ' ఉంది. ఉదాహరణకు ఒక చిత్రంలో ఋణదాత అప్పుతీసుకున్న వాణ్ణి చివాట్లు పెడుతూ వస్తుంటే, ''నేను ఊళ్లోలేను స్వామీ... రాగానే ఇచ్చేస్తానుగా అంటూ ఋణగ్రహీత సమాధానం చెబుతూ వస్తుంటే -ఇద్దరూ ఒకరి కొకరు ఎదురవుతారు!
ఇక టెలివిజన్ సీరియల్స్‌లో ప్రధానపాత్రధారులెవరైనా షూటింగ్స్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడినప్పుడు -తప్పనిసరిగా 'ఎపిసోడ్' టెలికాస్ట్‌కు అందించాల్సి వచ్చినప్పుడు -రచయిత, దర్శకులను ఈ టెలిఫోనే కాపాడుతుంది!
ఇవతల ఉన్న పాత్రధారి టెలిఫోన్ పట్టుకుని -తన 'గోడు' వెళ్లబోసుకుంటూ, అవతలి పాత్రధారి తరఫున జరిగే కథను తానే చెబుతుంటాడు. ''ఏమిటి... అనసూయ నిన్ను అంతమాట అందా. దాంతో నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా... దిలీప్ నువ్వేనా ఆమాట అంటున్నది. మనం టాంక్‌బండ్ మీద కూర్చుని, ఒకపక్కన హుసేన్‌సాగర్ కంపుకొడుతున్నా కూడా... భవిష్యత్తు గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం... ఎన్ని పథకాలు వేసుకున్నాం... అవన్నీ ఆ హుసేన్‌సాగర్‌లో కలిసిపోవలసిందేనా... అన్నట్లు ఆ రోజు జరిగిన సంగతి నీకు గుర్తుంది కదూ... (ఇది వరకు ప్రసారమైన ఒకటి రెండు సీన్లు ఫ్లాష్‌బ్యాక్‌లా మళ్లీ వేసేస్తే, మరికాస్త సమయం కలిసొస్తుంది!.. మరి మన ఆశలు, ఆశయాలు ఫలించాలంటే నువ్వు బ్రతికి తీరాలి దిలీప్... బ్రతికి తీరాలి...'' అని అలా ఆ 'ఏకపాత్రాభినయం' సాగుతూనే ఉంటుంది!
ఆ విధంగా గ్రాహంబెల్ గారి టెలిఫోన్ వల్ల ఆ తర్వాత సోదరుడిగా వచ్చిన సెల్‌ఫోన్ వల్ల ఈ ప్రపంచానికి ఎంతమంచి జరిగిందో, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వారివల్ల అంత చెడు కూడా జరుగుతోంది. సెల్‌ఫోన్‌లో ఇలా 'అధిక ప్రసంగం' చేస్తే తొందర్లోనే నరాలు దెబ్బతిని, తొందరగా చచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నా ఎవరూ వినడం లేదు! సెల్ ద్వారా 'హెల్'కు వెళ్దామనే వారి కోరిక కాబోలు!
మూగజీవాల పరిరక్షణలో ముద్దుగుమ్మలు
ఈ సంస్థ (ఎఐఐఎంఎస్) నిర్వహిస్తున్న పరిశోధన లపై తీసిన వీడియోను చేజిక్కించుకుంది. ఆవీడియోలో కోతులను ఏ విధంగా పరీక్ష లకు గురి చేసిందీ చూసి చకితురాలైంది. ఈ ఘోరమైన టెస్టులనుండి కోతులను మినహాయించాలని సంస్థ డైరెక్టర్ ఆర్.సి. దేశాయ్‌కు ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా సంస్థలో పరిశోధనలు మానవీయ కోణంలో జరగాలని మెడికల్ సర్వీస్ సంస్థకు సలహాలు ఇచ్చింది. ఇది వరకే జంతు పరి రక్షణ చట్టం 2011 ప్రకారం జంతువులను టెస్ట్‌లకు ఉపయో గించరాదని వుంది. ఆయా పరీక్షలలో అవి విపరీతమైన బాధకు, భయా నికి గురవుతాయని డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొ న్నారు. సంస్థలు నిర్వహించే పరీక్షలలో వాటికి ఎటువంటి బాధ కలుగకుండా శ్రద్ధవహించా లని, ఎప్పటికప్పుడు పరిశీల నకై, ప్రభుత్వేతర సంస్థలు, కేంద్ర జంతు ప్రదర్శన శాల, పశువుల వైద్యులను ఎంపిక చేసింది.
పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, జంతు వుల పరిశోధనలలో వాటికి తీవ్రమైన బాధ కల్గితే, ఆయా పరిశోధనలు జరిపేవారిపై తీవ్ర చర్యలుంటాయి. పామెలా ఆండర్సన్, ఆ వీడి యాలో కేవలం కోతులే కాకుండా కుందేళ్లు, చుంచులు, తదితర జం తువులను పరిశోధనలు చేసి, కొత్తమందు లను తయారు చేయనున్నారు. పామెలా, తక్షణమే ఆ పరిశో ధనలను నిలిపి వేయమన్నది.
