26, నవంబర్ 2010, శుక్రవారం
2011లో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల సెలవులివే..
అవి..
మకర సంక్రాంతి-జనవరి 14 (శుక్రవారం),
రిపబ్లిక్ డే-జనవరి 26 (బుధవారం),
మిలాద్-ఉన్-నబి-ఫిబ్రవరి 16 (బుధవారం),
ఉగాది-ఏప్రిల్ 04 (సోమవారం),
మహావీర్ జయంతి-ఏప్రిల్ 16 (శనివారం),
గుడ్‌ఫ్రైడే-ఏప్రిల్ 22 (శుక్రవారం),
బుద్దపూర్ణిమ-మే 17 (మంగళవారం),
స్వాతంత్ర దినోత్సవం-ఆగస్టు 15 (సోమవారం),
ఈద్ ఉల్ ఫితర్-ఆగస్టు 31(బుధవారం),
వినాయక చవితి-సెప్టెంబర్ 01(గురువారం),
గాంధీ జయంతి-అక్టోబర్ 02(ఆదివారం),
దసరా-అక్టోబర్ 06 (గురువారం),
దీపావళి-అక్టోబర్ 26 (బుధవారం),
బక్రీద్-నవంబర్ 07 (సోమవారం),
గురునానక్ జయంతి- నవంబర్ 10 (గురువారం),
మొహర్రం-డిసెంబర్ 06 (మంగళవారం),
క్రిస్మస్- డిసెంబర్ 25(ఆదివారం).
23, నవంబర్ 2010, మంగళవారం
7న ఒంగోలులో సమైక్యాంధ్ర గర్జన
తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు సమయం ఆసన్నమైందన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలన్నారు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ శ్యా మ్యూల్ ..
కొంత మంది వేర్పాటువాదులు ఉస్మాని యా యూనివర్సిటీని అడ్డంపెటు ్టకొని కొంత మంది ని వాడు కుంటున్నారని, వారికి నెలవారీ జీతాలు కూడా చెల్లిస్తున్నారని,,ప్రజలను భయభ్రాంతులకు గురిచ్చెస్తున్నారని ఆరో పించారు.
బాలల వారోత్సవాల పేరిట కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అవుతు.... ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరక పోగా కార్ఖాణాలలో బాలలు మగ్గిపోతూనే వున్నారు.
అనేక మంది బాల కార్మికులను గుర్తించి స్కూల్స్‌లో చేర్పించామని సంబంధితులు లెక్కలు చెపుతున్నా.. ఇవన్నీ కాకి లెక్కలు అన్నది ప్రభుత్వానికీ తెలిసిన నిజం అనడంలో స౦దేహం లేదేవ్వరికీ,,
రోశయ్య ప్రభుత్వంలో అవినీతి పాలన
50 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్నారు. అలాంటి పార్టీతో కేసీఆర్ కుమ్ముకై మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు.
తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు సోనియాతో ఒత్తిడి చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే దుష్పప్రచారం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
సాక్షిని చదువొద్దు..చూడొద్దు...
కాంగ్రెస్ కార్యకర్తలు సాక్షి చానల్‌ను, పేపర్‌ను తమవాటిగా భావిస్తూ అభివృద్ధి చేశారని, అలాంటి ది అదే చానల్ కాంగ్రెస్ పార్టీ అధినేత ను అగౌరవపరుస్తూ తప్పుడు కథనాలను ప్రసారం చేసినందుకు నిరసనగా సాక్షి దినపత్రికలను దహనం చేయడం జరిగిందన్నారు.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై దొంగ క్లిప్పింగ్‌లను చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి చెంది ఆ పార్టీకే నామాలు పెట్టడం అంటే తి న్నింటి వాసాలు లెక్కించినట్టేనని వి మర్శించారు.
పోల వరం డిజైన్ మార్పు సాధ్యం కాదు
30 ఏళ్ళ కిందట అప్పటి ముఖ్యమం త్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అదే డిజైన్‌తో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో తిరిగి శంకు స్థాపన చేసి వేలాది కోట్ల రూపా యలు ఖర్చుపెట్టారని ఆ ప్లాన్ మేరకు కుడి, ఎడమ కాలువలు తవ్వారని అన్నారు. ఈ పరిస్థితుత్లో డిజైన్ మార్పు సాధ్యం కాదని.. మారిస్తే తాగునీరు, సాగునీరు కు తీవ్ర కొరత ఏర్పడుతుందని యర్రా స్పష్టం చేశారు.
19, నవంబర్ 2010, శుక్రవారం
రేపు సీమాంధ్ర బంద్
తెలంగాణ వాదుల ఒత్తిడికి తలొగ్గి ఎస్ఐ రాతపరీక్షలు వాయిదా వేయడం రాష్ట్ర ప్రభుత్వ నైతిక ఓటమికి నిదర్శనమని...ప్రభుత్వ చేతగాని తనంతోనే ఈ నిర్ణయం తీసుకుందని, దీన్ని వెంటనే వెనక్కి తీసుకుని యథావిధిగా పరీక్ష జరిగేలా చూడాలని సీమాంధ్ర జేఏసీ డిమాండ్ చేసింది.
ఎంతో మంది నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలపై ప్రభుత్వం నిళ్లుజల్లడం అన్యాయమని ..వేర్పాటువాదులు చేసే ఉద్యమానికి లొంగిపోయి నిరుద్యుగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. సీఎం రోశయ్యను తక్షణం పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు
ఇది వాయదాల ప్రభుత్వం
ఎన్టీఆర్ భవన్'లో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లా డుతూ ఎస్ఐ పోటీ పరీక్షను వాయిదా వేసి, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు.
ఈ ప్రభుత్వంలో ఏ సమస్యలూ పరిష్కారం కావని ... వాయదాల పద్దతే దేనికైనా ... అన్న తరహాలో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు ఎర్రన్న...
సోనియా గాంధీ ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలి
సాక్షాత్తు కేంద్ర మంత్రులు,రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి తెలిసే కుంభకోణాలు జరుగుతున్నాయని.... సోనియా గాంధీ, సీఎం రోశయ్య ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
సినీ నటి జమునకు కనకాభిషేకం
ఈసందర్భంగా అతిథిగా విచ్చేస్తున్న అలనాటి ప్రఖ్యాత సినీ నటి జమునకు కనకాభిషేకం చేస్తునామని.. అలగీ నటించిన సినిమాల్లోని సన్నివేశాలను స్థానిక కళాకారులచే ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర రైల్వే పోలీసు పటిష్టంకి 836 పోస్టులు
అవగాహన లేకనే 'హర్ష' అలాఅన్నాడు
రాక్‌ఫిల్ డ్యామ్‌పై అవగాహన లేకపోవడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో డిజైన్ మార్చాలని ప్రతిపాదిస్తున్న అమలాపురం ఎంపీ హర్షకుమార్కు పూర్తి అవగాహన లేదని డిజైన్ మార్పు జరిగితే తాము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు
తెలంగాణ బీసీలకు ఏ పదవులు ఇస్తారో చెప్పండి...
బీసీ ఐక్య సంఘర్ష ణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వెల్ది చక్రధర్.. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎస్సీలకు ముఖ్యమంత్రి, ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కేసీఆర్ అంటున్నారని, 55శాతం బీసీలకు ఏ పదవులు ఇస్తారో తేల్చి చెప్పాలని అన్నారు..కేసీఆర్ మొదటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మభ్యపెడుతూ రాజకీయంగా పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు.
పోలిసుల పహరా నడుమ ఓయూ
కాగా ఓయూ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎనిమిది కంపెనీల బలగాలు పహరా కాస్తున్నాయి.
పోలవరంపై ఉన్న శ్రద్ధ..ఫ్రీ జోన్ పై ఏదీ?
హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించి, తెలంగాణ యువత ఉద్యోగాలను కొళ్లగొట్టే యత్నాలను తిప్పికొడతామన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య పోలవరం ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధ 14(ఎఫ్) క్లాజ్ తొలగింపుపై చూపడం లేదని ఆయన విమర్శించారు.
18, నవంబర్ 2010, గురువారం
22న కాంట్రాక్ట్ లెక్చరర్స్ ‘చలో హైదరాబాద్’
ఇప్పటికే ఇందుకు సంభందించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని... ఉద్యోగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండుతో ఈ నెల 22న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు చెప్పారు
ప్రధానిని ఉత్సవ విగ్రహంగా మలిచి.... దోచుకు తింటున్నారు
రాష్ర్టంలోను, కేంద్రంలోను అసమర్థ ప్రభుత్వం కొనసాగుతోందని, కుంభకోణాల పరంపరను కొనసాగిస్తోందని కాంగ్రెస్ హయాంలో బయటపడిన ఎమ్మార్, మైనింగ్, సెజ్ కుంభకోణాలపై ఆ పార్టీ నాయకులే విమర్శలు గుప్పించడం సిగ్గుచేటన్నారు. క్రీడలతో సహా అన్ని రంగాల్లో కుంభకోణాల పరంపర కొనసాగుతుందన్నారు. తాజాగా 2జీ స్పెక్ట్రమ్‌లో రూ.173 కోట్ల కుంభకోణం వెలుగు చూసిందని కాగ్ నివేదిక స్పష్టం చేసినా చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
కుంభ కోణాలను ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత విమర్శలకు దిగడం కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు..
డైరెక్టర్ శంకర్ పై మండిపడుతున్న ప్రిన్స్ మహేష్
కేవలం మహేష్, ఇలియానా తప్ప తెలుగు వెర్షన్ లోనూ తెలుగు నటులుండరట. మహేష్ పార్ట్ ఒక్కటీ తెలుగు కోసం రీషూట్ చేస్తారట. ఇది మహేష్ కి అస్సలు నచ్చట్లేదట.ఇలాగైతే ఈ చిత్రంలో నటించనని నిర్మాతలని బెదిరిస్తున్నాడట. ఇంతదాకా వచ్చాక మళ్లీ సినిమా మొదటికొస్తుందేమోనని నిర్మాతలు హడలిపోతున్నారు.
తెలుగు నటులకి కూడా సమప్రాధాన్యమివ్వాలని శంకర్ కి సూచిస్తున్నారు. ఈ సినిమా వరకు శంకర్ దే ఫైనల్ డెసిషన్ కాబట్టి మహేష్ బాధని అతను అర్థం చేసుకుంటాడో లేక చేస్తే చెయ్, లేకపోతే పో అంటాడో చూడాలి.
జెనీలియాని చూసి భయపడ్డ :రామ్ చరణ్
ఇంకా చెప్పాలంటే ఆడియో గురించి ప్రత్యేకంగా చెప్సాలి. వెంకటేష్ గారు యాక్ట్ చేసిన ‘ఘర్షణ’ చిత్రానికి సంగీతమందించిన హ్యారీస్ జైరాజ్ అంటే నాకెంతో అభిమానం. ఆయనతో ఒక సినిమా అయినా చేయాలనే నా కోరిన ‘ఆరెంజ్’ తో తీరింది. ఈ సినిమాకి ఆయన ఆరు అద్భుతమైన పాటలు ఇచ్చారు. అందుకు హ్యారిస్ కి థ్యాంక్స్ చెబుతున్నాను అన్నాడు. భవిష్యత్తులో కూడా ఆయనతో కలిపి మరిన్ని సినిమాలు చేస్తాను.
కృష్ణా జిల్లా యువ పారిశ్రామికవేత్తతొబాలకృష్ణ రెండో కూతురు పెళ్లి?
దాసరి నారాయణ రావు దర్శకత్వం వహిస్తున్న పరమవీర చక్ర సినిమా షూటింగులో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. చాలా రిస్కీ షాట్స్ కూడా బాలయ్య చేస్తున్నాడని దాసరి నారాయణ రావు చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో షూటింగ్ జరుగుతోంది. ఇదే సమయంలో సమాచారం.