కేంద్ర జంతువుల ఫెసిలిటీని ఆధుని కీకరించాలన్నది. అలాగే శిక్షణ పద్ధతులను మెరు గుపరచి, పరిశోధన లను మానవీయ కోణం లోనే చేయాలన్నది. హాలీ వుడ్ నటి భారతదేశంలోని మూగజీవాలపట్ల చూపి స్తున్న శ్రద్ధపట్ల, పలువురు మద్దతు అందిస్తున్నారు. పెటా సంస్థ, హాలీవుడ్ నటులకు మానవీయ థృక్కోణంపై ఆసక్తిని కల్పించడం ముదావహం.
పారిస్ హిల్టన్ నేస్తం బుల్లి వానరం
పారిస్ హిల్టన్‌కి మూగజీవాలంటే ఆసక్తి మెండు. ఈ మధ్య తన 30వ జన్మది నాన్ని ఉడుతలా వుండే బుల్లి వానరం తది తర వన్య జంతువులతో హాలీ వుడ్ హిల్స్‌లో ఘనంగా జరుపు కొంది. పెంపుడు జంతువుల ప్రదర్శ నశాలను తరచు సందర్శి స్తుంది. వాటి ఆరోగ్య పరిరక్షణ, ఆహారాన్ని సరిగా సమయా నికి అంద జేస్తున్నా రనే అంశా లపై శ్రద్ధ వహిస్తున్నది. పారిస్ హిల్టన్ తన జన్మదినం వేడుకలలో మూగ జీవాలకు కూడా ప్రాధాన్యత కల్పించటం పలువురిని ఆశ్చర్యపరిచింది.
కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.
కమలినీ ముఖర్జీకి చిన్నతనం నుంచీ నటనమీద ఆసక్తి ఏర్పడటంతో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల్లో నటించేది. ఎక్కువగా పురుష పాత్రలు పోషించేది. అందుకే థియేటర్ ఆర్ట్ కోర్స్ కూడా చేసింది. కవిత్వం రాయడం, పెయింటింగ్ చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆమె హాబీలు. భరత నాట్యం కూడా నేర్చుకుంది. నటిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు కవిత్వానికి సంబంధించిన ఓ వెబ్ సైట్‌తో ఆమె పొందుపరచిన థాట్స్, కన్ఫ్యూజన్, సాలిట్యూడ్ అనే టైటిల్స్‌తో రాసిన పద్యాలు వల్ల దలైలామా అధ్యక్షత వహించిన అమెరికాలోని వాషింగ్టన్ డిసి సభకి హాజరు కాగలిగింది. ముంబయిలో థియేటర్ ఆర్ట్ కోర్స్ చేసాక చాలా నాటకాల్లో నటించింది. అయితే ఈసారి స్త్రీ పాత్రలే పోషించింది. నీల్ కమల్, పారాచ్యూట్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఆయుష్ వంటి ప్రకటనలకు మోడలింగ్ చేసింది.
యాడ్ మోడల్‌గా ఆకట్టుకోవడంతో రేవతి దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం 'ఫిర్ మిలేంగీ' చిత్రంలో నటించగలిగింది. ఎయిడ్స్ ప్రధాన అంశంగా గల ఈ చిత్రంలో రేడియో జాకీగా ఆమె నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఆనంద్' లో నటించే అవకాశం లభించింది. 2004లో విడుదలైన ఈ చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డు స్వీకరించింది.
మీనాక్షి, స్టైల్, గోదావరి, క్లాస్‌మేట్స్, పెళ్ళయింది కానీ, హ్యేపీడేస్, గమ్యం, జల్సా, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి గోపిక గోదావరి, పోలీస్ పోలీస్, మా అన్నయ్య బంగారం, నాగవల్లి తెలుగు చిత్రాల్లో నటించింది. 'గోదావరి, హ్యాపీడేస్, గమ్యం, గోపి గోపిక గోదావరి చిత్రాల్లో చక్కన నటన ప్రదర్శించిందనే పేరు వచ్చింది. 'వెట్టయ్‌యాడు విలయ్ యాడు' తమిళ చిత్రంతో 2006లో తమిళరంగానికి పరిచయమై 'కాదలన్ సుమ్మ ఇల్లయ్' చిత్రంలో నటించింది. ఆ తరువాత తమిళంలో ఆఫర్లు రాలేదు. ఒక కన్నడ చిత్రం 'సావరి' చేసి ఊరుకుంది. మలయాళ చిత్రం కుట్టి ష్రాంకు చేసింది. మలయాళంలో ఆఫర్లు వస్తున్నా ఇంకా అంగీకరించని కమలినీ ముఖర్జీ తెలుగు చిత్రాల్లో మంచి నటిగా పేరొచ్చినా ప్రస్తుతం ఒక చిత్రంలోనే చేస్తూ ఇంకా అవకాశాలు ఎందుకు రావట్లేదా అనే ఆలోచనల్లో పడింది. కోల్‌కతాలో 1984లో జన్మించిన కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.