హైదరాబాదును ఫ్రీజోన్ గా చేసిందుకు కుట్ర
తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయలేని హోంమంత్రి సబితారెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఫ్రీజోన్, తెలంగాణ అంశాలపై కలిసి రావాలన్నారు. లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం అనుకుంటే ఆ పరీక్షలు ఎంత మాత్రం జరగనివ్వమన్నారు. మాకు తెలంగాణ ఎంత ముఖ్యమో హైదరాబాదు కూడా అంతే ముఖ్యమని హరీష్ రావు అన్నారు .
మెదక్ జిల్లా పేరు ఇందిరమ్మగా మరుస్తారట
కాంగ్రెస్‌లాంటి త్యాగాల పార్టీ ప్రపంచంలోనే మరొకటి లేదని ... కాంగ్రెస్‌కు యువతే బలమని..కాంగ్రెస్ బలహీనపడితే దేశం బలహీనపడుతుందnnaru. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరమ్మ పేరు మెదక్ జిల్లాకు పెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని సీఎం రోశయ్య వెల్లడించారు.
అత్త 369 మందిని బలి తీసుకుంటే..కోడలు 400 మందిని బలి తీసుకొంది
ఓ వైపు తెలంగాణ అంశంపై విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బిల్లు కోసం ప్రయత్నించాల్సిన నేతలు ఓదార్పు పేరిట లక్ష రూపాయలు ఇచ్చి వారి త్యాగాలను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే బిజెపి తలా ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఎవరు చస్తారో ముందుకు రావాలని ఘాటుగా వ్యాఖ్యానించారు..
కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్లమెంటు బిల్లు పెట్టి రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని ... కాంగ్రెస్ బిల్లు ప్రవేశపెడితే ఇతర పార్టీలతో నిమిత్తం లేకుండా 165 మంది సభ్యులు బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
గోదావరి ఒడ్డున ఏక శిలతో....అయ్యప్పస్వామి దేవాలయం
పంపానదిలో స్నాన మాచరించినట్టే ఇక్కడ గోదావరిలో స్నానం చేసేందుకు వీలుగా నది ఒడ్డునే ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్ర హం తయారీకి 3.5 కిలోల బంగారం, 25 కిలోల వెండిని 21 అంగుళాల ఎత్తుతో .. కోటి రూపాయలతో తయారు చేయిస్తున్నారు..
ఆలయంలో వినాయకుడు, లక్ష్మి, ఆంజనేయస్వామి, సరస్వతి, సాయినాథుడు, దత్తాత్రేయ తదితర విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యం కోసం అయ్యప్ప ఘాట్‌ను కూడా నిర్మిస్తారు
ఆర్ నారాయణ మూర్తి.. పోరు .... ఆత్మహత్యలొద్దు బిడ్డ
నూతన చిత్రం 'పోరు' తాను స్వీయ దర్శకత్వం వహించే నూతన చిత్రాన్ని ఆర్ నారాయణమూర్తి ప్రకటించారు. పోరు అనే టైటిల్‌కు ఆత్మహత్యలొద్దు బిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రాన్ని జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందన్నారు.
17, నవంబర్ 2010, బుధవారం
తెహల్కాకు ఐపిఐ అవార్డు
మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎఎస్ ఆనంద్ నేతృత్వంలోని ఈ అవార్డు ఎంపిక జూరీలో హిందూ పత్రిక సంపాదకుడు ఎన్ రవి, మళయాళ మనోరమ మేనేజింగ్ ఎడిటర్ ఫిలిప్ మాథ్యూ, పిటిఐ ప్రధాన సంపాదకుడు ఎంకె రజ్దాన్, బిజినెస్ స్టాండర్డ్ పత్రిక సంపాదకుడు టిఎన్ నైనన్ సభ్యులుగా వున్నారు. ఈ అవార్డును వచ్చే నెలలో న్యూఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో అందజేయనున్నారు.
బిగ్‌బాస్, రాఖీ లపై కేంద్రం ఆగ్రహం
ఇటీవల రాఖీ ఇన్సాఫ్ కార్యక్రమంలో రాఖీసావంత్ ఓ పార్టీసిపేంట్ను నపుంసకుడు అని తిట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే... అలాగే ఎస్ ఎస్ మ్యూజిక్ టివి ప్రసారలపైనా వారం రోజులు బాన్ విధించిది
వాటర్ ట్యాంక్ ఎక్కిన విద్యార్థులు
ఇదిలా ఉండగా...ఇదే అంశంపై పలువురు తెలంగాణ వాదులతో సమావేశమయి చర్చించారు. పరీక్ష వాయిదాపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సబిత వెల్లడించారు. అన్ని విషయాలు సిఎంతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కరుణానిధి చేతుల మీదుగా "జెమిని" జీవిత చరిత్ర
నవంబర్ 21 తేదిన ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా జెమిని గణేషన్ జీవిత చరిత్రను పుస్తకాన్ని
ఆవిష్కరిస్తుండగా... తొలి ప్రతిని ప్రముఖ సినీ రచయితలు వాలీ, వైరముత్తులు అందుకోనున్నారు. అలాగే
జెమిని తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు అందించిన సేవల్ని పొందు పరిచిన డీవీడీ తొలి కాపీని ప్రముఖ దర్శకుడు బాలచందర్ స్వీకరించనున్నారు.
తమిళ, తెలుగు, హిందీ, మళయాళ, కన్నడ భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించిన జెమినీ మార్చి 22, 2005 సంవత్సరంలో కన్నుమూసిన విషయం విదితమే
23వ తేదీలోగా ఓటరుగా నమోదు కండి
రాష్ట్రవ్యాప్తంగా ఓట్లు నమోదు కార్యక్రమం జోరుగా సాగుతుందన్నారు. ఫారం-6ను పూర్తి చేసి ఫొటోలతో కొత్త ఓటుకు దరఖా స్తు చేసుకోవాలన్నారు. గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన వారు పేర్లను తొలగి స్తారని అన్నారు. ఓటర్లు జాబితాలో పేర్లు ఉండి ఫొటోలు లేకపోయిన, ఫొటోలు ఉండి పేర్లు లేకపోయినా? నమోదు చేసుకోవచ్చని... పేర్లు నమోదు సరిచేసుకునేందుకు ఫారం-8ను పూర్తి చేసి అధించాలన్నారు.
పోలవరంతో గోదావరి జిల్లాలకు ప్రమాదం
రెండు లక్షల మంది గిరిజనులు ఈ ప్రాజెక్టు ముంపుతో నిర్వాసితులవుతున్నారని.. వారందరికీ మె రుగైన పునరావాసం కల్పించాలంటూ హర్షకుమార్ డిమాండ్ చేయటం.. చర్చకు తెరలేపడమీ కాక... పోలవరానికి ప్రస్తుతం తలపెట్టిన నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు ఉన్నావాటిపై దృష్టి సారించలేదని ...ప్రస్తుత డిజైన్ మార్చి నిర్మాణం చేపట్టకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించ డం చర్చనీయంసమవుతొన్ది .
బాబు పర్యటనకు అడ్డొస్తే సహించం
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని, పార్లమెంటులో ఒక్కసారి కూడా తెలంగాణ అంశం ప్రస్తావించలేదని ..
తెలంగాణ ఎవరి జాగీరు కాదని, నాలుగు కోట్ల ప్రజల సొంతమని అన్నారు..
ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని... రోశయ్య సిఎం గా పదవిలోకి వచ్చి ఏడాది అయినా.. పాలనపై పట్టు లేదని ఎంపీ రాథోడ్ రమేశ్ విమర్శించారు.
యడ్యూరప్పని కొనసాగాలా? వద్దా?
అవినీతి ప్రకరణలకు సంబంధించి కేంద్రంలో బీజేపీ దుమ్మెత్తి పోస్తూ, కర్ణాటకలోని అవినీతిపై మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చింది
భూ కుంభకోణాలు, ఇతర అవినీతి ఆరోపణల్లో కూరుకున్న యడ్యూరప్ప ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన పార్టీ హై కమాండ్ పంపే కమిటీ ప్రత్యేకంగా శాసనసభ్యులను కలసి రాష్ట్రంలో యడ్యూరప్ప నాయకత్వం కొనసాగాలా? వద్దా? అనే అంశాన్ని గురించి అభిప్రాయాలను సేకరించనున్నారు
16, నవంబర్ 2010, మంగళవారం
ఫ్రీజోన్ తేల్చే వరకు పరీక్షలు ఆపండి
తమ సోదరుల ఉద్యోగాలు వేరొకరు ఆక్రమించు కొంటున్నారని తెలంగాణలోని లక్షలాదిమంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ఫ్రీజోన్ అంశంపై సిఎం మాట్లాడకపోవడం బాధాకరమని కేసీఆర్ అన్నారు.
15 రోజుల్లోగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని ఏదంటే తమ సత్తా చూపించేందుకు యావత్ తెలంగాణా రాష్ట్ర యువత సిద్దంగా ఉందన్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నవరత్న అవార్డు
‘నవరత్న’ హోదాతో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశంతో పాటు పలు ప్రయోజనాలు ఉంటాయి.
కేసీఆర్‌ని రాళ్లతో కొట్టి తరమటం ఖాయం
టీడీపీ ని దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని, వాటిని కార్యకర్తలు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని ..కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని అధినేత చంద్రబాబు చెబుతున్న మాట కేసీఆర్, కేకేల భేటీతో నిజమైందన్నారు.
తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ కుటుంబం తమ జాగీరుగా భావిస్తోందని అలాంటి ఆటలు ఇక ముందు సాగనివ్వమని... తెలంగాణ కోసం దేశం కార్యకర్తలు గళం వి ప్పి ఉద్యమిస్తారని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కి వినతి ఇస్తా..
పోలీస్ ఉత్తర్వులను అతిక్రమించి ధర్నా చేస్తుంటే.. ముఖ్యమంత్రి పక్కన ఉన్నవారందరిని పోలీసులు అరెస్టు చేశారని, రోశయ్యకు ఎందుకు అరెస్టు చేయలేదని దీనిపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 9న ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉండే ఎన్డీఏ సభ్యులంతా కలిసి జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ కోసం ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణాకోసం తెగించి పోరాడేందుకు సిద్ధం కావాలి
ఆంధ్ర వలస పాలనలో తెలంగాణ ప్రాంతం అన్నివిధాలా వివక్షకు గురైందని ...తెలంగా ణ ప్రాంతానికి ఆడుగడుగున అన్యా యం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ పార్టీలను తెలంగాణ నాయకులు వీడి ఉ ద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు..
కేంద్రం ఇచేసిన తెలంగాణాని ఆంధ్ర పాలకులు కుమ్ముక్కై మూకుమ్మడి రాజీనామాలు చేసి అడ్డుకోన్నారని అందువల్లే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైందని ...శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణాకు అనుకూలంగా లేకపోతే తెగించి పోరాడేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చా రు
తూలుతూ... కాసులు కురిపిస్తున్న దాబాలు
దాబాల్లో మద్యం విక్రయాలు చేయవద్దు. అక్రమ సిట్టింగులకు ఎలాంటి అనుమతి లేదు. అని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నా దాడులు చేసిన సందర్భాలు అరుదే.. దీంతో లారీ డ్రైవర్లు మద్యం తాగుతూ వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు..
రాజకీయ ఒత్తిళ్లు.. దాబాల నిర్వాహకులు ఎక్సైజ్ సి బ్బందికి నెలనెలా మామూళ్లు పం పడం వల్లే వారు చూసీచూడనట్లు వ్య వహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులకు లొంగని వాళ్లను రాజకీయ ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని పేరు చె ప్పేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఎందుకు నోరు విప్పరు
ఆంధ్రలో అవినీతిలో కూరుకు పో యిన కళింకిత మంత్రులపై కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.
మొహిలీతో ఆంధ్రా ప్రాంతానికి అన్యాయం ఖాయం
శ్రీకృష్ణ కమిటీలో జలవనరుల అంశం కోసం నియమించిన సీడబ్ల్యూసీ సభ్యుడు ఏడీ మొహిలీ గోదావరి జలాలపై ఏక పక్షంగా తెలంగాణకు అనుకూలంగా నివేదించబోతున్నారని ... అందులో భాగంగానే తమ వాదనల్ని అసంతృప్తిగానే విన్నారని చెప్పారు.
పోలవరం, ద మ్ముగూడెం ప్రాజెక్ట్‌లు తెలంగాణ, ఆం ధ్రాలకు ఉపయోగపడతాయని చెప్పినపుడు సైతం దమ్ముగుడెం తెలంగాణకు ఉపయోగపడదని ఆయన ప్రకటించడం ఆందోళన కలిగిస్తుంది. పోలవరం నిర్మిస్తే హైడల్ ప్రాజెక్ట్ ప్రయోజనం కలుగుతుందని చెప్పినపుడు సీలేరు, మాచ్‌కండ్ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ సరిపోతుందిలే అని చెప్పిన మొహిలీ మాటలు ఆంధ్రా ప్రాంతానికి అ న్యాయం చేసే విషయం అర్ధమవుతుందని శ్రీనివాస్ తెలిపారు.
కర్రీ తో ...వర్రీ.. బోలెడు
వారాంతపు సంతలో కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలను చూపించాయి. కూర వండుకునే పరిస్థితి కనిపించకపోవడంతో...ఇంటిలో తయారు చేసుకు న్న కూరకంటే కర్రీ పాయింట్ నుంచి కొనుగోలు చేసిన కూరకే తక్కువ ఖర్చు అవుతుం డటంతో కర్రీ పాయింట్లకు డిమాండ్ పెరిగింది. కర్రీ పాయింట్ల నుంచి రూ.5లు సాంబారు, రూ.10లు కూర కొనుగోలు చేసుకుని పూట గడిచింది అనిపిస్తున్నారు.
ఏ. రాజా రాజీనామాకు రాష్టప్రతి ఆమోదం
నిన్నటి వరకు రాజా నిర్వహించిన కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖను అదనపు శాఖగామానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్‌కు కేటాయించారు.
ఓ మంత్రి రూ.15 కోట్లు లంచం అడిగాడు
'21వ శతాబ్దంలో భారత్: అవకాశాలు, సవాళ్లు' అనే అంశంపై జరిగిన చర్చలో టాటా మాట్లాడుతూ "భారత్‌లో దేశీ విమానయాన సర్వీసును ప్రారంభించాలని భావించా. ఇందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాను. వైమానిక రంగంలోకి ప్రవేశించాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని, 1995, 1997, 2001 సంవత్సరాల్లో మూడుసార్లు సంబంధిత ఫైల్‌ను కదిపానని.. మూడు ప్రభుత్వాల హయాంలో ముగ్గురు ప్రధాన మంత్రులను కలిశాం. కానీ, మంత్రి రూ.15 కోట్లు ఇవ్వాలని మా ప్రయత్నాలన్నిటినీ అడ్డుకున్నారు. అందుకే మేం వైమానిక రంగంలోకి అడుగు పెట్టలేకపోయాం. రూ.15 కోట్లు లంచం ఇచ్చి దేశీ వైమానిక రంగాన్ని ప్రారంభించానని అనుకుంటే నేను నిద్రపోలేను'' అని ఆయన వివరించారు.
అయితే, ఆ మంత్రి ఎవరన్న విషయాన్ని మాత్రం రతన్ టాటా బయటపెట్టలేదు.
15, నవంబర్ 2010, సోమవారం
మరోసారి సురేఖ లేఖాస్త్రం
పిసిసి అధ్యక్షులు ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిజామాబాద్ ఎంపి మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోని పిసిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమీ తప్పు చేయకున్నా ఆయన సభ్యత్వాన్ని ఎలా తీసివేస్తారని ... దివంగత రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఉండడమే చెవిరెడ్డి చేసిన తప్పిదమా అని ప్రశ్నించారు
పిసిసి కి ప్రభుత్వానికి ఏమాత్రం సయోధ్యలేదని, ఉంటే గవర్నర్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులే వినతి పత్రం సమర్పిస్తే వారిని పిలిపించి విచారించిన దాఖలాలు లేవని, పిసిసి కానీ, ప్రభుత్వం కానీ వారి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్దం కావడంలేదన్నారు.
ఇప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక కమిటీని నియమించి వాస్తవాలు తెలుసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ పై ద్రుష్టి పెట్టాలని తన లేఖలో సురేఖ కోరారు.
తెలంగాణావాదినంటూనే సమైక్యవాదిగా ....
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అడుగడుగునా తెలంగాణాకు ద్రోహం చేశారని, ఆయన శిష్యుడిగా వ్యవహరిస్తున్న మంత్రి వెంకట్‌రెడ్డి...వైఎస్ మరణానంతరం మంత్రి పదవి ఎక్కడ ఊడుతుందోన ని తెలంగాణ నినాదాన్ని పక్కనబెట్టి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పంచన చేరారని ఆరోపించారు.
డిసెంబర్ 31 తర్వాత తెలంగాణకు జైకొట్టకపోతే మంత్రిని జిల్లాలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.
దేహం ముక్కలైనా దేశం ముక్కలు కానీయం
సాధారణ ప్రజలకు విద్యావ్యవస్థ షాపింగ్‌మాల్‌లా తయారైందని,.. కేంద్రం మంత్రి కపిల్ సిబాల్ ప్రవేశ పెట్టే పథకాలు ఆందోళన కలిగిస్తున్నా యని, ప్రైమరీ విద్య కూడా ప్రై వేటీకరణ అయిపోయిందన్నారు. ఎస్ ఎఫ్ఐ విద్యావిధానం, అ«ధ్యయనం, పోరాటం అనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎంఫిల్/ పీహెచ్డీ ప్రవేశాలకు 12న రాత పరీక్ష
ఫుల్‌టైమ్ పిీహెచ్‌డీ ప్రవేశాలకు రాత పరీక్ష తప్పనిసరనే యూజీసీ నిబంధనలను అమల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. ఫుల్‌టైం ఎంఫిల్, పిీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తుచేసే అభ్యర్థులకు వీలైనంత త్వరగా హాల్‌టిక్కెట్లు పంపిణీ చేయాలని ఉపకులపతి ఆదేశించారు.
ఒకే రోజు సైన్స్, ఆర్ట్స్ కోర్సులకు రాత పరీక్ష నిర్వహించి, తరువాత మౌఖిక పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నారు.
జై రోశయ్య అంటూ.. రూటు మార్చిన కొణతాల...
వైఎస్ జగన్‌కే మద్దతు తెలుపుతున్నట్టు ఇప్పటి వరకు కనిపిస్తూ వస్తున్న కొణతాల ఇప్పుడు బాణీ ఎందుకు మార్చారు? ఎంపీ సబ్బం హరికి జగన్ అధికంగా ప్రాధాన్యం ఇస్తుండడం వల్లనే కొణతాల రూట్ మార్చారా? లేక మరేదైనా కారణం వున్నదా? అన్న విషయాలపై చర్చ జరుగుతున్నది.
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ
అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ అంశంపై నాటకాలు చేస్తున్నాయని, ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, ఒక వేళ తెలంగాణ ఇవ్వకుంటే నాయకులు పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని చేపడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యాం ధ్ర ప్రదేశ్‌గా మారుస్తుందని, టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారని, టీడీపీ హయాంలో మద్యపాన నిషేధంపై ఎక్కువగా మాట్లాడిన రోశయ్య ప్రస్తుతం మద్యం అమ్మకాలపై దృష్టి సారించడం దారుణమని ప్రొహిబిషన్ అన్నమాటకు అర్థం ఏంటో ప్రభుత్వమే చెప్పాలని ఆమె అన్నారు.
సామ్రాజ్యవాద విష సంస్కృతి విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ సినిమాలు, పబ్‌లు, బార్లు తెరువడంవల్ల యువతపై ప్రభా వం పడనుందన్నారు.
14, నవంబర్ 2010, ఆదివారం
ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకోవడం భ్రమే
600 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే 6 లక్షల మంది హాజరవుతున్న ఈ రోజుల్లో కొత్త ఉద్యోగాలు ఎలా కల్పించగలరని రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితి కన్నా చిన్నదైతే అభివృద్ధి కుంటు పడుతుందని, చిన్న రాష్ట్రాల కన్నా పెద్ద రాష్ట్రాల వల్లనే లాభాలు ఎక్కువ అని ఆయన అన్నారు.
వైఎస్‌ను తెలంగాణ ద్రోహిగా పరిగనిస్తున్నాం
వైఎస్‌కు మొదటి అభిమాని తానేనని, తెలంగాణ ఏర్పడితే పాస్‌పోర్టు అడుగుతారని ప్రకటించినప్పటి నుంచి వైఎస్‌ను ద్రోహిగా భావించామన్నారు. త్యాగధనుల సభలో వైఎస్ చిత్రపటం పెట్టొద్దని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా సమష్టిగా నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాజా.. రాజీనామా
ఈ కుంభకోణంపై కాగ్ నివేదిక నేపథ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లో పదవీ నుంచి దిగిపోనని చెప్పిన ఆయన... గత కొంతకాలంగా తనను కలవరపెడుతున్న వివాదాలను నివారించేందుకు ...పార్లమెంటులో శాంతి, సామరస్యాలను నెలకొల్పడానికి రాజీనామా చేయమని డీఎంకే అధినేత కరుణానిధీ తనకు చెప్పినట్లు రాజా తెలిపారు
కుంభకోణంపై రాజాపై వేటు వేయాలని భగ్గుమన్న విపక్షాలు.. శీతకాల సమావేశాలలో రభసా సృష్టిస్తున్నాయి.
బాబూ...ఓ ఐదేళ్ల పాటు రాజకీయ సన్యాసం పుచ్చుకో
టిడిపి అధ్యక్ష పదవిని ఎన్టిఆర్ కుటుంబ సభ్యులకు అప్పగించి, ఐదేళ్లు రాజకీయ సన్యా సం పుచ్చుకుంటే కాంగ్రెస్ సర్కారు ఈ రాష్ట్రాన్ని సంతోషాంద్రప్రదే శ్‌గా మారుస్తుందని ఎంఎల్ఏ కొట్రికె చెప్పారు.
బంగారం ధర పైపైకి ... దెబ్బతింటున్న జీవితాలు
పెళ్ళిళ్ళ సీజన్, కార్తీక మాసం మొదలైనా... ప్రకృతి వైపరీత్యాలతోపాటు, ధరలు కూడా అమాంతం పెరగడంతో కొనుగోళ్ళు తగ్గిపోయాయని...దీని ప్రభావం వల్ల బంగారం పనులపైనే నడిచే వర్క్‌షాపులపైన, ఇతర సిబ్బందిపైన తీవ్రంగా ఉంటుందని.. కనీస రోజువారి కూలి డబ్బు కూడా రాని పరిస్తితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.
నిషేదిత ప్రాంతంలో ఎలాధర్నా చేసారు... రోసయ్యకి ప్రతిభ సూటి ప్రశ్న
సోనియాగాంధీ ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి రోశయ్య ధర్నాలో పాల్గొన్నారని పోలీసులు ఆ యనను అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.
అదుర్స్ నిర్మాత ..తనపై తానే హత్యాయత్నం చేయించుకునే అవకాశం ఉంది
తన ను హత్య చేసేందుకు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, అనంతపురానికి చెందిన మద్దెల చెరువు సూరి ప్రయత్నిస్తున్నారని ..వీరికి సీపీ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు పరోక్షంగా సహకరిస్తున్నట్లు వంశీ ఆరోపణలు కలకలం సృష్టించాయి.
అయితే ఆ ఆరోపణలు సీపీ ఖండించారు. ఆయ న ప్రాణానికి నగర కమిషరేట్ పరిధి లో ఎలాంటి హానిలేదని .. నగరంలో నెహ్రూ, బాజీ నుంచి ఎలాంటి ఆపదారాదని తెలిపారు. గన్ మన్ కోసం వంశీ స్వయంగా తనపై తానే హత్యాయత్నం చేయించుకునే అవకాశం ఉందని వంశీపైనే సీపీ ప్రత్యారోపణ చేయడం తో గన్‌మన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
కాం గ్రెస్ అధికారంలో ఉన్న రాష్టాలలో వేలకోట్ల అవినీతి
జలయజ్ఞంలో ఇప్ప టి వరకు రూ. 60వేలకోట్లు ఖర్చుచేయగా దీంతో రూ. 20వేల కోట్లు కమీషన్ల పేరిట కాంగ్రెస్ నేతలు దండుకున్నారని... అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట లక్షకోట్లు దోచుకున్నవైఎస్.రాజశేఖర్‌రెడ్డి ర్రాష్టాన్ని సర్వనాశనం విధాల చేసాడని ఆరోపించారు.
కేసీఆర్ విధానాల మూలంగానే బలిదానాలు జరిగాయని వీటికి ఆయన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఓ మాయల ఫకిరు
కేసీఆర్ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాడని .... కేసీఆర్‌ను పావుగా వాడుకొని టీడీపీని భూస్థాపితం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్ ఓ మాయల ఫకీరని అతన్ని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు
వనభోజనాలకు కొత్త భాష్యం
నగరాలు, పట్టణాలలో అపార్టుమెంట్ అంతరాలను చెరిపేసి వారాంతపు వినోదానికి వనభోజనాలు మంచి వేదికలవుతున్నాయి. తరతమ బేధం లేకుండా భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులు కలిగిన వారందరినీ ఒక్కచోటికి చేర్చి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఆత్మీయతను పెంచుతున్నాయి.
గతంలో 'పులిహోర, పూర్ణాలు మేము తెస్తాం.. పచ్చళ్ళు, కూరలు పొరిగింటివారు తీసుకురావాలి..' అని వంతులు వేసుకొనేవారు. ఇప్పుడంతా కాలం మారిపోయింది. చేతి చమురు వదిలినా క్యాటరింగే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఫలానా 'మెనూ' కావాలంటూ ఎంచక్కా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నారు. ఆడి, పాడి ఆనక కడుపునిండా ఆరగించి ఆధునిక వనభోజనాలకు కొత్త భాష్యాన్ని చెబుతున్నారు.
సినీ పరిశ్రమ రారాజు డీవీఎస్ రాజు
1928లో పోడూరు మండలం కవిటం లో జన్మించారు.. ఆయన తండ్రి దాట్ల బలరామరాజు, రాజకీయ దురంధరుడిగా పేరుపొందారు. 1962 నుంచి రెండు సార్లు నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తండ్రి వారసత్వంతో చిన్నప్పుడే ప్రతిభను పుణికిపుచ్చుకున్నారు. కాకినాడ పీఆర్ కళాశాలలో చదువు పూర్తయ్యాక వ్యా పారం నిమిత్తం మద్రాసు వెళ్లి అనూహ్యంగా సినీ పరిశ్రమలో స్థిరపడ్డారు.
1950లో సినోలితో వర్క్స్ పేరుతో వా ల్‌పోస్టర్ ముద్రణ సంస్థను ప్రారంభించిన ఆయన పిచ్చి పుల్లయ్య సినిమా పోస్టర్ ముద్రణ సమయంలోనే ఎన్టీ రామరావుతో పరిచయం కలిగింది. ఆ పరిచయంతో ఎన్టిఆర్ సోదరుడు త్రివిక్రమరావు ప్రారంభించిన ఎన్ఏటి సం స్థలో భాగస్వామి అయ్యి తోడు దొంగలు, జయసింహ, పాండురంగ మహత్యం, గులేబకావళి వంటి చిత్రాలను నిర్మించారు.
1964లో తన సొంత సంస్థ డీవీఎస్ఎన్ ప్రొడక్షన్ ప్రారంభించి మంగమ్మ శపధంతో జైత్రయాత్రను ప్రారంభించారు. గండికోట ర హస్యం, గులేబకావళిక«థ, తిక్క శంకరయ్య, మాబాబు, ధనమా దైవమా, పిడుగు రాముడు వంటి 25 చిత్రాలను నిర్మించారు. 1975లో జీవన జ్యోతి సినిమా ఉత్తమ చిత్రంగా నంది అవార్డుlanu అందుకున్న ఆయన సినీ దక్షిణ భార త చలనచిత్ర మండలికి గౌరవ కార్యదర్శిగా పదేళ్లు పనిచేశారు.
1977లో దక్షిణ భారత చలనచిత్ర మండలికి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన కృషితోనే చలనచిత్ర మండలి ఏర్పడింది. ఈ మండలి ప్రారంభించిన ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్, చిరంజీవీ వంటి ఎందరో శిక్షణ పొందిన వారే.
1978లో ఫిల్మోత్సవం నిర్వహించిన రాజు గారు 1984-89 మధ్య ఏబీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. రెండోసారి 1990లో ఎన్నికయారు. ఫిలిం డెవల ప్మెంట్ కార్పొరేషన్ తొలి అధ్యక్షుడి గా పనిచేశారు.
1989లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1995లో తమిళ పరిశ్రమ గ్రిష్మా పురస్కారం పొందారు. ఆయనను పద్మశ్రీ అవార్డు వరించింది. పలు హోదాల్లో చలనచిత్ర రంగానికి, కళాకారులకు, సామాజిక సేవ కార్యక్రమాలకు సహకరించారు.
తండ్రి బలరామరాజు పార్లమెంటు సభ్యుడిగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్దికి కారకుడు అయితే సినీ పరిశ్రమలో అగ్రగణ్యుడుగా డీవీఎస్ రాజు వెలుగొందడం గర్వకారణం.
త్వరలో కాంగ్రెస్‌లోకి నాగం
టీఆర్ఎస్ కాంగ్రెస్ లో జసిపోతుందని నాగం చేసిన విమర్శలపై మంది పడుతూ సబ్ పార్టీ పార్టీతో కలవదని స్పష్టం చేశారు. తెలంగాణాని సాధించే దిశలో టీడీపీతో ఉంటే ఒప్పు, కాంగ్రెస్‌తో ఉంటే తప్పా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన తెలంగాణ టీడీపీ నేతలు దద్దమ్మలని మండిపడ్డారు.
'దేశంలో' అడుగిడుతున్న ప్రజా కళాకారిణి ఉష?
తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకుల చొరవతో ఆమె టీడీపీలో చేరాలని నిర్ణయించుకొన్నారni సమాచారం . కొద్ది రోజుల్లో ఆమె పార్టీలో చేరనున్నారని విజయనగరం జిల్లాకు చెందిన దేశం నేతలు చెబుతున్న వివరాలు బట్టి తెలుస్తోంది..
13, నవంబర్ 2010, శనివారం
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలుగమ్మాయి మృతి
అమెరికా రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతి మృతి చెందింది. మరో యువతికి గాయాలయ్యాయి. గత రాత్రి వీరి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరిద్దరూ సికింద్రాబాద్‌కు జనరల్ బజార్‌కు చెందిన వ్యాపారి కవల అక్కాచెల్లెళ్లు అర్చన, అర్పణగా వీరిని గుర్తించారు.
బీఫార్మసీ పూర్తి చేసి వీరు ఎమ్మెస్ చదివేందుకు అమెరికాలోని నాస్విల్టెన్నిస్కు రెండేళ్లక్రితం వెళ్లారు. ఈ డిసెంబర్లో చదువు పూర్తవుతుంది. ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవటంతో కవలల ఇంట విషాదం చోటు చేసుకొంది... వార్త తెలిసాక జనరల్ బజార్‌లోని పలువురు వ్యాపారులు షాప్స్ స్వచంద్మ్గా మూసివేసి సంతాపం ప్రకటించారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే నరికి చంపుతాం
ఇప్పటికే పది మంది టీం హైదరాబాద్ బయలుదేరిందని పోన్చేసిన అగంతకులు తనతో అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే చంపుతామని, బాడీని పది ముక్కలు చేసి పది చోట్ల పడేస్తామని, ఇలాంటి తాటకు చప్పుళ్ళకు బెదిరేది లేదని, ఒకవేళ తనకు ఏదైనా జరిగితే కేసీఆర్ కుటుంబం బాధ్యత వహించాల్సి వస్తుందని తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, అలాగని దొరల తెలంగాణను తాను సమర్థించనని రహమాన్ అన్నారు.
నిజామాబాద్‌లోని మూడు కాయిన్ బాక్స్లనుంచి ఈ కాల్స్ వచ్చినటుల సమాచారం.
కాంగ్రెస్, టీఆర్ఎస్ల అక్రమ సంబంధం బయట పడింది
కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ కార్యాలయం బ్రాంచి ఆఫీస్‌గా ఏర్పాటు చేసినట్లు స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్లాది రూపాయల ముడుపులు అందుకోవడమే గాక తన ఆస్తులను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రకటించారని కేసీఆర్ అసలు రంగు, నిజ స్వరూపం బయట పడ్డాయన్నారు.
కేసీ ఆర్ మాటలతో కాంగ్రెస్, టీ ఆర్ ఎస్‌కు అక్రమ సంబంధం ఉన్నట్లు తేటతెల్లమైందని,. తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్ అని పదే పదే వ్యాఖ్యానించే కేసీ ఆర్ టీడీపీని, చంద్రబాబు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేకు కల్పిస్తున్న భద్రత ఎంత?
గన్మ్యాన్లను దుర్వినియోగం చేస్తున్న సీకే బాబుకు కల్పించిన భద్రతకు సంబంధించిన వివరాలను ఆర్టిఐ యాక్టు కింద కోరితే అధికారులు తిరస్కరించ దమేంతని నిలదీస్తూ... అన్ని వివరాలు సోమవారంలోగా అందించాలని కేసు విచారణను వాయిదా వేశారు.
వరంగల్ టీఆర్ఎస్ సభకు ముంబై నుంది భారీగా వస్తాం
ముంబై తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల వీరాస్వామి తో పాటు 119 మంది టీఆర్ఎస్లో చేరారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో తము కుడా భాగస్వాములవుతామని తెలిపారు.
నన్ను చంపేందుకు కుట్ర : అదుర్స్ నిర్మాత ఆందోళన
పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుల్లో వల్లభనేని వంశీ ఒకరు. ఈయన విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత. 2009 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. 2004 తరు వాత కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే పరిటాల రవీం ద్ర రాజ గురువు మాలపాటి వెంకటేశ్వరరావు, మరో ముఖ్య అనుచరుడు తగరకుంట ప్రభాకర్ వరుస హత్యలు జరిగాయి. వారి హత్యలతో పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుల్లో ఒకింత అభద్రతా భావం నెలకొనడంతో సందేహం లేదు.
. రవి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా అభి యోగాలు ఎదుర్కొంటున్న మద్దెల చెరువు సూరి కారు బాంబు కేసులో జైలు శిక్ష పడి కొన్ని నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు... ఈ క్రమం లో పరిటాలను కాల్చి చంపినమొద్దు శీను హత్యకేసు నిందితుడు ఓంప్రకాష్ తొలుత తానే ఆ హత్య చేశానని ఒప్పుకున్నా ఆ తరువాత తనకు సంబంధం లేదని దివం గత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, సూరీలే మొద్దుశీనును హత్య చేయించి తనను అన్యాయంగా ఆ కేసులో ఇరికించారని ఆక్రోశం వెళ్లగక్కాడు.
. ఈ నేపథ్యంలో వంశీ తాజాగా మద్దెలచెరువు సూరిపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కుంటున్నాయి
కేసీఆర్ ని చరిత్రహినుడిగా చూస్తారు
కాంగ్రెస్ పా ర్టీకి ఎజెంట్‌గా మారి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానంటే చంద్రబాబు అ డ్డుపడుతున్నాడని అనడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు. కేసీఆర్ తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చేప్పాలని, లేదంటే తెలంగాణ ప్రజలు ఆయనను చరిత్రహినుడి గా చూస్తారని అన్నారు.
ఉద్యమం పేరుతో కోట్లు కూడబెట్టిన కేసీఆర్
ఉద్యమం పేరుతో కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించుకుంటోందni తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు పూనుకోకముందే కేసీఆర్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నాడన్నారు.తెలంగాణ మేధావులు, విద్యార్థులు ఇప్పటికైనా వాస్తవాలను గమనించాలని దయాకర్‌రావు అన్నారు.
రోడ్డెక్కిన రోశయ్య
'పీసీసీ ధర్నాలో సీఎం రోశయ్య ప్రసంగిస్తూ.. సోనియాకు సంఘీభావం తెలిపేందుకు తానూ ధర్నాలో పాల్గొన్నట్లు చెప్పారు. సోనియా త్యాగాలు వెలకట్టలేనివి. ప్రధాని పదవిని ప్రజలు రెండు సార్లు చేతిలో పెట్టినా.. ఆమె వద్దన్నారు. ప్రజల కోసం కష్టపడతానంటూ ప్రధాని పదవినే త్యాగం చేసిన సోనియాను విమర్శించడం సరికాదు. సుదర్శన్ తక్షణం బహిరంగక్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
12, నవంబర్ 2010, శుక్రవారం
కేసీఆర్ మరో మర్రి చెన్నారెడ్డి
ఇందిరాగాంధీకి చెన్నారెడ్డి ఉద్యమాన్ని తాకట్టు పెట్టి పదవులు పొందితే నేడు కేసీఆర్ సోనియా గాంధీ కాళ్ళ వద్దకు ఉద్యమాన్ని తీసుకువెడుతూ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
డిసెంబర్ తర్వాత ఉద్యమం ఉధృతమని ప్రకటించిన కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని కేశవరావు సమక్షంలో అనడం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని ఆ పార్టీ నేతలే ఒప్పుకున్నట్టేనని ఎద్దేవా చేశారు.
చిరంజీవి కోరితే రాజకీయ శిక్షణ ఇస్తా ,.......
నాయకత్వ లక్షణాలు పుట్టుకతో వచ్చేవి కావని, అలవర్చుకోవాలనే ఆసక్తి, జిజ్ఞాస ఉండి తనకు ఆహ్వానం పంపితే ....23 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను సినీరంగం నుంచి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన చిరంజీవికి రాజకీయ పార్టీల లక్షణాల గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నానని ఒకవేళ తన ప్రతిపాదనను అపహాస్యంగా భావిస్తే 'అది వారి ఖర్మ...' అని వ్యాఖ్యానించారు.
ప్రజారాజ్యం పార్టీకి ఒక్క ఎంపి కూడా లేనందున ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 33మంది కాంగ్రెస్ ఎంపిీలు గడిచిన 18 మాసాల్లో చేపట్టిన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని.....ఎన్డీఎ హయాంలో రాష్ట్రానికి టీడీపీ ఎంపీలు ఏం సాధించారో చంద్రబాబునాయుడు కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డుపై రోశయ్యధర్నా
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాసరావు, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
.రోశయ్యని అరెస్ట్ చేయాలి
వాస్తవాలు దాగవు
జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని సిీఎం రోశయ్య ఉలిక్కి పడుతున్నారని అందుకే మంత్రులపై ఆరోపణలను ఖండించాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, అంబటి రాంబాబు, కొండా సురేఖ తదితరులు మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు చేశారని, వాటికి సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం రోశయ్య చేసిన ఆరోపణలకు ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నారని, రోశయ్య, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా ఆయన విచారణకు సిద్ధంగా ఉన్నారా..! అని ఆయన సవాలు విసిరారు.
మనుషులకే వైద్యసేవలు అందించని దానం.. నాకు పశువైద్యం చేస్తాడా?
రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే వారి గోడు పట్టించుకోకుండా కాంగ్రెస్ ఉత్సవాలు ఘనంగా జరపాలని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. మనుషులకే వైద్యసేవలు కరువవుతుంటే ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేంద్ర నాకు పశువైద్యం చేయాలంటూ విమర్శించడం విడ్డూరంగా మండిపడ్డారు.
బలో పేతం దిశగా తెలుగుదేశం
విద్యార్థి, ఉద్యోగ, ఉపా«ధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్యలు పరిష్కరించలేని అసమర్థ ప్ర భుత్వాలుగా ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర పుటల్లో నిలుస్తాయని .... ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలిచేందుకు వాడవాడలా టీడీపీ నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణ యం తీసుకున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై రాజీలేని పోరాటం సాగిస్తామన్నారు పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు
బాబును శంకించడం తగదు
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే టీడీపీకి చెందిన ఆంధ్ర ప్రాంత ఎంపీలు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశారు.
వెక్కిరిస్తున్నదృశ్య శ్రవణాలు
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల అలసత్వం, పాలకుల స్వార్థం వల్ల అమలుకు నోచుకోకపోవడం లేదు. దీంతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టింది. మరోవైపు రూ. లక్షలాది నిధులు వృథా అయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితం తాంబుళం ఇచ్చాం... ఇక తన్నుకుచావండి అన్న చందంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసిన మన టీవీలు పాఠశాలల్లో అటకెక్కాయి.
గణి తం, సామాన్య, ఆంగ్లం, సాంఘిక శాస్త్రాల్లోని పలు అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చెప్పే అంశాలను మన టీవీలో పొందుపర్చారు..మన టీవీలను ప్రారంభించి అంశాలను చెప్పిన సందర్భాలు లేవు. వీటి ద్వారానే టెలికాన్ఫరెన్స్ జరగాల్సి ఉన్న జరగడం లేదు. ఫలితంగా రూ. లక్షలాది రాజీవ్ విద్యామిషన్ నిధులు నిరుపయోగంగా మారాయి.
చాలా చోట్లా పనిచేయక మూలన పడి ఉండి అధికారుల పనితీరును వెక్కిరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది. మరికొన్ని పాఠశాలల్లో టీవీలను ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లినట్లు సందర్భాలున్నాయి.
తమిళ సంవత్సరాదికి ఉచిత సరుకులు
తమిళ సంవత్సరాదిని అన్నికుటుంబాల వారు పొంగల్‌తో ఉత్సాహంగా జరుపుకునేందుకు సరకుల బ్యాగ్‌ను రాష్ట్రప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకోసం రూ.70 కోట్ల నిధులు విడుదల చేసింది.
11, నవంబర్ 2010, గురువారం
ఓదార్పుకు అనుకూలంగా మాట్లాడితే చర్యలా,,,,
చెవిరెడ్డి భాస్కరెడ్డిని పార్టీ నుంచి ఏకపక్షంగా సస్పెండ్ చేసారని ... పార్టీకి ఎనలేని సేవ చేసిన భాస్కరెడ్డిపై చర్య తీసుకోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కుట్రపూరిత వాతావరణం నెలకొనివుందని ... పార్టీని అభాసుపాలు చేస్తున్నవారిని, భ్రష్టు పట్టిస్తున్న వారిని ప్రోత్సహిస్తుండడం ఏం న్యాయమని... పార్టీని బలపరిచే దిశగా సాగుతున్న ఓదార్పు యాత్ర ని జగన్ చేస్తే తప్పేమిటని నిలదేస్తూనే... జగాన్ని బలపరిచే నేతలపై ఎదుకు చర్యలుకు దిగుతున్నారో పిసిసి చీఫ్ చెప్పాలన్నారు
బావ చితంలో సెన్సార్ కట్స్ ఇవీ
29.10.2010 విడుదలైన బావ చితంలో సెన్సార్ కట్స్ ఇవీ
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'బావ' చిత్రాన్ని చూసి 5 కట్స్‌తో 'యు' సర్టిఫికెట్‌ని 27.10.2010 న జారీ చేసిన ఈ చిత్రంలో...
1. ఒకటి, రెండు రీళ్లలో చిత్రీకరించిన దృశ్యాల్లోని 'ఊరపంది నాయాల్లారా' అనే మాటల్ని తొలగించి శబ్దం వినపడకూడదన్నారు.
2. అయిదు, ఆరు రీళ్లలో దేవుళ్లు, వంకాయలు పైన చిత్రీకరించి జోక్స్‌ని తొలగించారు. (దేవుళ్ల పేర్లను తొలగించి అంగీకరించిన వంకాయలు వుంచారు) శబ్దం వినరాకూడదన్నారు.
3. అయిదు, ఆరు రీళ్లలోనే చిత్రీకరించిన 'కాయ కోస్తా' అనే పదాన్ని శబ్దంతో సహా తొలగించారు.
4. అయిదు, ఆరు, పదకొండు, పన్నెండు రీళ్లలో 'చంక నాకుతున్నారా అనే మాటలు ఎక్కడ వచ్చినా వాటిని తొలగిస్తూ శబ్దం వినబడకూడదన్నారు.
5. అయిదు ఆరు రీళ్లలో చిత్రీకరించిన దృశ్యాల్లో ఎన్ స్టూడియోకి సంబంధించి వున్న 'ఆల్రెడీ అమ్మేసుకున్నాడు' అనే పదాల్ని తొలగించి, శబ్దం వినబడకూడదన్నారు.
పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ...
కష్టాల్లో ఉన్నాడని పిలిచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ... న్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు... పథకం ప్రకారమే చంద్రబాబు పార్టీలో తన వర్గంవార్ని నింపుకుని వారికే పదవులు ఇచ్చారni ఎన్టీఆర్‌ను ప్రేమించేవారిని, అభిమానించి వారిని ఆయన నుంచి దూరం చేశారన్నారు. . తాను ఎన్నడు ఎన్టీఆర్‌కు కానీ, పార్టీకిగానీ నష్టం కలిగించేలా వ్యవహరించలేదని లక్ష్మీపార్వతి తెలిపారు.
నవ్వులు పండించే నటి హేమ కు జన్మదిన శుభాకాంక్షలు
కోనసీమ యాస తో గలగలా చక్కగా గట్టిగా నవ్వేయడం, దడదడా తడుముకోకుండా మాట్లా de హేమ పుట్టినరోజు నవంబర్ 12.
1989లో నటిగా కెరీర్ ప్రారంభించిnaa వివాహం కారణంగా నటనకు 1993లో బ్రేక్ యిచ్చి, 1997లో నటిగా పున:ప్రవేశం చేసి, ఇటు కామెడీ రోల్స్, అటు కేరక్టర్ రోల్స్ ద్వారానూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికి 290 చిత్రాలకు పైగా చేసిన హేమ రెండు మలయాళ చిత్రాల్లో, ఒక కన్నడ చిత్రంలో ఒక హిందీ చిత్రంలో నటించింది. ఇటీవల కాలంలో టీవీ వంట వార్పూ కార్యక్రమంలోదర్సనమిస్తున్న ఈ తెలుగింటి ఆంటీకి పుట్టిన రోజు శుభా కా౦క్షలు
ఫిలిం టూరిజం సెల్ ఏర్పాటు
తెలంగాణా ఏర్పాటుకు డెడ్ లైన్ లేదంటున్న కెసిఆర్
ఇప్పటికే తేలంగాణలో టీడీపీ పరిస్తితి దారుణమని.. చంద్రబాబును చూస్తే జాలి కలుగుతోందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం నిర్ణయం కోసం జనవరి నెలాఖరు వరకు ఆగుతామని కేసీఆర్ చెప్పారు. కమిటీ నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని డిమాండుతో ఉద్యమం చేపడతామని ఐతే తెలంగాణా ఏర్పాటు కు నిర్దిష్ట గడువు లేనే లేదని తేల్చే చెప్పారు కెసిఆర్ .
వెస్టిండీస్ తొలి క్రికెట్ టెస్ట్‌కు లలిత్ మలింగ పక్కకు
ఆంక్షలు నడుమ ఉప్పల్ స్టేడియం
మ్యాచ్ చూసేందుకు వచ్చేవారు కేటాయించిన స్థలాల్లోనే వాహనాలు పార్క్ చేయాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ స్టేడియం చుట్టుపక్కల వాహనాలకు, సెల్ ఫోన్ లు, లాప్ టాప్‌లు, భోజన కేరజ్లు, తదితరాలకు అనుమతి నిషేధించినట్లు చెప్పారు.
రాజా రాజీనామా చేయాల్సిన అవసరం లేదట
'రాజా ఎందుకు రాజీనామా చేయాలి? ఈ విషయంలో సిబిఐ విచారణ జరుగుతోంది. విచారణ ముగిసే వరకూ ప్రతిఒక్కరూ వేచిఉండాలి' అని డిఎంకె ప్రతినిధి, ఆ పార్టీ లోక్‌సభ సభ్యుడు టికెఎస్ ఎలగోవన్ అన్నారు.
20 న ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సమైక్యాంధ్ర సదస్సు
ఇప్పటికే శ్రీ కృష్ణ కమిటీకి ఓ నివేదిక అందించ్చామని ... సమైక్యాంధ్ర నినాదాన్ని మరింత గట్టిగా వినిపించడానికీ ఈ సభ నిర్వహించనున్నట్టు సంస్థ లో చురుకైన పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ఎన్నారై సంస్థ అధ్యక్షురాలు శైలజ అడ్లూరు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎడిసన్‌లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో ఈ సభ నిర్వహించనున్నట్టు ఆమె వెల్లడించారు.
బెల్టు వివరాలివ్వండి : హైకోర్టు
గతం నుంచీ కోర్టులు మద్యం విచ్చలవిడి అక్రమాలపై నియంత్రణ ఉండాలన్న వాదనను వినిపిస్తూనే ఉన్నా నేటి పాలకులకు చెవిటి వాని ముందు శంఖం' ఊదిన చందాన కాగితాలకు పరిమితమవ్వడం వల్ల ఈ సారైనా కోర్టు ఉత్తర్వులకు ప్రభుత్వం, స్వచ్ఛంధసంస్థలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు స్పందించే తీరునుబట్టే కోర్టు ఆదేశాలు అమలవుతాయని సర్వత్రా వినిపిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 2 నుంచి 3 ఆపైనే బెల్టుషాపులు ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కార్మికులు, ఇతర కష్టజీవులు పనిచేశాక 68శాతం మద్యం అమ్మకాలలో వీటి పాత్ర కీలకంగానే ఉంది అన్నది వాస్తవం ..లక్షలాదిమంది ప్రజలను తాగుడుకు బానిసలు చేస్తూ లైసెన్సులను విచ్చలవిడిగా ప్రభుత్వం మంజూరు చేయడం, బెల్టుషాపులు కూడా ఇష్టా రాజ్యంగా ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. గ్రామంలో రోడ్డు, లేదా గుడికి ప్రతి నెలా ఫలానా ఇంత ఇస్తామని ఒప్పించి బెల్టుషాపులు పెట్టి దందా సాగిస్తున్నారు.
మమ్ముల్ల మట్ట్లో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపులపై నోరుమెదపని తీరు, లక్ష్యాల కోసం ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం తోడై ప్రజలను బానిసలుగా మారుస్తోంది.
విశాఖలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం
లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ... దేశవ్యాప్తంగా 14 ప్రాంతాల్లో 14 ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు... ఈ విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోని విశాఖతో పాటు భువనేశ్వర్, కొచ్చి, అమృతసర్, గ్రేటర్ నొయిడా, పాట్నా, గౌహతీ, కొల్కతా, భోపాల్, గాంధీనగర్, కోవై, మైసూర్ , పూణె...తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు కపిల్‌సిబాల్ వెల్లడించారు.
హైకోర్టుకు కొత్తగా అయిదుగురు జడ్జిలు నియామకం
హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొంది... సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న వారి వివరాలివి
ఎఆర్‌ఎల్ నాగేశ్వరరావు-విశాఖ
కేవీ శంకర్- కడప
శ్రీరవిశంకర్-రంగారెడ్డి,
వి దుర్గాప్రసాద్- సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి
పల్లెపల్లెకూ తెలంగాణ టీడీపీ
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక కంటే ముందుగానే ప్రజలు తెలంగాణ పోరాటం కోసం మరోసారి సమాయ త్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు తీర్చడం కోసం అవసర మైతే ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరా టాలను కొనసాగిస్తామని దయాకర్‌రావు అన్నారు.
మార్షల్‌తో ఎన్టీఆర్‌ను గెంటించివేసిన ఘనత నీదే..
గురువారం తూర్పు గోదావరి జిల్లా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అణుచరగణం దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. : సుదీర్ఘ అనుభవమున్న ముఖ్యమంత్రి రోశయ్యను రాజకీయ వ్యభిచారి అని విమర్శించే అర్హత వారికి లేదని పేర్కొన్నారు.
వరద ముంపు వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఐతే .... చెప్పిన విధంగా జరగడానకి కేంద్రరాష్ట్ర ప్రభుత్వ నిబంధనలలో లేవని బొత్స తెలిపారు.
శ్రీవారి పుష్పయాగం 13వ తేదీన
దీనికిగాను టీటీడీ ఉద్యానవనశాఖ సుమారు మూడు టన్నుల పుష్పాలను సిద్ధం చేయనుంది. వివిధ రకాల పుష్పాలను దాతల నుంచి అధికభాగంలో సేకరిస్తున్నారు.. ఈ సేవలో భక్తులు రూ. మూడు వేలు ఆర్జితం చెల్లించి పాల్గొనవచ్చు.
రోశయ్య ముమ్మాటికీ అవినీతి సామ్రాట్టే
పొన్నాలకు పొగ పెదుతున్న సొంత వర్గం
నియర్ కాంగ్రెస్ నాయకులను కూడా పట్టించుకోవడంలేదని, పరిస్దితి ఇలాగే కొనసాగితే వరంగల్ లాంటి అతిపెద్ద జిల్లాలో పార్టీ మనుగడకు ఇబ్బందులు ఏర్పడే పరిస్దితులు ఉన్నాయని వారు వివరించినట్లు తెలిసింది.ఇదిలా ఉండగా మంత్రి లక్ష్మయ్య సహకారంతోనే ప్రజాప్రతినిధులుగా గత ఎన్నికల్లో టికెట్లు పొంది గెలుపొంdina వారె కావటం గమనార్హం.
రెడిఫ్ మెయిల్ డాట్‌కామ్‌ను నిషేధించాలన్న వెంకటేష్
తప్పుడు ప్రచారానికి పాల్పడ్డ వెబ్‌సైట్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని ...రోశయ్య ముఖ్యమంత్రిగా నియమితులైన తొలిరోజుల్లో ఆ స్థానాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకున్నా ఇప్పుడు ఆయన సైతం రోశయ్యను సమర్థిస్తున్నారని, మద్ధతు ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు
దేశానికీ స్వాతంత్రం తెచ్చింది ఆర్యవైశ్యుడే
భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీజీ ఆర్యవైశ్యుడని, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారకుడైన పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యుడని, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి ఆర్యవైశ్యుడేనని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్యను గద్దె దింపడానికి ప్రతి పక్షంపాటు అధికార పక్షం కూడా పావులు కదుపుతున్నప్పటికీ ఆయనను గద్దె దింపలేకపోయారన్నారు. రోశయ్యకు అన్ని శాఖల్లో అనుభవం వుండడం వల్ల అధిష్టానం ఆయనకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
భారత దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ఏకైక ఆర్యవైశ్య ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. విజయవాడలో జరిగే ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆయనను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు
బాబు, చిరులది గ్లోబల్ ప్రచారం
రోశయ్య సిఎం హయాంలో 2010లో అత్యధికంగా రూ.1104 కోట్లు రాష్ట్రానికి నిధులు విడుదలైయ్యాయని, ఈ ఏడాది రూ.586 కోట్లు ప్రకృతి వైపరీత్యాల నిధి, జాతీయ విపత్తునిధి కింద నిధులు మంజూరు అయ్యాయని గణాంకాలతో ఆయన వివరించారు. తమ ఉనికిని చాటుకునేందుకు టిడిపి నేతలు రోశయ్య ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు.
ఉద్యమ స్వరూపాన్ని వివరించే జైబోలో తెలంగాణ
వరంగల్ కోట మధ్యలో జై బోలో తెలంగాణ/గలగర్జనలా..జడివాన../నెత్తుటి గాయాల వీణ... అంటూ కొనసాగే టైటిల్‌సాంగ్‌తో పాటు హీరో జగపతిబాబు పై ప్రధాన దృశ్యాలను చిత్రీకరించా మని చెప్పారు శంకర్
కరంట్ 'డవలప్ మెంట్' బాదుడు
విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగాన్ని రెట్టింపుగా వినియోగిస్తున్నారా.. తెలుసుకునేందుకు ..విద్యుత్‌శాఖ ఉద్యోగులు, సిబ్బంది విద్యుత్ పోల్,పోల్‌కు తిరుగుతూ అక్కడున్న గృహ, వ్యాపార విద్యుత్ సర్వీసులను లెక్కిస్తున్నారు. ఆ ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో విద్యుత్ వినియోగానికి సంబంధించిన వస్తువులను లెక్కిస్తున్నారు. నెలకు ఆ ఇంటికి ఎంత విద్యుత్ వాడకం జరుగుతుందో కూడా విద్యుత్‌శాఖాధికారులు లెక్కలు వేసుకొని ఒక రిపోర్టును సైతం తయారు చేసి దాని ప్రకారం ప్రతి ఇంటికి నోటీసులను అందచేస్తున్నారు
వేలాది రూపాయలు డవలప్మెంట్ చార్జీల పేరుతో విద్యుత్‌శాఖాధికారులు ఇస్తున్న నోటీసులను చూసుకొని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ వాడుకున్నంత ప్రకారం చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ మళ్లీ అదనంగా భారం వేయడం ఏమిటని విద్యుత్‌శాఖాధికారులు మళ్లీ ఆలోచించి ఈ డెవలప్మెంట్ చార్జీల వసూళ్లను నిలిపివేయాలని కోరుతున్నారు.
కడపలో ఎన్‌టి రామారావు విగ్రహధ్వంసం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్ర హాల ఏర్పాటుకు అనుమతి లేకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అయితే ఎన్టిఆర్ లాంటి మహోన్న తుడి విగ్రహానికి హాని జరగడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాల న్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని శాసన మండలి సభ్యుడు ఎం.వెంకటశివారెడ్డి డిమాండ్ చేశారు
రాష్ట్రంలో అసమర్థుడి పాలన
వయసు పైబడి సీఎం రోశయ్య అసహనం, కోపం ప్రదర్శిస్తున్నారన్నా రు. అపార అనుభవం ఉందని చెప్పుకు నే రోశయ్య ప్రజా సమస్యలు పరిష్కారానికి మా త్రం అనుభవం ఉపయోగించడం లేదన్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ హయాంలో జరిగిన అనేక పథకాలు, కార్యక్రమాలపై 22 కమిటీలను నియమించారని ఏ ఒక్కటీ తప్పు పట్టలేదన్నారు.
ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని రోశయ్య ... చెన్నారెడ్డిపై తీవ్ర విమర్శలు చేసి రాత్రికి రాత్రే ఆయన కేబినెట్లో మంత్రి అ య్యారన్నారు..వైఎస్ చనిపోయాక మెజారిటీ సభ్యులు జగన్ సీఎం కావాలని సంతకాలు చేసినా ఆ కుర్చీలో రోశయ్య ఎలా కూర్చున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించినపు డు, 1999లో జరిగిన ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. సీ ఎంగా సొంత జిల్లాకే ఏమీ చేయలేని వ్యక్తి ర్రాష్టానికి ఏం చేస్తారన్నార ని నిలదీసారు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ...
14 నుంచి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు
ప్రతి నియోజకవర్గంలో ఈనెల 15న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఉత్సవాలకు ఖాదీ దుస్తులు, టోపి ధరించాలని లేదా తెల్లదుస్తులైనా వేసుకుని రావాలన్నా సూచనలు చేసారు. గాంధీ, నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ ఎవరో కూడా తెలియని వారు నేటికీ మారుమూల పల్లె ప్రజలున్నాయని వీరందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం గురించి వివరించాలన్న భావన వ్యక్తమవుతోంది
ఈ సందర్భంగా ఫొటో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలన్న ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్ఎస్ఎస్కు ఉగ్రవాద లేబుల్‌ను అతికిస్తారా?
నిన్న ఇందిరాపార్క్ దరి ఎన్టిఆర్ స్టే డియంలో జరిగిన సమావేశం ఆద్యంతం ఉద్వేగ భరితంగా సాగింది. సమగ్రత, ఐకమత్యాన్ని సామాజిక సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి చర్యలకు పాల్పడరాదని పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు..
హిందూమతోద్ధరణకు కంకణo కట్టుకున్న ఆర్ఎస్ఎస్కు ఉగ్రవాద లేబుల్‌ను అంటించడంపై తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తు కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఆరెస్సెస్ సిద్దంగా ఉందని అజ్మీర్, హైదరాబాద్, సంజోతా ఎక్స్ ప్రెస్‌లో బాంబ్ ప్రేలుళ్ళకు లష్కర్-ఎ-తోయిబా సంస్థలే కారణమన్న నిజాన్ని ప్రధానమంత్రి గుర్తించాలన్నారు
10, నవంబర్ 2010, బుధవారం
ప్రపంచంలోనే ఉత్తమ సిఎం రోశయ్య
ప్రపంచంలోనే రోశయ్య ఉత్తమ సిఎంగా మొదటిస్థానంలో ఉన్నారని... ఆయనకు రాజకీయ అనుభవం అపారంగా ఉందని, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్సీగా, ఒక పర్యాయం ఎంపిగా, పిసిసి అధ్యక్షులుగా పదవులు అనుభవించారన్నారు. రోశయ్య పిసిసి అధ్యక్షులుగా ఉన్న కాలంలో రాష్ట్రంలో 22మంది ఎంపిలను గెలిపించిన ఘన చరిత్ర ఆయనకు ఉందన్నారు.
ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తా..!: సైనా నెహ్వాల్
2009 టివి నంది అవార్డుల ప్రకటన
ఉత్తమ రెండవ టెలీఫిల్మ్'గా దృష్టి ఎంపికైంది. ఉత్తమ టివీ మెగా సీరియల్'గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఎంపికైంది. ఉత్తమ టివి సీరియల్'గా మొగలిరేకులు, రెండవ ఉత్తమ సీరియల్'గా అభిషేకం, ఉత్తమ పిల్లల సీరియల్'గా ఆశాదీపం ఎంపికయ్యాయి.
ఉత్తమ దర్శకురాలి అవార్డు మంజులానాయుడు (మొగలిరేకులు), ఉత్తమ నటుడుగా సాగర్(మొగలిరేకులు), ఉత్తమ నటిగా వహిదా(విప్రనారాయణ) ఉత్తమ విలన్'గా రవివర్మ(మనసున మనసై..), ఉత్తమ హాస్యనటుడుగా గుండు హనుమంతరావు ఎంపికయ్యారు. ఈ నెల 28న అవార్డులు ప్రదానం చేస్తారు.
9, నవంబర్ 2010, మంగళవారం
విధులకుడుమ్మా కొట్టే వైద్యులు పై ప్రభుత్వం కొరడా
ఏడాది కన్నా తక్కువగా విధులకు గైర్హాజరైతే భారీజరిమానా విధించడంతోపాటు శాఖ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
విగ్రహారాధన వల్ల ఏకాగ్రత
తిరునక్షత్ర మహోత్సవాల్లో సోమవారం ఆయన అనుగ్రహభాషణం చేస్తూ ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో అర్చనాదికాలు చేస్తే భగవంతుని అనుగ్రహం సంపాదించటం సాధ్యమేనన్నారు.
ప్రతి ఒక్కరూ భక్తి విశ్వాసాలతో స్వామి కృపకు అర్హత సాధించాలన్నారు. విగ్రహారాధన వల్ల ఏకాగ్రత కలుగుతుందని, సుందర స్వరూపుడైన పరమాత్మ రూపాన్ని మనోఫలకంపై నిలిపి ధ్యానం చేయాలన్నారు. అప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతామని తెలిపారు.
మహా నగరం లో కూర'గాయాలు'
29వ తేదీ నుంచి ఈ వారం రోజుల్లోనే కూరగాయల ధరలు నూరు శాతం పెరిగాయి. వారం క్రితం కేజీ వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, క్యారెట్, కాకరకాయల ధరలు రూ.20 చొప్పున ఉండేవి. ఇప్పుడు వాటి ధర రూ.40లకు చేరింది. చిక్కుడుకాయల ధర రూ.15 నుంచి రూ.30లకు చేరుకుంది. నిలకడగా ఉల్లిపాయలు, టమాటాల ధరలు ఉన్నాయి. గతంలో మాదిరిగానే కిలో రూ.20లకు దొరుకుతున్నాయి.
ఓ వైపు వర్షాలకు పనులు లేకపోవడం, నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశనంటడంతో నగరంలో 60 శాతం మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఇది ఇలా ఉంటే అద్దెకు ఉండే వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇంటి అద్దెలు కూడా ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడంతో వీరు కుదేలైపోతున్నారు. ప్రయివేటు కంపెనీలు, షాపుల్లో పనిచేసే కార్మికుల వేతనాలు పెరగలేదు. రోజు కూలికి వెళ్లేవారి కూడా కూలిరేట్లు పెరగలేదు. కాని ధరలు పెరుగుదల, ఇళ్ల అద్దెలు పెరుగుదల భారం మాత్రం వీరి నెత్తిన పడింది. తరుచూ వర్షాల వల్ల పనులు ఉండడం లేదని అన్ని రోజులు పనులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరు కోరుతున్నారు.
సొంత పార్టీ కోసం.. బొత్స రివర్స్‌గేర్...
తెలుగుదేశం వారు కాంగ్రెస్‌పైనా, కాంగ్రెస్ వారు టిడిపిపైనా విమర్శించుకోవడం కనిపిస్తోందని అన్నారు. డబ్బులు వసూలుకు పాల్పడేవారిని లోపల వేస్తే ఏ పార్టీయో తేలుతుందని వ్యాఖ్యలు చేస్తుండటం ...ఇప్పటివరకూ ఆయా మండలాల్లో తహశీల్దార్లు, ఎస్ఐలు ట్రాక్టర్లను సీజ్ చేయడం, డబ్బులు తీసుకుని వదిలేయడంతో వారు బాగా గడించారన్నది బొత్స అంతరంగం.
తాజాగా వాహనాలపై సీజ్ చేయొద్దంటూ ఆదేశించడం వెనుక అధికార పార్టీ నాయకులకు ఆ డబ్బులు చెందేలా చేయడం ఒకటైతే, వాహనాల సీజ్ సమస్య కూడా భవిష్యత్‌లో ఉండకుండా బొత్స జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఆదర్శ్ దెబ్బకు చవాన్ అవుట్
ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణం వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో చవాన్ తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి సమర్పించిన విషయం తెలిసిందే.
రాజీనామ లేఖను రాష్ట్ర గవర్నర్‌కు పంపాలని ఏఐసీసీ అశోక్‌చవాన్‌కు ఆదేశించింది.
తెలంగాణ కోసం డిసెంబర్ 9న ఢిల్లీలో బీజేపీ మహాధర్నా
సాహిత్య అభిమాని: ఎన్ టి రామారావు తీయని అల్లూరి సీతారామరాజు సినిమా లో పాట
saahitya-abhimaani.blogspot.com nunchi sekarana
8, నవంబర్ 2010, సోమవారం
దాడుల నుంచి కాపాడుకోవాడానికే సైనిక సేవా దళ్
రాయలసీమ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి క్షేమాన్ని కోరుతూ సైనిక సేవా దళ్ ముందుకు పోతుందని.. క్రమశిక్షణ, సేవా భావం దళ్ సభ్యులు ప్రధానంగా ఆచరిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల అభిమానం, ఆశీస్సులతో వారికి సేవలందిస్తూ రక్షణ కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రాయలసీమ వాసులు సమైఖ్య రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశారని .... కృష్ణా జలాల పంపకంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినా ఇంత వరకు అమలుకాలేదని అన్నారు. రాయలసీమకు చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులు అయిన సీమ లబ్ధి పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన పివి నరసింహారావు రాయలసీమ నుండి లోక్‌సభకు ఎన్నికై ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలంగాణ వాసులు గుర్తుచేసుకోవాలని టీజీ వెంకటేష్ అన్నారు.
పల్లెబాట పొడగించిన టిఆర్ఎస్
గతంలో కార్యకర్తలు టి ఆర్ ఎస్‌లో చేరాలంటే కేవలం తెలంగాణ భవన్‌కు వెళ్లి మాత్రమే పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చేది. అయితే స్వయంగా టి ఆర్ ఎస్ పార్టీ నేతల నుండి, కార్యకర్తల నుండి, ఇతర తెలంగాణ వాదుల నుండి వస్తున్న విమర్శలను తొలగించడానికి స్వయంగా కెసి ఆర్ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని పార్టీల వారికీ ఆహ్వానాలు పంపిస్తున్నారు. కెసిఆర్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్ , పిఆర్పి పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టిఆర్ఎస్లో చేరుతున్నారు.
మరో వైపు ఆ పార్టీ మహిళ నేత మెదక్ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి కూడా జిల్లాలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల నుండి శ్రేణులను ఉత్సాహపరిచి పార్టీలో చేర్చుకోవడానికి గతంలో తనకు బిజెపి పార్టీతో నెలకొన్న సంబంధాలను ఉపయోగించి తీవ్రతరం చేస్తున్నారు. మొత్తంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని ఏదొక విధంగా బలోపితం చేయాలిన పార్టీల నేతలు భావిస్తున్నారు.
డిసెంబర్ 17 న తేదీన ఖమ్మం జిల్లాకు వీరప్పమొయిలీ
భారత్, కివీస్ తొలి టెస్ట్ డ్రా
లక్ష్మణ్ ( 91), హర్భజన్ సింగ్ (115) జహీర్‌ఖాన్ 0, శ్రీశాంత్ 4 పరుగులు చేశారు. అనంతరం 294 పరుగల లక్ష్మంతో బరిలోకి దిగిన కివీస్ 10 ఓవర్లు ఆడిన 22 పరుగులు చేసింది. 22/1 స్కోరు వద్ద ఇరు జట్లు కెప్టెన్ల అంగీకారం మేరకు చివరి రోజు 15 ఓవర్లు ఉండాగానే అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.
ఖేల్ రత్నా అవార్డును అందుకున్న సైనా నెహ్వాల్!
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఖేల్ రత్నా అవార్డును అందుకున్నారు. ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన కారణంగా ఆగస్టు 29వ తేదీ జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సైనా నెహ్వాల్ పాల్గొనలేకపోయింది.
తద్వారా సోమవారం సైనా నెహ్వాల్‌కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డును కేంద్ర క్రీడా శాఖా మంత్రి ఎం.ఎస్. గిల్ అందజేశారు. ఖేల్ రత్న పతకంతో పాటు రూ. 7.5లక్షల నగదును కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్‌కు గిల్ అందజేశారు.
ఉత్తరాంధ్రలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది....
ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎం.వి.శర్మ పదవీ కాలం 2011 మార్చి 29తో ముగుస్తున్నందున ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహంతో గెలుపునకు పావులను కదపడం ప్రారంభించాయి. ఈ నెల 11వ తేదీతో పట్టభద్ర ఓటర్ల నమోదు కార్యక్రమం ముగుస్తుంది.
ఆటకేక్కుతున్న ఆశయ సాధన
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు సొంత రాజకీయ నాయకులే కారణమని .. తమ పార్టీకి చెందిన వారు.. తమ వర్గానికి చెంది ఉండపోతే ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డు వేస్తున్న స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్న నాయకులు ఉన్నంత వరకు ప్రభుత్వ ఆశయానికి గండి తప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం సదాశయంతో సాక్షర భారత్‌ను ప్రవేశపెట్టింది. రాజకీయ నాయకుల కారణంగా ఇప్పటికీ బాలారిష్ట దశ నుంచి ఇది అధిగమించలేదు. గత పథకాల మాదిరిగానే ఈ పథకం నీరుగారిపోతోందని పలువురు విశ్లేస్తున్నారు.
ఆరు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నది అధికారుల లక్ష్యం. నాలుగు నెలల్లో ఒకటో వాచకం, రెండు నెలల్లో రెండో వాచకం నేర్పించేందుకు రాత పుస్తకం, పెన్సిల్, రబ్బరు, మెండర్ ప్రతి నిరక్షరాస్యునికీ అందించారు. ఈ పరికరాలు గ్రామ సమన్వయకర్త ఇళ్లల్లో మూలుగుతున్నాయని ఆరోపనలున్నై.
గౌరవ భృతి పొందిన వారికి రాజకీయ అండదండలు ఉండడంతో సాక్షర భారత్ కేంద్రాలు చీకట్లోనే నిద్రపోతున్నాయి. నిబంధనల మేరకు నాలుగు నెలల్లో వాచకం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ రెండు నెలలు గడిచిపోయింది. అంటే ఎనిమిదో వంతు పుస్తకం పూర్తవ్వాలి. కానీ పూర్తయినట్లు గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు నమోదు చేస్తున్నారు. మండల కో-ఆర్డినేటర్ ఆఫీసుకే పరిమితమవడం పర్యవేక్షణ లేకపోవడంతో, ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వీరిపైన చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు వెనకడుగు వేస్తున్నారు.
రాజకీయ నాయకుల సిఫార్సుపై పని చేస్తున్నా వీరు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేరుస్తారా అన్నది శేష ప్రశ్నగా మిగిలిందని ప్రజలు పేర్కొంటున్నారు.
ప్రభుత్వానికే పంగనామాలు పెడుతున్నా పట్టించు కోరా ?
ఇటీవల కాలంలో రాష్ట్రంలో వాహనాలు, ఇతర వాహనాల కొనుగోళ్లు ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నా... వీటి ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు, లైఫ్ టాక్స్ వంటి రాబడులు రవాణా కార్యాలయానికి చేరాల్సి ఉంది. అదేవిధంగా ప్రతిఏటా ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాల రెన్యువల్స్ సందర్భంగా కూడా ఆదాయం వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే పలు ప్రాంతాల్లో వాహన తనిఖీ సమయంలో వచ్చే ఆదాయానికి లెక్క ఉండదు.
నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఎత్తున జరిమానాలు విధించాల్సి ఉన్నా .. జరిమానాలు విధించి అధిక మొత్తాన్ని ఆమ్యామ్యాల రూపంలో నొక్కేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొందరు ఏకంగా నకిలీ చలానా పుస్తకాలు ఉపయోగించి బినామీ రసీదుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముకు కూడా పంగనామాలు పెట్టి అడ్డదారిలో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
రాత్రి సమయాల్లో జరిగే తనిఖీల్లో ఇటువంటి మతలబు వ్యవహారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని సమాచారం. ఈ కారణంగా అక్రమ రవాణా పెచ్చుమీరుతుండగా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా నిఘా విభాగాలు రవాణా కార్యాలయాల కలాపాలపై కన్ను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది
ఇందిరాగాంధీ, ఎన్టీరామారావు లే ఓడిపోయారు నేనెంత
తన రాజకీయ ఎదుగుదలకు నియోజక వర్గ ప్రజలే కారణమని తన ఏ స్థాయిలో ఉన్న నియోజక వర్గ ప్రజలను మరువనన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నా డియస్ గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీరామారావు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం ఓటమిపాలైన సందర్భలున్నాయని అన్నారు.
తన షష్టి పూర్తి సందర్భంగా స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కళాశాల తరగుతులు వచ్చే జూన్ నాటికి ప్రారంభం కావాలని ఆశభావం వ్యక్తం చేశారు.
కేంద్రం నియమించిన శ్రీ కృష్ణ కమిటి డిసెంబర్ 31న కేంద్రానికి నివేదిక అందిస్తుందని నివేదిక అనుసారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తదనంతర పరిణామాల్లో ఉద్యమంలో భాగస్వాములవుతారని ప్రశ్నించగా ఆయన దాటా వేశారు.
9 నుండి శ్రీ సద్గురు సంగీత సభ వార్షిక మహోత్పవాలు
విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత,నృత్య కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సాయంత్రం విశేషమైన సంగీత కచేరీలు నిర్వహింపబడతాయని అన్నారు.
ఈ మహోత్సవాలలో భాగంగా సంగీత రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా ఇచ్చే సంగీత విద్వన్మణి బిరుదును ప్రియా సిస్టర్స్‌గా ప్రసిద్ధులైన షణ్ముఖప్రియ, హరిప్రియలకు అందచుయబడతాయని తెలిపారు.
జై తెలంగాణ అంటే దోస్తి చేస్తాం....
తెలంగాణలో అపారమైన వనరులు ఉన్నాయని అయిన ఈ ప్రాంతం అభి వృద్దికి నోచుకోవడం లేదని అన్నారు. వనరులు ఇక్క డ ఉన్న అభివృద్ది మాత్రం ఆంధ్రా ప్రాంతంలో జరు గుతుందని అన్నారు. మన వనరులను, ఉద్యోగ ఉ పాధిని మనమే ఉపయోగించుకొని తెలంగాణ ప్రాం తాన్ని అభివృద్ది చేసుకోవాలని కోరారు. జై తెలంగాణ అంటే దోస్తి చేస్తాం..నై తెలంగాణ అంటే తరిమి కొడ తామని హెచ్చరించారు.
‘అంతం’ లోగో, ఆడియోలను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్
‘అంతం’ లోగో, ఆడియోలను ఆవిష్కరించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘పులి..షూటింగ్ టైంలో టినువర్మ పరిచయమై మంచి మిత్రుడయ్యారని, ఆ స్నేహంతో ఈ సినిమాలోని యాక్షన్ దృశ్యాల గురించి చెప్పారన్నారు. ఈచిత్ర కధ ఆసక్తికరంగా అనిపించింద ని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
జలవిహార్‌లో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వనభోజనాలు
'అనంత' కవులకు సాహితీ కవితా పురస్కారం
ఈ మేరకు విజయవాడ మానస సాహితీ సంస్థ అధ్యక్షులు సి.హెచ్. వి.యస్ బ్రహ్మానందరావ్ నుండి ఆహ్వానం అందింది నవంబర్ 7న విజయవాడ చండ్ర రాజేశ్వర్రావ్ స్మారక గ్రంథాలయం నందు జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారం పలువురు కవులుకు అందజే స్తారు. కాగా అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన రామకృష్ణకు సైతం ఈ పురస్కారం లభించింది.
బూట్లు ధరించి గుస్సాడి నృత్యం చేస్తావా ?
ఇటీవల ఉట్నూరు మండలంలోని రాజుగూడాలో జరిగిన గుస్సాడి దండారి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్లమెంట్ సభ్యులు రాథోడ్ రమేష్ సాంప్రదాయాలను పట్టించుకోకుండా వారి ఆచార వ్యవహారాలను కించపర్చే విధంగా బూట్లు ధరించి తలకు నెమలిపించం టోపీ వేసుకొని గుస్సాడి నృత్యం చేయడం సహించరాని చర్య అని ఆదివాసి హక్కుల పోరాట సమితీ తుడుందెబ్బ ఆరోపించింది
ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినందుకు ఆదివాసులందరికి రాథోడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వారికి సోనియా భజన తప్ప వారికేమీ తెలియదు
అహ్మదాబాద్ టెస్ట్‌లో హర్భజన్ సెంచరీ
రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో పడిన టీమిండియాను లక్ష్మణ్ (94), హర్భజన్(110) ఆదుకున్నారు. భజ్జీకి తోడుగా ఓజా(7) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255/8 స్కోరుతో ఆటకొనసాగిస్తోంది. ఇప్పటివరకు కివీస్‌పై భారత్‌కు 283 పరుగుల ఆధిక్యం లభించింది.
7, నవంబర్ 2010, ఆదివారం
జగన్‌కు చేదు ఫలితాలిచ్చిన నెల్లూరు ఓదార్పు
మరికొద్ది రోజుల తర్వాత జగన్‌కు మద్దతుగా నిలిచిన యువజన కాంగ్రెస్ అధ్యక్షులను పదవులు నుంచి తొలగించిం ది. టాలెంట్ హంట్ పేరుతో అధిష్ఠానం జగన్ వర్గాన్ని దాదాపు వెంటాడినంత పనిచేసింది. మీరు జగన్ వర్గమా ?అని నేరుగా ప్రశ్నించే పరిస్థితికి రావడంతో జగన్‌తో ఉంటే పదవులు రావన్న భయాందోళన సృష్టించడంలో విజయం సాధించింది.
చివరకు.. వైఎస్ జీవించి ఉన్నంతకాలం ఆయనకు గట్టి మద్దతుదారుగా ఉన్న మంత్రి ఆనం వర్గం ఒక్కసారిగా విధేయత మర్చి, జగన్‌కు దూరమయింది. ఈ ప్రకారంగా జగన్‌కు నెల్లూరు జిల్లా పర్యటన కలసి రాలేదనే చెప్పాలి.
జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం విస్పష్టంగా ఆదేశించడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నారు. ఒకవైపు భారీ వర్షాలతో జనం సమస్యల్లో చిక్కుకోకుండా, జగన్ వారిని పరామర్శించకుండా సొంత ఇమేజ్ పెంచుకుంటున్నారన్న భావన కూడా వ్యక్తమయింది. జగన్‌కు చెందిన సొంత మీడియా సంస్థలు తప్ప, మిగిలిన మీడియా సంస్థలేవీ యాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వక పోవటం . ... ఒద్దర్పు ప్రాధాన్యత తగ్గుతున్న క్రమంలోనే.. జగన్ వర్గం అటు సినీ నటి రొజాని... ఇటు లక్ష్మి పార్వతిని రంగంలోకి దించినా... వారి ప్రసంగాలలో జగన్‌కి జై కొట్టడం తప్ప.. విమర్శలు చేస్తున్న విపక్షలని పల్లెత్తు మాటనక పోవటంతో.. జగనే అధినేత్రి పై యుద్ధం ప్ర క టించి నట్లు కనిపిస్తోందని విశ్లేషకుల భావన
ఉప్పెనగా మారుతానంటున్న జగన్
సొంత పార్టీ వాళ్ళే తనను అడ్డుకునేందుకు శతప్రయత్నాలు చేయడం ఆవేదన కలిగిస్తోందని .... కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన కొండా సురేఖ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఎంతో మందిపై అకారణంగా ఎందుకు కక్ష సాధింపు చర్యలు పడటం తన సహనానికి హడ్డున్తుందని వ్యాక్యానిచాడంతో...
జగన్ కావాలనే మరో మారు అధిష్టానం పై స్వరం పెంచుతూ సొంత కుంపటి పెట్టుకునీన్దుకు సిద్దమవుతున్నాడని విమర్శలు వస్తునై
ఒబామా దంపతుల ఆటాపాటా
విజయవాడలో అయ్యప్ప భక్తులకు అన్న సమారాధన
గత నాలుగేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అరవై రోజుల పాటు జరిగే ఈ అన్నసమారాధనలో ప్రతి ఏటా దాదాపు లక్ష మంది దీక్షా పరులు సద్ది చేస్తుంటారని తెలిపారు. అయ్యప్ప దీక్షా పరులే కాకుండా భవానీమాల, శివ మాల, గోవింద మాల వేసే భక్తులు, ప్రాంగణానికి వచ్చి అన్న సమారాధన చేయవచ్చని తెలిపారు.